filmybuzz

View

అభిమన్యుడు బాక్సాఫీస్ రిపోర్ట్.. థియేటర్స్ ని పెంచాం - నిర్మాత హరి

Monday,June04th,2018, 01:28 PM

300 సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి...స‌క్సెస్‌ఫుల్ డిస్ట్రిబ్యూట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు గుజ్జ‌ల‌పూడి హ‌రి. హీరో విశాల్‌తో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తూ ఆయ‌న హీరోగా న‌టించిన రాయుడు, ఒక్కడొచ్చాడు, డిటెక్టివ్ చిత్రాలు త‌ర్వాత రీసెంట్‌గా విడుద‌లైన అభిమ‌న్యుడు సినిమాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించారు నిర్మాత హ‌రి. రీసెంట్‌గా మాస్ హీరో విశాల్ కథానాయకుడిగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అభిమన్యుడు. ఎం.పురుషోత్తమన్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందించారు. జూన్ 1న విడుద‌లైన ఈ సినిమాతో నిర్మాత‌గా చాలా పెద్ద హిట్‌ను అందుకున్నారు నిర్మాత హ‌రి.


రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సాధించిన క‌లెక్ష‌న్స్ .. నైజాం 2.90 కోట్ల రూపాయలు, వైజాగ్ 75 ల‌క్ష‌లు, సీడెడ్ 68 ల‌క్ష‌లు, కృష్ణా 56.46 ల‌క్ష‌లు, గుంటూరు 53 ల‌క్ష‌లు, నెల్లూరు 26 ల‌క్ష‌లు, ఇత‌ర ప్రాంతాలు 70 ల‌క్ష‌లు ... మూడు రోజుల్లో 7.10 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసి విశాల్ కెరీర్‌లోనే బెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది.


ఈ సంద‌ర్భంగా నిర్మాత గుజ్జ‌ల‌పూడి హ‌రి మాట్లాడుతూ - సినిమా మేం ఊహించిన దాని కంటే చాలా పెద్ద హిట్ అయ్యింది. మంచి సినిమాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌న‌డానికి ఇదొక ఉదాహ‌ర‌ణ‌. నా మిత్రులైన డిస్ట్రిబ్యూట‌ర్స్ అంద‌రూ ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. నాలుగేళ్లుగా మంచి విజ‌యం కోసం వెయిట్ చేసిన నాకు ఈ సక్సెస్‌తో ఆనందంగా ఉంది. డిజిట‌ల్ ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో సామాన్యుడు ఎదుర్కొంటున్న క‌ష్టాల‌ను ద‌ర్శ‌కుడు మిత్ర‌న్ అద్భుతంగా తెర‌కెక్కించారు. దాంతో సినిమాకు ప్రేక్ష‌కులు చ‌క్క‌గా క‌నెక్ట్ అయ్యారు. సాధార‌ణంగా సామాజిక బాధ్య‌త‌ను ఫీల‌య్యే హీరో విశాల్ నిజ జీవితంలో పాత్ర‌కు ఈ పాత్ర చాలా ద‌గ్గ‌ర‌గా ఉంది. ఆల్‌రెడీ 600 థియేట‌ర్స్‌లో విడుద‌లైన ఈ సినిమాకు మ‌రో 60థియేట‌ర్స్ పెంచాం. స‌మంతగారు న‌టించిన హిట్ చిత్రాల‌న్నింటిని ఓ డిస్ట్రిబ్యూట‌ర్‌గా నేను డిస్ట్రిబ్యూట్ చేసి ఉన్నాను. ఇప్పుడు మ‌రోసారి ఆమె హీరోయిన్‌గా న‌టించిన సినిమా నిర్మాతగా స‌క్సెస్ అందుకోవ‌డం ఆనందంగా ఉంది. అలాగే అర్జున్ గారి క్యారెక్ట‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తుంది. ఇంత పెద్ద విజ‌యాన్ని అందించిన తెలుగు ప్రేక్ష‌కుల‌ను వైజాగ్‌, రాజ‌మండ్రి, విజ‌యవాడ స‌హా ప‌లు ప్రాంతాల్లో యూనిట్ నేరుగా క‌లుసుకుని త‌మ ఆనందాన్ని పంచుకుంటారు. అలాగే ఈ గురువారం ఓ స‌క్సెస్ మీట్‌ను కూడా నిర్వ‌హించ‌బోతున్నాం.


సినిమా స్క్రిప్ట్ ద‌శ నుండే నాకు తెలుసు . కాబ‌ట్టి సినిమా పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని న‌మ్మ‌కం ఉంది. ఎంతో బిజీగా ఉన్నప్ప‌టికీ ఇంత మంచి సినిమాను వ‌దులుకోకూడ‌ద‌ని విశాల్‌గారు నిర్ణ‌యించుకుని సినిమా చేయ‌డానికి రెడీ అయ్యారు. త‌న వ‌ల్ల ఎవ‌రూ న‌ష్ట‌పోకూడ‌ద‌ని ఆలోచించే హీరోల్లో విశాల్‌గారు ఉంటారు. కాబ‌ట్టి ఆయ‌న కొత్త స‌బ్జెక్స్ట్‌ను రిస్క్ తీసుకునైనా త‌నే నిర్మిస్తారు. ఈ సినిమా క‌థ న‌చ్చగానే త‌న హోం బ్యాన‌ర్‌లోనే సినిమా చేయ‌డానికి విశాల్‌గారు రెడీ అయ్యారు. `పందెంకోడి` త‌ర్వాత ఆయ‌న కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ `అభిమ‌న్యుడు` చిత్ర‌మే. ఈ సినిమాకు సీక్వెల్ కూడా చేయాల‌ని విశాల్‌గారు అనుకుంటున్నారు. అలాగే విశాల్‌గారు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎక్క‌డ నుండి పోటీ చేస్తారో ఇప్పుడే చెప్ప‌లేం. అలాగే విశాల్‌గారి 25వ సినిమా `పందెంకోడి 2` రెండు షెడ్యూల్స్ పూర్త‌య్యాయి. ఓ మేజ‌ర్ షెడ్యూల్‌లో షూటింగ్ పూర్త‌వుతుంది. ద‌స‌రాకు విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాం అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !