filmybuzz

View

ఇది నా బయోపిక్ ఆరంభం... క్రైమ్ థ్రిల్లర్!

Monday,June25th,2018, 03:20 AM

విశ్వ కథానాయకుడిగా పరిచయం అవుతోన్న సినిమా 'ఇది నా బయోపిక్'. నిఖిత పవర్ కథానాయిక. శివ గణేష్ దర్శకత్వంలో యువన్ టూరింగ్ టాకీస్ పతాకంపై రవిచంద్ర ఈమండి, శ్రీనివాస్ జివిరెడ్డి, నాగేంద్ర వర్మ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.


ముహూర్తపు సన్నివేశానికి నటుడు జీవా క్లాప్ ఇవ్వగా, టీఆర్ఎస్‌ (తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీ నాయకులు మెట్ట సూర్యప్రకాష్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు శివగణేష్ మాట్లాడుతూ - "ఇదొక క్రైమ్ థ్రిల్లర్. కథ, కథనాలు సరికొత్తగా ఉంటాయి. క్రైమ్ థ్రిల్ల‌ర్‌కి 'ఇది నా బయోపిక్' అనే టైటిల్ ఎందుకు పెట్టామనేది ఆసక్తికరం. దర్శకుడిగా నా మూడో చిత్రమిది. నా తొలి సినిమా '33 ప్రేమకథలు'కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. రెండో సినిమా 'సకల కలవల్లభుడు' చిత్రీకరణ పూర్తయింది. ఆ సినిమా త్వరలో విడుదలవుతుంది'' అన్నారు.


నటుడు జీవా మాట్లాడుతూ - "చిన్న చిత్రాలను ప్రోత్సహిస్తేనే చిత్ర పరిశ్రమ సుభిక్షంగా ఉంటుంది. ఇక, ఈ సినిమా విషయానికి వస్తే... ఇందులో ముఖ్యమైన పాత్ర చేస్తున్నా. దర్శకుడు శివగణేష్ చాలా పట్టుదల కల వ్యక్తి. అనుకున్నది సాధించేవరకూ వదిలిపెట్టడు. అతని దర్శకత్వంలో రూపొందిన 'సకల కళావల్లభుడు'లో నటించా. అతడితో మరో సినిమా చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది" అన్నారు.


హీరో విశ్వ మాట్లాడుతూ - "హీరోగా నా మొదటి సినిమా ఇది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. సినిమాటోగ్రాఫర్ జగదీష్ చీకటి నా మిత్రుడు. చక్కటి టీమ్. ప్రేక్షకుల ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నా" అన్నారు.


నిర్మాతలలో ఒకరైన రవిచంద్ర ఈమండి మాట్లాడుతూ - "దర్శకుడు శివగణేష్ నా మిత్రుడు, శ్రేయోభిలాషి. అతను కథ చెబుతున్నంత సేపూ తర్వాత ఏం జరుగుతుందోననే ఉత్కంఠ కలిగింది. అంత ఆసక్తికరమైన కథ. వచే నెల (జూలై) 26వ తారీఖు నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ షెడ్యూల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. టోటల్ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం" అన్నారు.


సంగీత దర్శకుడు అజయ్ పట్నాయక్ మాట్లాడుతూ - "శివగణేష్‌తో మూడో చిత్రమిది. సంగీత దర్శకుడిగా ఐదో సినిమా. ఈ సినిమాలో పాటలకు చక్కటి సందర్భాలు కుదిరాయి" అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు 'జబర్దస్త్' మురళి, కథానాయిక నిఖిత పవర్ తదితరులు పాల్గొన్నారు.


30 ఇయర్స్ పృథ్వీ, జీవా, అపూర్వ, 'జబర్దస్త్' మురళి, పప్పు ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి ఆర్ట్: సుమిత్ పటేల్, యాక్షన్: నందు, సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి, మ్యూజిక్: అజయ్ పట్నాయక్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

Gossips

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !