View

'తేజ్' ఐ లవ్ యు అందరికీ నచ్చుతుంది - నిర్మాత కె.యస్

Thursday,May31st,2018, 03:18 PM

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ. కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌. రామారావు, వల్లభ నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'తేజ్‌'. ఐలవ్‌యు అనేది ఉపశీర్షిక. జూన్ 29న ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం రీరికార్డింగ్‌ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మే 31న హైదరాబాద్‌ ఫిల్మ్‌ఛాంబర్‌లో ప్రెస్‌మీట్‌ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌. రామారావు, దర్శకుడు ఎ. కరుణాకరన్‌ పాల్గొన్నారు.


క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌. రామారావు మాట్లాడుతూ - ''35 సంవత్సరాల క్రితం నుండి క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బేనర్‌లో నేను సినిమాలు తీయడం మొదలుపెట్టాను. సినిమాల మీద వున్న ఇంట్రెస్ట్‌, ప్రేమతో నా అభిరుచి మేరకు ప్రేక్షకులకు నచ్చేవిధంగా సినిమాలు తీశాను. నేను సాధారణ ప్రేక్షకుడిని. అందుకు తగ్గట్లుగా మంచి కథని సెలెక్ట్‌ చేసుకొని కాన్ఫిడెన్స్‌తో సినిమాలు తీశాను. ఇప్పటివరకు 44 సినిమాలు తీశారు. అందులో కొన్ని డబ్బింగ్‌ చిత్రాలు కూడా వున్నాయి. 'తేజ్‌' 45వ చిత్రం. ఈ 45 చిత్రాల జర్నీలో ప్రేక్షకులు, జర్నలిస్ట్‌లు ఎంతోమంది సహకరించి ప్రోత్సహించారు. సత్కారాలు, సన్మానాలు, ఎన్నో అవార్డ్స్‌, రివార్డ్స్‌ లభించాయి. ఇవన్నీ నాకు పెద్దగా ఇంట్రెస్ట్‌ కాదు. డిఫరెంట్‌గా ఇంకా మంచి సినిమాలు ప్రేక్షకులు అందించాలి. నాతోటి ప్రొడ్యూసర్స్‌ తీసే సినిమాలు అన్నీ చూస్తూ ఇంకా బెటర్‌గా నేనేం తియ్యాలి అని నన్ను నేను రీ పబ్లిష్‌ చేసుకుంటూ ఫ్యూచర్‌ని కొనసాగిస్తున్నాను. నా చివరి శ్వాస వరకు నేను సినిమాలు తీస్తూనే వుంటాను అని నమ్ముతూ మీ అందరి సహకారం నాకు వుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడున్న కొత్త కొత్త మాధ్యమాల ద్వారా మా 'తేజ్‌' చిత్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇదొక లవ్‌, ఫ్యామిలీ డ్రామా. స్వీట్‌గా, ఈస్థటిక్‌గా వుంటుంది. డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌, సెన్సార్‌ కట్స్‌ లేకుండా నీట్‌గా, క్లీన్‌గా సెంటిమెంట్‌, ఎమోషన్స్‌ని కలగలిపి కరుణాకరన్‌ ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా చిత్రీకరించారు. చక్కని కుటుంబ కథా చిత్రాలు యూత్‌కి నచ్చేవిధంగా తీసే దర్శకుడు కరుణాకరన్‌ 'తొలిప్రేమ' నుండి ఆయనకొక ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ప్రేక్షకుల్లోనూ, ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్‌ వుంది ఆయనకి. ఎంత పెద్ద హీరో అయినా కరుణాకరన్‌తో ఒక్క సినిమా అయినా చెయ్యాలి అని కోరుకునే హీరోలు లేకపోలేదు అని నా నమ్మకం. అలాంటి కరుణాకరన్‌తో నేను రెండో సినిమా తీస్తున్నాను. మొదటి సినిమా 'వాసు'. ప్రజాదరణతో పాటు మ్యూజికల్‌గా పెద్ద హిట్‌ అయ్యింది. ఉత్తమ ఫ్యామిలీ కథా చిత్రంగా నంది అవార్డుని కూడా గెలుచుకుంది. అలాగే ఈ 'తేజ్‌' కూడా చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం అవుతుంది. సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌ ఇద్దరూ బ్యూటిఫుల్‌గా నటించారు. గోపీసుందర్‌ ఐదు పాటలకి అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చాడు. రామజోగయ్య శాస్త్రి, సాహితి, రాంబాబు, రెహమాన్‌లు ఫెంటాస్టిక్‌ లిరిక్స్‌ రాశారు. జూన్‌ 2న ఈ చిత్రంలోని మొదటి పాటని క్రికెట్‌ మ్యాచ్‌ ద్వారా రిలీజ్‌ చేస్తున్నాం. 9వ తేదీన జె.ఆర్‌.సి. కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆడియో ఫంక్షన్‌ని చాలా గ్రాండ్‌గా జరపనున్నాం. ప్రస్తుతం రీరికార్డింగ్‌ వర్క్‌ జరుగుతోంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని జూన్‌ నెలాఖరులో తేజ్‌ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.


చిత్ర దర్శకుడు ఎ. కరుణాకరన్‌ మాట్లాడుతూ - ''క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బేనర్‌లో రెండో సినిమా చేయడం చాలా హ్యాపీగా వుంది. నేను ఏదైతే అనుకున్నానో.. ఎలాంటి సినిమా చెయ్యాలనుకున్నానో ఆవిధంగా కె.ఎస్‌.రామారావుగారు బ్యూటిఫుల్‌గా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్‌ చేశారు. ఈ బేనర్‌లో ఇంత మంచి సినిమా చేసినందుకు చాలా గర్వంగా వుంది. ఇది 10వ సినిమా. సాయిధరమ్‌ తేజ్‌, అనుపమతో ఫస్ట్‌టైమ్‌ వర్క్‌ చేస్తున్నాను. ఇద్దరూ సూపర్బ్‌గా చేశారు. సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. క్యూట్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందిన 'తేజ్‌' చిత్రం అందరికీ నచ్చుతుంది. గోపీసుందర్‌ వండ్రఫుల్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. ఆండ్రూ ప్రతి ఫ్రేమ్‌ని బ్యూటిఫుల్‌గా చిత్రీకరించారు. మా టెక్నీషియన్స్‌ అందరికీ థాంక్స్‌. అలాగే రామారావుగారికి నా కృతజ్ఞతలు'' అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !