filmybuzz

View

'ఏదైనా జరగొచ్చు' అంటున్న శివాజీరాజా తనయుడు విజయ్ రాజా!

Wednesday,July11th,2018, 09:55 AM

'మా' అధ్య‌క్షులు, ప్ర‌ముఖ న‌టులు శివాజీరాజా త‌న‌యుడు విజయ్ రాజా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతూ రూపొందుతున్న చిత్రం 'ఏదైనా జ‌ర‌గొచ్చు'. కె.రమాకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో వెట్ బ్రెయిన్ ఎంట‌ర్ టైన్మెంట్ నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ఈ రోజు (బుధవారం) అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కె.రాఘ‌వేంద్ర‌రావు ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌గా... ర‌విరాజా పినిశెట్టి కెమెరా స్విచాన్ చేశారు. హ‌రీష్ శంక‌ర్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్, ఎస్ వి కృష్ణారెడ్డి, కె. అచ్చిరెడ్డి, హీరోలు శ్రీకాంత్, త‌రుణ్ పూజా కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.


అనంత‌రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో శివాజీరాజా మాట్లాడుతూ... 32 ఏళ్లుగా న‌టుడుగా నన్ను ఆద‌రిస్తున్నారు. అదే ఆద‌ర‌ణ, ప్రేమ మా అబ్బాయి విజ‌య్ రాజాకు కూడా అందించాల‌ని కోరుకుంటున్నా. చాలా స్టోరీలు విన్నాక నాకు, మా అబ్బాయికి ఈ స్టోరీ న‌చ్చి ఫైన‌ల్ చేశాం. ద‌ర్శ‌కుడు రెండేళ్లుగా ఈ స్క్రిప్టు పై వ‌ర్క్ చేస్తున్నాడు. విజ‌య్... స‌త్యానంద్ గారి ఇన్‌స్టిట్యూట్ లో యాక్టింగ్, డాన్స్, ఫైట్స్ లో శిక్ష‌ణ తీసుకున్నాడు. నేనున్న ఫీల్డ్ లోకే మా అబ్బాయి కూడా రావ‌డం హ్యాపీ. విజ‌య్ న‌న్ను స‌ల‌హా అడిగినప్పుడు... నీకు ఎలా అనిపిస్తే అలా చేయి.. మెగాస్టార్ చిరంజీవిగారిలా క‌ష్ట‌ప‌డు, సూపర్ స్టార్ కృష్ణ గారిలా సేవాతత్పరత కలిగి ఉండని చెప్పాను. పాటిస్తాడ‌ని న‌మ్ముతున్నాను. ఈ సినిమా.. ద‌ర్శ‌కుడికి పేరు, నిర్మాత‌కు లాభాలు తేవాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


ద‌ర్శ‌కుడు కె. ర‌మాకాంత్ మాట్లాడుతూ... చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి గారి వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేశాను. ఆ అనుభ‌వంతో 'ఏదైనా జ‌ర‌గొచ్చు' చిత్రానికి డైర‌క్ష‌న్ చేస్తున్నా. హారర్ జానర్‌లో సాగే కామెడీ థ్రిల్ల‌ర్ చిత్ర‌మిది. క‌థ న‌చ్చి, నా పై న‌మ్మ‌కంతో శివాజీరాజాగారు, మా నిర్మాత ఈ అవకాశం క‌ల్పించారు. వారి న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటాను అని అన్నారు.


హీరో విజ‌య్ రాజా మాట్లాడుతూ... నేను హీరో అవ‌డానికి అమ్మా నాన్న‌ల స‌పోర్ట్ తో పాటు మావ‌య్య స‌పోర్ట్ ఎంతో ఉంది. నాన్న గ‌ర్వ‌ప‌డేలా చేస్తానన్న న‌మ్మ‌కంతో హీరోగా తొలి అడుగు వేస్తున్నా. ద‌ర్శ‌కుడు మంచి క‌థ‌తో వ‌చ్చారు. నా మీద న‌మ్మ‌కంతో ఈ అవ‌కాశం కల్పించిన వెట్ బ్రెయిన్ సంస్థ‌కు ధ‌న్య‌వాదాలు అన్నారు.


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ విజ‌య్ ప్ర‌కాష్ అన్నంరెడ్డి మాట్లాడుతూ... కామెడీ హ‌ర్ర‌ర్ తో పాటు థ్రిల్ల‌ర్ అంశాల‌తో సాగే చిత్ర‌మిది. చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి గారి వ‌ద్ద ద‌ర్శ‌కుడు ర‌మాకాంత్‌ చాలా చిత్రాల‌కు ప‌ని చేశారు. దాదాపు రెండేళ్లు ఈ స్క్రిప్టు పై ద‌ర్శ‌కుడు వ‌ర్క్ చేశారు. శివాజీ రాజా గారు మా మీద న‌మ్మ‌కంతో వార‌బ్బాయిని పరిచయం చేసే అవ‌కాశం ఇవ్వ‌డం మా అదృష్టంగా భావిస్తున్నాం. సీనియ‌ర్ ఆర్టిస్టులు చాలా మంది న‌టిస్తున్నారు. త్వ‌ర‌లో పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తాం అని అన్నారు.


ఈ చిత్రానికి సంగీతంః శ్రీకాంత్ పెండ్యాల‌; ఆర్ట్ డైర‌క్ట‌ర్ః చిన్నా; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః విజ‌య్ ప్ర‌కాష్ అన్నంరెడ్డి; ప‌్రొడ్యూస‌ర్ః వెట్ బ్రెయిన్ ఎంట‌ర్ టైన్మెంట్; ద‌ర్శ‌కుడుః కె.ర‌మాకాంత్‌.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

Gossips

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !