View

సిల్లీ ఫెలోస్ గా అల్లరి నరేష్, సునీల్

Friday,June08th,2018, 02:14 PM

బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో ప్రొడక్షన్ 3 గా వస్తున్న చిత్రం "సిల్లీ ఫెల్లోస్". అల్లరి నరేష్, సునీల్, చిత్ర శుక్లా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి భీమనేని శ్రీనివాస్ రావు దర్శకత్వం వహిస్తుండగా.. కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ అనౌన్స్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం రామానాయుడు స్టూడియోలో జరిగింది...


ఈ సందర్భంగా దర్శకుడు భీమినేని శ్రీనివాస్ మాట్లాడుతూ..."అల్లరి నరేష్ తో నేను తీసిన "సుడిగాడు" పెద్ద హిట్ అయ్యింది. మళ్లీ మా కాంబినేషన్ "సిల్లి ఫెల్లోస్"తో రిపేట్ అవుతుండడం ఆనందంగా ఉంది. సునీల్ ఈ చిత్రంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. సునీల్ నుంచి ఆడియన్స్ ఏం ఎక్సపెక్ట్ చేశారో అదే ఈ సినిమాలో ఉంటుంది. హీరోలు అని కాకుండా మంచి కమిట్మెంట్ తో వర్క్ చేశారు ఇద్దరూ. ఇంత మంచి నిర్మాతలను ఇచ్చిన వివేక్ గారికి నా కృతఙ్ఞతలు. బ్లూ ప్లానెట్ లో వచ్చిన రెండు చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సిల్లీ ఫెల్లోస్ మూడవ విజయం అవుతుందని ఆశిస్తున్నా. ఇందులో చిత్రా శుక్లా పాత్ర చాలా డిఫికల్ట్.. అయినా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఒక సంవత్సరం పాటు కష్టపడి హిట్ కొట్టాలనే ఉద్దేశ్యం తోనే వస్తున్నాం. దాదాపు 200 టైటిల్స్ అనుకున్నాం. ఆఖరికి నా 'ఎస్' సెంటిమెంట్ ను కూడా వదిలేద్దామనుకున్నా. కానీ అదే "ఎస్"తో టైటిల్ ఫిక్స్ చేసాము. "సిల్లీ ఫెల్లోస్" అందరినీ ఎంటర్టైన్ చేసే చిత్రం అవుతుందని నమ్మకంగా ఉన్నాం" అన్నారు.


నిర్మాతల్లో ఒకరైన భరత్ చౌదరి మాట్లాడుతూ... "సుడిగాడు కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ ఈ సినిమాను చేస్తున్నాము. సినిమా రిలీజ్ తరువాత మేము సినిమాని ఎందుకు చేశామో తెలుస్తుంది. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది ఈ "సిల్లీ ఫెలోస్". "నేనె రాజు నేనె మంత్రి, ఎమ్ ఎల్ ఎ" చిత్రాల తర్వాత మా బ్యానర్ లో వస్తున్న 3వ ప్రొడక్షన్ ఈ సినిమా. తప్పకుండా హ్యాట్రిక్ కొడతామని నమ్ముతున్నా" అన్నారు.


ఇవివి గారి సినిమాల తరహా లాంటి సినిమా లు రావడం లేదు అనుకుంటున్న సందర్భంలో భీమినేని శ్రీనివాస్ ఈ కథను మా దగ్గరికి తీసుకు వచ్చారు.. ఆడియన్స్ ను పూర్తి స్థాయిలో నవ్వించేలా సిల్లిఫెల్లోస్ చిత్రం ఉంటుందని తెలిపారు మరో నిర్మాత కిరణ్.


హీరోయిన్ చిత్ర శుక్లా మాట్లాడుతూ... "నరేష్ సునీల్ గార్లతో వర్క్ చేయడం కొత్త ఎక్స్పీరియన్స్ ను ఇచ్చింది. డిఫికల్ట్ రోల్ ప్లే చేస్తున్నా. బెస్ట్ ఫిల్మ్ తో వస్తున్నాం చూసి ఆదరించాలని కోరుతున్నా" అన్నారు.


సునీల్ మాట్లాడుతూ... "ఆడియన్స్ నా నుంచి ఏదైతే ఇన్నాళ్లు మిస్ అయ్యారో.. అదే నేను కూడా మిస్ అయ్యాను.. కానీ ఈ "సిల్లీ ఫెలోస్"తో ఆ కోరిక తీరనుంది. హెల్తీ వాతావరణం లో షూటింగ్ జరుపుకున్నాము. ఈవివి గారి బ్యానర్ అంటే నాకు ప్రాణం. అలాంటి బ్యానర్ లో మాత్రమే వచ్చాయి "సిల్లి ఫెల్లోస్" లాంటి సినిమాలు. ఈ మధ్య అన్నీ కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీస్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలు రావడం లేదు. ఒక్క భీమినేని గారి వలనే అవుతుంది. నరేష్ గారితో వర్క్ చేయడం పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకునేంత ఫ్రీడమ్ ఏర్పడుతుంది.. అలాంటి మంచి మనిషి అతను. ఒకప్పటి కామెడీ జోనర్ లను తలపించే సినిమా అవుతుందని నమ్మకంగా చెప్పగలను" అన్నారు.


అల్లరి నరేష్ మాట్లాడుతూ... "సుడిగాడు లాంటి హిట్ సినిమాను ఇచ్చక మళ్లీ ఈ కాంబినేషన్ లో రావాలంటే మొదట భయం వేసింది. ఆ రేంజ్ హిట్ ఇవ్వగలమా అని, కానీ దాదాపు 3 ఇయర్స్ స్క్రిప్ట్ పై పనిచేసి చేసిన సినిమా "సిల్లీ ఫెల్లోస్". పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ తో వస్తున్నాం. ఇందుకు తోడయ్యాడు సునీల్. ఈ ప్రొడక్షన్ లో వస్తున్న మూడో సినిమా కనుక తప్పకుండా హ్యాట్రిక్ కొడుతున్నాం" అన్నారు.


అల్లరి నరేష్, సునీల్, చిత్ర శుక్లా, పూర్ణ, నందిని రాయ్, బ్రహ్మానందం, పోసాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అనిష్ తరుణ్ కుమార్, ఆర్ట్: ఎమ్.కిరణ్ కుమార్, మ్యూజిక్: శ్రీ వసంత్, ఎడిటర్: గౌతమ్ రాజు, యాక్షన్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, భాను, లిరిక్స్: కాశర్ల శ్యామ్, చిలకరెక్క గణేష్, నిర్మాతలు: కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, సహ నిర్మాత: వివేక్ కుచిబొట్ల, దర్శకుడు: భీమినేని శ్రీనివాస్.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !