View

అల్లుడు 'సమ్మోహనం' ట్రైలర్ ని ఆవిష్కరించిన సూపర్ స్టార్ కృష్ణ

Thursday,May31st,2018, 05:34 AM

సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు సందర్భంగా నేడు (గురువారం) ఆయ‌న చేతుల‌మీదుగా `స‌మ్మోహ‌నం` ట్రైల‌ర్ విడుద‌లైంది. సుధీర్‌బాబు, అదితీరావు హైద‌రి జంట‌గా మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మించిన చిత్రం `స‌మ్మోహ‌నం`. శ్రీదేవి మూవీస్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 10గా తెర‌కెక్కిన `స‌మ్మోహ‌నం` జూన్ 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


`స‌మ్మోహ‌నం` ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన‌ సూప‌ర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ - స‌మ్మోహ‌నం టైటిల్ చాలా బావుంది. శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌గారు తీసిన `ఆదిత్య 369` చాలా గొప్ప సినిమా .`స‌మ్మోహ‌నం` లో ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్ చాలా బావున్నాయి. `స‌మ్మోహ‌నం` ట్రైల‌ర్ చూస్తుంటే పెద్ద హిట్ అవుతుంద‌ని అనిపిస్తోంది. సుధీర్ ఇదివ‌ర‌కు సినిమాల‌క‌న్నా ఈ సినిమాలో చాలా బావున్నాడు. ట్రైల‌ర్ చాలా ఇంప్ర‌సివ్‌గా ఉంది. ఈ పిక్చ‌ర్ సూప‌ర్‌డూప‌ర్ హిట్ అవుతుంద‌ని ఆశిస్తున్నా. ప్రేక్ష‌కుల‌కు ఆనందం క‌లిగిస్తుంద‌ని భావిస్తున్నా. మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటిగారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన గ‌త చిత్రాల‌న్నీ స‌క్సెస్‌ఫుల్ సినిమాలే. ఈ సినిమా కూడా వాటిని మించి స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నా అని అన్నారు.


నిర్మాత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ - రామారావుగారి అభిమానులైనా, నాగేశ్వ‌ర‌రావుగారి అభిమానులైనా, మ‌రే హీరో అభిమానులైనా.. అంద‌రూ కృష్ణ‌గారి అభిమానులే. కృఫ్ణ‌గారి సినిమాలు చూస్తూ మేమంద‌రం పెరిగాం. ఆయ‌న్ని అంత‌గా ప్రేమించేవాళ్లం. అలాంటి సూప‌ర్‌స్టార్ కృష్ణగారి పుట్టిన‌రోజున మా ట్రైల‌ర్‌ని ఆయ‌నే విడుద‌ల చేయ‌డం మా అదృష్టం. వెరీ వెరీ హ్యాపీ క్ష‌ణాలివి. చ‌ల్ల‌ని చేతుల‌తో కృష్ణ‌గారు మాకు ఆశీర్వాదం అందించారు. మేం అద్భుత‌మైన విజ‌యం సాధించ‌బోతున్నాం అని అన్నారు.


హీరో సుధీర్‌బాబు మాట్లాడుతూ - ముందుగా మావ‌య్య‌గారు సూప‌ర్‌స్టార్ కృష్ణ‌గారికి వెరీ వెరీ హ్యాపీ బ‌ర్త్ డే. ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నా చిత్రం` స‌మ్మోహ‌నం` ట్రైల‌ర్‌ను ఆయ‌న విడుద‌ల చేశారు. మావ‌య్య‌గారికి ట్రైల‌ర్ చాలా బాగా న‌చ్చింది. టీజ‌ర్ ఎలాగైతే ప్రేక్ష‌కులు అంద‌రికీ న‌చ్చిందో, ట్రైల‌ర్ కూడా అలాగే త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. జూన్ 15న సినిమా విడుద‌ల‌వుతుంది అని అన్నారు.


దర్శకుడు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి మాట్లాడుతూ - చిన్న‌ప్ప‌టి నుంచి సూప‌ర్‌స్టార్ కృష్ణ‌గారి సినిమాలు చూస్తూ, తీవ్రంగా అభిమానిస్తూ పెరిగాను. ఆయ‌న చేతుల మీదుగా మా `స‌మ్మోహ‌నం` సినిమా ట్రైల‌ర్ ఇవాళ ఆవిష్కృత‌మైంది. ఇంత‌కంటే శుభ‌సూచికం ఉండ‌ద‌ని అనుకుంటున్నా. మా `స‌మ్మోహ‌నం` ఆద్యంతం వినోదాత్మ‌కంగా ఉంటుంది. క‌థ‌లో అంద‌మైన రొమాన్స్ తో పాటు ఆరోగ్య‌క‌ర‌మైన హాస్యం మిళిత‌మై ఉంటుంది. అర్థ‌వంత‌మైన పాత్ర‌లుంటాయి. ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతుంది. నేను తీసిన సినిమాల్లో నాకు చాలా న‌చ్చిన సినిమా. నేను మ‌రింత‌గా ప్రేమించి తీసిన సినిమా. ముఖ్యంగా ఈ చిత్రంలో సుధీర్ చాలా కొత్త‌గా ఉంటాడు. అత్యుత్త‌మ‌స్థాయి న‌ట‌న‌ను సుధీర్ చూపించ‌గ‌ల‌ర‌నడానికి మా చిత్రం ఓ ఉదాహ‌ర‌ణ‌. నాయిక‌ అదితీరావు హైద‌రీ అద్భుతంగా చేశారు. న‌రేశ్ స్పెష‌ల్ పాత్ర‌లో చేశారు. ప‌విత్ర లోకేష్‌, హ‌ర్షిణి, రాహుల్ రామ‌కృష్ణ... ఇలా అంద‌రూ క‌లిసి చాలా బాగా చేశారు. అద్భుత‌మైన ప్ర‌తిభ ఉన్న న‌టీన‌టులు ఒక‌చోట క‌లిస్తే ఎంత బావుంటుందో ఈ సినిమా ఒక ఉదాహ‌ర‌ణ‌. మేం ఎంత‌గానో ప్రేమించి తీసిన ఈ సినిమా మేం ఎంత‌గానో ప్రేమించే కృష్ణ‌గారి చేతుల మీదుగా విడుద‌ల కావ‌డం నాకు చాలా ఆనంద‌గానూ, గ‌ర్వంగానూ ఉంది. జూన్ 15న `స‌మ్మోహ‌నం` ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. నా గ‌త చిత్రాల్లాగానే ఈ సినిమాను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌నే గ‌ట్టి న‌మ్మ‌కం ఉంది అని చెప్పారు.


స‌మ్మోహ‌నం న‌టీన‌టులు:
సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, డా .వీకే న‌రేశ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పవిత్రా లోకేష్ ,హర్షిణి , నందు, కాదంబ‌రి కిర‌ణ్‌, హ‌రితేజ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, కేదార్ శంక‌ర్‌, శిశిర్‌శ‌ర్మ త‌దిత‌రులు.


సాంకేతిక నిపుణులు:
ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్: పి. ర‌షీద్ అహ్మ‌ద్ ఖాన్‌, కె. రామాంజ‌నేయులు, కో డైర‌క్ట‌ర్‌: కోట సురేశ్ కుమార్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: య‌స్ . ర‌వీంద‌ర్‌, ఎడిట‌ర్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేశ్‌; డైర‌క్ట‌ర్ ఆఫ్ పొటోగ్ర‌ఫీ: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగ‌ర్‌, పాట‌లు: `సిరివెన్నెల‌` సీతారామ‌శాస్త్రి, రామ‌జోగయ్య‌శాస్త్రి, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ,నిర్మాత‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌, ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటిAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !