View

డబ్బులతో పాటు 'అభిమన్యుడు' మంచి పేరు కూడా తెచ్చిపెట్టాడు - నిర్మాత హరి

Saturday,June09th,2018, 04:43 PM

మాస్‌ హీరో విశాల్‌, హ్యాట్రిక్‌ హీరోయిన్‌ సమంత యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ప్రధాన పాత్రల్లో విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బేనస్స్‌పై ఎమ్‌. పురుషోత్తమ్‌ సమర్పణలో యువ నిర్మాత జి. హరి నిర్మించిన 'అభిమన్యుడు' గతవారం విడుదలై సూపర్‌ టాక్‌తో సూపర్‌ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ఏర్పాటు చేసిన బ్లాక్‌బ‌స్ట‌ర్ సెలబ్రేష‌న్స్‌లోహీరో విశాల్‌, అర్జున్‌, పి.ఎస్‌.మిత్ర‌న్‌, శ్రీనాథ్‌, కో ప్రొడ్యూసర్స్ ప్ర‌కాశ్‌, ఎన్‌.పురుషోత్త‌మ్‌, ర‌చ‌యిత రాజేశ్‌, వైజాగ్ పూర్వీ పిక్చ‌ర్స్ వేగి వీర్రాజు, వెస్ట్ గోదావరి ఉషా పిక్చ‌ర్స్ డిస్ట్రిబ్యూట‌ర్ ఉద‌య్‌, సీడెడ్ డిస్ట్రిబ్యూట‌ర్ శ్రీనివాస్‌, కృష్ణా డిస్ట్రిబ్యూట‌ర్ ఎన్‌.స‌ర్వేశ్వ‌ర్‌రావు, గుంటూరు పూర్ణోద‌యా పిక్చ‌ర్స్ శ్రీను, నెల్లూరు అంజ‌లి పిక్చ‌ర్స్ భాస్క‌ర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.


ఈ సంద‌ర్భంగా నిర్మాత జి.హ‌రి మాట్లాడుతూ - మా అభిమ‌న్యుడు చిత్రాన్ని బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. చాలా రోజులు నుండి నిర్మాత‌గా స‌క్సెస్ కోసం ఎదురుచూస్తున్నాను. వారం రోజుల్లోనే సినిమా 12 కోట్ల రూపాయ‌ల క‌లెక్ష‌న్స్‌ను వ‌సూలు చేసింది. డ‌బ్బుల‌తో పాటు మంచి పేరు కూడా తెచ్చి పెట్టిన సినిమా ఇది.ఈ సినిమాకు నిర్మాత‌గా కావ‌డం గ‌ర్వంగా ఉంది. రెండో వారంలో కూడా సినిమా స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. ఇంకా సినిమా 265 థియేట‌ర్స్‌లో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు పి.ఎస్‌.మిత్ర‌న్ అత్య‌ద్భుతంగా తెర‌కెక్కించారు. విశాల్‌గారు స్క్రీన్‌పైనే కాదు..రియ‌ల్ లైఫ్‌లో కూడా హీరోనే. అందుకనే సినిమా ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయ్యింది. నిజ జీవితానికి విశాల్‌గారి క్యారెక్ట‌ర్ ద‌గ్గ‌ర‌గా ఉండ‌టంతో సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. అర్జున్‌గారు ఎక్స్‌ట్రార్డిన‌రీగా న‌టించారు. రాజేశ్‌గారు మంచి డైలాగ్స్ రాశారు. విశాల్‌గారు ఇంత మంచి సినిమాను నాకు ఇచ్చినంద‌కు ఆయ‌న‌కు నా స్పెష‌ల్ థాంక్స్‌ అన్నారు.


పి.ఎస్‌.మిత్ర‌న్ మాట్లాడుతూ - ద‌ర్శ‌కుడిగా నాకు చాలా ఆనందంగా ఉంది. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన ఈ సినిమా తెలుగులో కూడా పెద్ద విజ‌యాన్ని అందుకోవ‌డం ఇంకా ఆనందంగా ఉంది. సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు బాగా రిసీవ్ చేసుకున్నారు. రాజేశ్ డైలాగ్స్‌, జార్జ్ సి.విలియ‌మ్స్ సినిమాటోగ్ర‌ఫీ, యువ‌న్ శంక‌ర్‌గారి మ్యూజిక్ స‌హా అంద‌రూ ఎంతో ఎఫ‌ర్ట్ పెట్టి ప‌నిచేశారు. డ‌బ్బింగ్ సినిమాలా కాకుండా స్ట్ర‌యిట్ సినిమాను ఆద‌రించిన‌ట్లు ప్రేక్ష‌కులు ఈ సినిమాను ఆద‌రించారు. విశాల్‌గారు నిర్మాత చాలా క‌ష్ట‌ప‌డి ఈ సినిమా చేశారు. అర్జున్‌గారి క్యారెక్ట‌ర్‌కి చాలా మంచి కాంప్లిమెంట్స్ వ‌స్తున్నాయి. వైట్ డెవిల్‌గా ఆయ‌న అద్భుతంగా న‌టించారు. త‌మిళంలో చాలా ఇబ్బంద‌లు మ‌ధ్య విడుద‌లైన సినిమా పెద్ద హిట్ అయ్యింది. ద‌ర్శ‌కుడిగా నాతో పాటు యూనిట్ అంద‌రం సినిమా కోసం హార్డ్ వ‌ర్క్ చేశాం అన్నారు.


అర్జున్ మాట్లాడుతూ - సినిమా స‌క్సెస్ షీల్డుల‌ను మ‌రిచిపోతున్న రోజుల్లో అభిమ‌న్యుడు తో బ్లాక్‌బ‌స్ట‌ర్ షీల్డ్‌ను అందుకోవ‌డం ఆనందంగా ఉంది. డిస్ట్రిబ్యూట‌ర్స్ ముఖాల్లో ఆనందం క‌న‌ప‌డుతుంది. ఈ సినిమాలో వ‌ర్క్‌చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్‌కు నా అభినంద‌న‌లు. నా క్యారెక్ట‌ర్‌కి చాలా మంచి పేరు వ‌చ్చింది. ఓ సినిమా హిట్ లేదా ప్లాప్‌కి డైరెక్ట‌రే కార‌ణం. ఈ సినిమా ఇంత పెద్ద హిట్‌కావ‌డం వెనుక ఉన్న క్రెడిట్ మిత్ర‌న్‌కే ద‌క్కుతుంది. విశాల్ హీరోగా, ప్రొడ్యూస‌ర్‌గా ఎంత క‌ష్టాలు వ‌చ్చినా.. అభిమ‌న్యుడులా ఫైట్ చేసి నిజ‌మైన విక్ట‌రీ అంటే ఇదేన‌ని నిరూపించారు. ఈ సినిమాతో రియ‌ల్ లైఫ్ హీరో అని విశాల్ ప్రూవ్ చేసుకున్నాడు. హ‌రి టెస్ట్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్‌, డిస్ట్రిబ్యూట‌ర్‌. ఈ సినిమాను చాలా ప్లాన్‌తో ఫ్రాంచైజీ చేశారు అన్నారు.


హీరో విశాల్ మాట్లాడుతూ - త‌మిళంలో ఐదో వారం వ‌చ్చిన సినిమా హౌస్‌ఫుల్‌గానే ర‌న్ అవుతుంది. ఓవ‌ర్‌సీస్ స‌హా ఇక్క‌డ విడుద‌లైన ప్ర‌తి స్టేట్‌లో సినిమా స్ట్రాంగ్‌గా ర‌న్ అవుతుంది. అభిమానులే కాదు, విమ‌ర్శ‌కుల నుండి కూడా సినిమాకు మంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల త‌ర్వాత తెలుగులో ఇంత పెద్ద హిట్ వ‌చ్చినందుకు ఆనందంగా ఉంది. డిస్ట్రిబ్యూట‌ర్స్‌, థియేట‌ర్స్ య‌జ‌మానులు హ్యాపీగా ఉన్న‌ప్పుడే నిజ‌మైన ఆనందం. అంద‌రూ స‌మ్మ‌ర్‌కి బ్లాక్‌బ‌స్ట‌ర్ వ‌చ్చింద‌ని అంద‌రూ హ్యాపీగా ఫీలైంది. నా కెరీర్‌లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. త‌మిళం స‌హా తెలుగులో కూడా ఒకేరోజు విడుద‌ల ప్లాన్ చేసిన‌ప్ప‌టికీ తెలుగులో మే 11న ఎక్కువ సినిమాలు ఉండటంతో సోలోగా మంచి థియేట‌ర్స్‌లో సినిమాను విడుద‌ల చేయాల‌ని జూన్ 1న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చాం. మిత్ర‌న్ ఇంటెలిజెంట్‌గా సినిమాను తెర‌కెక్కించారు. శంక‌ర్‌గారి జెంటిల్‌మెన్‌, మురుగ‌దాస్‌గారి గ‌జిని సినిమాల్లా ఈ సినిమాతో మిత్ర‌న్ మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగు ప్రేక్ష‌కుల‌తో పాటు నార్త్ ఇండియాలో కూడా ప్రేక్ష‌కులు సినిమాను ఆద‌రిస్తున్నారు. మీడియా కూడా ఈ స‌క్సెస్‌లో త‌మ‌వంతు పాత్ర‌ను పోషించింది. ఈ సంద‌ర్భంగా మీడియాకి థాంక్స్‌ అన్నారు.


కార్య‌క్ర‌మంలో పాల్గొన్న డిస్ట్రిబ్యూట‌ర్స్ కూడా సినిమా స‌క్సెస్ ప‌ట్ల త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.


ఈ సినిమా ద్వారా వ‌చ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతుల‌కు అంద‌చేయాల‌నుకున్న‌ట్లు హీరో విశాల్‌, నిర్మాత హ‌రి తెలిపారు. ఈ విషయంపై స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌నను వ‌చ్చే వారం తెలియ‌చేస్తామ‌ని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !