filmybuzz
filmybuzz

View

చైతూ చేతుల మీదుగా విడుదలైన 'ఈ మాయ పేరేమిటో' ఫస్ట్ లుక్ లీజర్!

Tuesday,June12th,2018, 01:21 PM

ముప్పై ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఎంతో మంది స్టార్స్‌కు అద్భుతమైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్. ఈయ‌న త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం `ఈ మాయ పేరేమిటో`వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్‌ బేనర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రానికి రాము కొప్పుల దర్శకుడు. దివ్య విజయ్‌ నిర్మాత. ల‌వ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌ను మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో అక్కినేని నాగ‌చైత‌న్య విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...


యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ - టు ఇంట్రడ్యూస్ న్యూ టాలెంట్ ఈజ్ ఆల్వేస్ మై ప్లెజర్. రీసెంట్ గా 'రారండోయ్ వేడుక చూద్దాం' షూటింగ్ జరిగినప్పుడు రాహుల్ ని చూశా. అందులో కబడ్డీ ఫైట్ విజయ్ మాస్టర్ చేశారు. అప్పుడు కలిశా. గుడ్ లుకింగ్ బాయ్ అనుకున్నా. ఈ ఫంక్షన్ కి పిలవడానికి వచ్చినప్పుడు రెండు పాటలు చూపించారు. అవి చూశాక... గుడ్ లుకింగ్ ప్లస్ గ్రేట్ టాలెంట్. మంచి పేరు తెచ్చుకుంటాడని అనుకున్నా. ఇండస్ట్రీలో పైకి రావడం అంత ఈజీ కాదు. ప్రతి సినిమాలో ఏదో ఒక ఫ్రెష్ నెస్, హిడెన్ టాలెంట్ చూపించాలి. రాహుల్ కష్టపడి పేరు తెచ్చుకుంటాడని ఆశిస్తున్నా అన్నారు.


నిర్మాత దివ్య మాట్లాడుతూ - కొన్ని రోజుల క్రితం రెండు లుక్స్ విడుదల చేశాం. మొదటిది ఫస్ట్ లుక్. రెండోది క్యారెక్టర్ ఇంట్రడక్షన్ లుక్. రెండిటికీ చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు టీజర్ విడుదల చేస్తున్నాం. నాన్నగారు అడగగానే ఒక్క సెకన్ కూడా ఆలోచించకుండా నాగచైతన్య యస్ చెప్పారు. ఆయన చాలా బిజీ. రెండు సినిమాలు సైమల్టేనియస్ గా షూట్ చేస్తున్నారు. అంత బిజీలోనూ మా కోసం వచ్చినందుకు థాంక్స్. రాహుల్ కి చైతన్య గారంటే చాలా ఇష్టం. మా సినిమా నుంచి మేం విడుదల చేస్తున్న ఫస్ట్ కంటెంట్ ఇదే. చాలా ఎగ్జయిటెడ్ గా, నెర్వస్ గా ఉంది అన్నారు.


విజయ్ మాస్టర్ మాట్లాడుతూ - ఫైట్ మాస్టర్స్ కుమారులు హీరోలు అవుతున్నారు. హిందీలో అజయ్ దేవగన్ అయ్యారు కదా. రాహుల్ ని 'నువ్వు ఎం అవ్వాలనుకుంటున్నావ్' అని అడిగా. ఫస్ట్ క్రికెట్ ఇష్టం అన్నాడు. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశాడు . శ్రీలంక వెళ్లి ఆడాడు కూడా. తర్వాత సడన్ గా ఒక రోజు నేను యాక్టర్ కావాలనుకుంటున్నానని చెప్పాడు. యాక్టర్ అవ్వాలంటే డిగ్రీ కావాలన్నాను. ఎందుకు? అన్నాడు. చదువు కావాలని చెప్పా. అయితే నేను నాగచైతన్య చదివిన కాలేజీలో చదువుతానని అన్నాడు. అన్నట్టుగా అక్కడే చదివాడు. డిగ్రీ కంప్లీట్ చేశాడు. చదువు డిస్టర్బ్ కాకుండా ఆరేడేళ్లు యాక్టర్ కావాలని ట్రయినింగ్ తీసుకున్నాడు. నేను ఇంకొకటి చెప్పా... 24 క్రాఫ్ట్స్ లో ట్రయినింగ్ త్రీసుకోవాలని. నాది ఫస్ట్ మాస్టర్ జాబ్. సింగల్ క్రాఫ్ట్. అప్పుడప్పుడూ మిగతా 23 క్రాఫ్ట్స్ వాళ్ళని శాటిస్ ఫై చేయలేకపోతున్నా. నువ్వు హీరో కావాలంటే 24 క్రాఫ్ట్స్ వాళ్ళని శాటిస్ ఫై చేయాలి. ఆలా చేయాలంటే ముందు దర్శకుణ్ణి శాటిస్ ఫై చేయాలి. అందుకు సిద్ధమంటే హీరోగా చెయ్. లేదంటే వద్దని చెప్పా. ఆ తర్వాత చక్కగా ప్రాక్టీస్ చేసి హీరో అయ్యాడు. ఇందుకు మా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేశారు అన్నారు.


దర్శకుడు రాము మాట్లాడుతూ - అందరికీ థాంక్యూ. అక్కినేని నాగచైతన్యగారికి స్పెషల్ థాంక్స్. '100% లవ్'కి నేను అప్రెంటీస్ గా చేశా. అమ్మానాన్నలు పిల్లల మీద చాలా నమ్మకం ఉంచుతారు. అలా నా మీద నమ్మకం ఉంచినవాళ్లు ఇద్దరు. ఒకరు మా గురువుగారు సుకుమార్ గారు. రెండో వ్యక్తి విజయ్ మాస్టర్. ఆ నమ్మకమే నన్ను ఇక్కడి వరకూ తీసుకొచ్చి నిలబెట్టింది. అమ్మానాన్నలను ఎలా మర్చిపోమో... వీళ్ళనూ అలాగే మర్చిపోను. సినిమా చాలా బాగా వచ్చింది అన్నారు.


రాహుల్ విజయ్ మాట్లాడుతూ - పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ కూడా ప్రేక్షకులకి నచ్చుతుందని ఆశిస్తున్నా. ఈ మాయ పేరేమిటో... ప్రేమే. మరో ప్రేమకథ. ఇద్దరు మనుషులు, వాళ్ళ తాలూకా ఎమోషన్స్, వాళ్ళ బ్యాగ్రౌండ్, వాళ్ళు పెరిగిన విధానం, వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ ప్రెస్ చేసే విధానం... ఒక మనిషికి ఇంకో మనిషికి సంబంధం ఉండదు. అలాంటి ఇద్దరు మనుషులు ప్రేమలో పడితే... ఆ ప్రేమ ఇంకెంత కొత్తగా ఉంటుందో? మా సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది. సినిమా చూసి ఇంటికి వెళ్ళేటప్పుడు... సినిమాలోని కొన్ని ఎమోషన్స్ మీ ఇంటికి తీసుకువెళతారు. సినిమా బాగుందా? బాలేదా? అనే ఆలోచన కూడా రాదు. ఇటువంటిది మన లైఫ్ లో జరిగిందే... మనం ప్రేమలో ఉన్నప్పుడు ఇలా ఉన్నామే.. మారినప్పుడు ఇలా అయ్యిందే... ఇటువంటి సందర్భాలు ఎదుర్కొన్నామే... అనే ఆలోచనలను ఇంటికి తీసుకువెళతారు. మాకు అంత నమ్మకం ఉంది. మా టీజర్ విడుదల చేసిన నాగచైతన్య అన్నయ్యకు థాంక్స్. ఆయన ఇక్కడికి వచ్చారని చెప్పడం కాదు. జోష్ సినిమా నుంచి నాగచైతన్య అంటే నాకు ఇష్టం. చిన్నాపెద్దా తేడా లేకుండా ఆయన మనుషులకు ఇచ్చే మర్యాద ఇష్టం అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

Read More !