filmybuzz
filmybuzz

View

'ఈ మాయ పేరేమిటో'.. రాహుల్ విజయ్ సినిమాకి టైటిల్ ఖరారు!

Tuesday,April24th,2018, 10:47 AM

ముప్పై ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఎంతో మంది స్టార్స్‌కు అద్భుతమైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్. ఈయ‌న త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా ఇంట్ర‌డ్యూస్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్‌ బేనర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రానికి రాము కొప్పుల దర్శకుడు. దివ్య విజయ్‌ నిర్మాత. ల‌వ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి `ఈ మాయ పేరేమిటో` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు.


ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో టైటిల్‌ను రివీల్ చేయ‌డ‌మే కాకుండా.. సినిమాకు సంబంధించిన కొన్ని స‌న్నివేశాల‌ను, ఓ పాటను ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


హీరో రాహుల్‌ విజయ్‌ మాట్లాడుతూ - రాముగారు మంచి కథ చెప్పారు. సినిమా లవ్‌, అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌. లవ్‌ మెయిన్‌ ఎలిమెంట్‌గా మిగిలిన ఎలిమెంట్స్‌గా అన్ని దానికి లింక్‌ అయ్యి ఉంటాయి. చెప్పిన దాని కంటే సినిమాను బ్యూటీఫుల్‌గా తీశారు. సినిమా అంద‌రూ ఎంజాయ్ చేసేలా ఎంట‌ర్‌టైనింగ్‌గా, కూల్‌గా ఉంటుంది అన్నారు.


ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌ మాట్లాడుతూ - నాకు ఎంతో ఆద‌ర‌ణ ఇచ్చిన ఇండ‌స్ట్రీలోకి మా అబ్బాయిని హీరోగా ప‌రిచ‌యం చేయ‌డం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమాతో మా అమ్మాయి దివ్య విజ‌య్‌ను నిర్మాత‌గా ప‌రిచ‌యం చేస్తున్నాను. ద‌ర్శ‌కుడు రాము కొప్పుల‌గారు మంచి క‌థ‌ను ఇంకా అద్భుతంగా తెర‌కెక్కించారు. నన్ను ఆదరించిన తరహాలోనే మా అబ్బాయి, అమ్మాయిని ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.


ద‌ర్శ‌కుడు రాము కొప్పుల మాట్లాడుతూ - మంచి ల‌వ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌. సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. రాహుల్ విజ‌య్‌గారు సూప‌ర్బ్ పెర్ఫామర్‌.దివ్య విజ‌య్‌గారు మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. మ‌ణిశ‌ర్మ‌గారి సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్‌, శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ, న‌వీన్ నూలి ఎడిట్ వ‌ర్క్ సినిమాకు మేజ‌ర్ ప్ల‌స్ అవుతాయి. సినిమా చాలా బాగా వ‌చ్చింది. అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా సినిమా ఉంటుంది అన్నారు.


నిర్మాత దివ్యా విజ‌య్ మాట్లాడుతూ - సినిమాను అనుకున్న ప్లానింగ్‌లో పూర్తి చేశాం. రాహుల్ విజ‌య్‌, కావ్యా థాప‌ర్ పెయిర్ తెర‌పై చ‌క్క‌గా ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో పాటు ల‌వ్‌, కామెడీ ఎలిమెంట్స్ స‌హా అన్నీ అంశాల‌తో ద‌ర్శ‌కుడు రాముగారు సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వీలైనంత త్వ‌ర‌గా సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేస్తాం. మా ప్ర‌య‌త్నాన్ని స‌క్సెస్ చేస్తార‌ని భావిస్తున్నాం అన్నారు.


రాహుల్ విజ‌య్‌, కావ్యా థాప‌ర్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ముర‌ళీశ‌ర్మ‌, రాళ్ల‌ప‌ల్లి, ఈశ్వ‌రీరావు, ప‌విత్రా లోకేశ్‌, స‌త్యం రాజేశ్‌, జోశ్ ర‌వి, కాదంబ‌రి కిర‌ణ్ త‌దిత‌రులు ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీ: శామ్ కె.నాయుడు, ఫైట్స్‌: విజయ్‌, ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి, ఆర్ట్‌: చిన్నా, సాహిత్యం: శ్రీమ‌ణి, నిర్మాత‌: దివ్యా విజ‌య్‌, ద‌ర్శ‌క‌త్వం: రాము కొప్పుల.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Read More !