filmybuzz
filmybuzz

View

మెహబూబా వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ స్టోరీ ఇన్ టాలీవుడ్ - ఆకాష్ పూరి

Tuesday,May08th,2018, 12:09 PM

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తన తనయుడు ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై నేహాశెట్టి హీరోయిన్‌గా శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి కనెక్ట్స్‌ నిర్మించిన చిత్రం 'మెహబూబా'. 1971లో జరిగిన ఇండో-పాక్‌ యుద్ధ నేపథ్యంలో జరిగే లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. మే 11న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా...


ఆకాశ్ పూరి మాట్లాడుతూ - మే 11న మెహ‌బూబా విడుద‌ల‌వుతుంది. ఈ మూమెంట్ కోసం 15 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాను. సినిమా స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు 15 ఏళ్లు వెన‌క్కి వెళ్లిన‌ట్లు అనిపించింది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. అంద‌రూ సినిమా గురించి పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. మా నాన్న‌గారి ల‌వ్‌స్టోరీస్ డిఫ‌రెంట్‌గా ఉంటాయి. అలాగే ఈ ల‌వ్‌స్టోరీ కూడా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. మా నాన్న నుండి ఇలాంటి ల‌వ్‌స్టోరీ ఊహించ‌లేదు. వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ల‌వ్‌స్టోరీ ఇన్ టాలీవుడ్ అవుతుంది. కాలేజీ ల‌వ్‌స్టోరీ కాదు. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో ఇండియా అబ్బాయి, పాకిస్థాన్ అమ్మాయి మ‌ధ్య సాగే సినిమా. ఆర్మీ బ్యాక్‌డ్రాప్ అనగానే నేను సెట్ అవుతానా అనిపించింది. అలాగే చాలా రీసెర్చ్ చేశాను. వారెలా మాట్లాడుతారు. ఎలా న‌డుస్తారు. ఎలా సెల్యూట్ చేస్తారు అని చూసుకున్నాను. కాస్త టైమ్ ప‌ట్టింది. నాన్న క్యారెక్ట‌ర్ చెప్పిన త‌ర్వాత దానికి త‌గిన‌ట్టు ట్రై చేస్తాను. హీరోగా నా డెబ్యూ కాబ‌ట్టి న‌న్ను ఎక్క‌డో పెద్ద‌గా చూపించ‌లేదు. స్టోరీ ప్ర‌కారం నా రోల్ చాలా నేచుర‌ల్‌గా ఉంటుంది. పూర్వ జ‌న్మ‌ల నేప‌థ్యాలంటే న‌మ్మేవాణ్ణే. అయితే నా సినిమాకు అలాంటి కాన్సెప్ట్ వ‌స్తుంద‌ని అనుకోలేదు. నేను చిన్న‌ప్పుడు చేసిన సినిమాల కంటే ఈ సినిమాలో కొత్త‌గా ఉంటాను. చాలా విష‌యాలు నేర్చుకున్నాను. అలాప్ర‌తి సినిమాకు నేర్చుకుంటూనే ఉంటాను. సినిమా చూసిన వారంద‌రూ మీ నాన్న‌గారి స్టైల్‌కు డిఫ‌రెంట్‌గా ఉందన్నారు. అలా అన్నారు కాబ‌ట్టే మా నాన్న‌ను నేనే ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నాన‌ని చెప్ప‌గ‌లిగాను. నేను ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌లో.. ఓ బాధ్య‌త గ‌ల యువ‌కుడుగా క‌న‌ప‌డ‌తాను. పాకిస్థాన్ అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి పాకిస్తాన్‌కు కూడా వెళ‌తాడు. ఫైట్స్ కూడా చాలా బాగా వ‌చ్చాయి. రియ‌ల్ స‌తీశ్‌గారు చాలా బాగా ఫైట్స్ చేయించారు. పూర్వ జ‌న్మ‌ల నేప‌థ్యంలో తెలుగులో చాలా సినిమాలు వ‌చ్చాయి. అయితే ఏ సినిమాలో లేని ఓ పాయింట్ ఈ సినిమాలో క‌న‌ప‌డుతుంది. దేవుడి ద‌య వ‌ల్ల దాదాపు అందరి స్టార్స్‌తో ప‌ని చేశాను. అయితే ఓ ఒక్క‌రినో టార్గెట్‌గా పెట్టుకుని ప‌నిచేయ‌లేదు. నాకు ర‌జ‌నీకాంత్‌గారంటే పిచ్చి. ఆయ‌న నాకు దేవుడు. ఇన్‌స్పిరేష‌న్‌. ఇక ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్ట‌ర్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకు త‌గిన విధంగా నేహాశెట్టి అద్భుతంగా న‌టించింది. నెక్ట్స్ మూవీ కూడా మా నాన్న‌తోనే ఉంటుంది. ప్ర‌స్తుతం స్టోరీ రెడీ అవుతుంది. వివ‌రాల‌ను అనౌన్స్ చేస్తాం అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !