filmybuzz

View

జంబలకిడి పంబ థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసిన రవితేజ!

Tuesday,June12th,2018, 07:08 AM

#JambaLakidiPamba Theatrical Trailer Released by #MassMaharaja #Raviteja

గీతాంజలి, జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా వంటి వైవిధ్య‌మైన సినిమాల త‌ర్వాత ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌ శ్రీనివాస‌రెడ్డి హీరోగా న‌టించిన చిత్రం జంబ‌ల‌కిడి పంబ‌. శివ‌మ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. సిద్ధి ఇద్నాని క‌థానాయిక‌. పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిశోర్ కీల‌క పాత్ర‌ధారులు. జె.బి. ముర‌ళీకృష్ణ (మ‌ను) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్ నిర్మాత‌లు. ఈ చిత్రం థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను మాస్ మ‌హరాజ్ ర‌వితేజ ఆవిష్క‌రించారు.

 

 

అనంత‌రం ర‌వితేజ మాట్లాడుతూ - జంబ‌ల‌కిడి పంబ అనే టైటిల్‌ను విన‌గానే హిట్ అనే ఫీలింగ్ వ‌చ్చేసింది. టైటిల్ మాత్రం ఈవీవీగారిది వాడుకున్నారు. క‌థ మొత్తం కొత్త‌గా రాసుకున్నారు. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ చూస్తే త‌ప్ప‌క హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం కుదిరింది. చిత్ర యూనిట్‌కి నేను ఆల్ ది బెస్ట్ కి బ‌దులు కంగ్రాట్స్ చెబుతున్నాను. ష్యూర్ హిట్ చిత్ర‌మ‌వుతుంది. శ్రీనివాస‌రెడ్డి కెరీర్‌లో హిట్ చిత్రంగా నిలుస్తుంది. నిర్మాత‌ల‌కు మంచి లాభాలు రావాలి అని అన్నారు.


శ్రీనివాస‌రెడ్డి మాట్లాడుతూ - మా చిత్రాన్ని మేం జూన్ 14న విడుద‌ల చేయాల‌ని ముందు అనుకున్నాం. కానీ ఆ రోజు చాలా సినిమాలు విడుద‌ల‌కున్నాయి. జూన్ 22న అయితే మంచి థియేట‌ర్లు దొరుకుతాయ‌ని, మంచి ఓపెనింగ్స్ ఉంటాయ‌ని పెద్ద‌లు సూచించారు. వారి సూచ‌న మేర‌కు ఈ చిత్రాన్ని జూన్ 22న విడుద‌ల చేస్తున్నాం. మా చిత్రం థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌గారు విడుద‌ల చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ చూసి గ్యారంటీ హిట్ చిత్ర‌మ‌ని ఆయ‌న చెప్ప‌డంతో మాకు కొండంత బ‌లం వ‌చ్చిన‌ట్ట‌యింది. ముందు నుంచీ సినిమా పెద్ద హిట్ అవుతుందనే న‌మ్మ‌కంతోనే ప‌నిచేశాం. ఇప్ప‌టిదాకా మా ప్ర‌య‌త్నాన్ని ఆద‌రిస్తున్న అంద‌రూ ఈ సినిమాను కూడా అలాగే ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాను అని అన్నారు.


నిర్మాత‌లు మాట్లాడుతూ - పాత జంబ‌ల‌కిడి పంబ‌ కు, మా సినిమాకూ ఎలాంటి పోలిక ఉండ‌దు. కాక‌పోతే క‌థాప‌రంగా మాక్కూడా అదే టైటిల్ బావుంటుంద‌ని పెట్టాం. పాత సినిమాను ఇందులో పోల్చుకోవాల‌నుకోవ‌ద్దు. ఎక్క‌డా పోలిక‌లు ఉండ‌వు. రొమాంటిక్ కామెడీ సినిమా ఇది. శ్రీనివాస‌రెడ్డిగారి కోస‌మే మా ద‌ర్శ‌కుడు క‌థ రాసుకున్నారు. డిస్ట్రిబ్యూట‌ర్స్ గా ప్రేక్ష‌కుల నాడి తెలిసిన వాళ్లం. అందుకే ఈ క‌థ‌ను ఎంపిక చేసుకున్నాం. అన్ని వ‌ర్గాల వారినీ ఆక‌ట్టుకునే అంశాలు చాలా ఉంటాయి. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను చూసి ర‌వితేజ‌గారు కంగ్రాట్స్ చెప్ప‌డం ఆనందంగా ఉంది. ఈ నెల 22న చిత్రాన్ని విడుద‌ల చేస్తాం అని చెప్పారు.


ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ - ఈ మ‌ధ్య విడుద‌ల చేసిన ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌కి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. నిర్మాత‌లు ఎక్క‌డా ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా సినిమా చేశారు. అంద‌రినీ ఆకట్టుకునే సినిమా అవుతుంది. సెన్సార్ యు/ఎ ఇచ్చింది. యువ‌త‌కు న‌చ్చే అంశాల‌న్నీ పుష్క‌లంగా ఉన్నాయి అని తెలిపారు.
క‌థానాయిక సిద్ధి ఇద్నాని మాట్లాడుతూ - సినిమా చాలా బాగా వ‌చ్చింది. కుటుంబ స‌మేతంగా చూడాల్సిన చిత్ర‌మిది అని తెలిపారు.


న‌టీన‌టులు:
స‌త్యం రాజేశ్‌, ధ‌న్‌రాజ్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, హ‌రి తేజ‌, రాజ్య‌ల‌క్ష్మి, హిమ‌జ‌, కేదారి శంక‌ర్‌, మ‌ధుమ‌ణి, మిర్చి కిర‌ణ్‌, జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు, స‌న‌, సంతోష్‌, గుండు సుద‌ర్శ‌న్‌, జ‌బ‌ర్ద‌స్త్ ఫ‌ణి త‌దిత‌రులు.


సాంకేతిక నిపుణులు:
సంగీతం: గోపీసుంద‌ర్‌, కెమెరా: స‌తీశ్ ముత్యాల‌, ఆర్ట్: రాజీవ్ నాయ‌ర్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: జె.బి.ముర‌ళీకృష్ణ (మ‌ను), నిర్మాత‌లు: ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్‌., స‌హ నిర్మాత‌: బి.సురేశ్ రెడ్డి, లైన్ ప్రొడ్యూస‌ర్‌: స‌ంతోష్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !