View

ఓ రాత్రిలో జరిగే కథతో 'చి||ల||సౌ' - అక్కినేని నాగచైతన్య

Tuesday,July31st,2018, 12:56 PM

సుశాంత్‌, రుహనీ శర్మ జంటగా నటించిన చిత్రం 'చి||ల||సౌ'. అన్నపూర్ణ స్టూడియోస్‌, సిరునీ సినీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, భరత్‌ కుమార్‌, జస్వంత్‌ నడిపల్లి నిర్మాతలుగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఆగస్ట్‌ 3న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...


చైతన్య అక్కినేని మాట్లాడుతూ - ''7-8 నెలలు క్రితం సమంతో నాతో.. 'రాహుల్‌ నిన్ను, నన్ను కలిసి ఓ స్క్రిప్ట్‌ చెబుతాడట' అంది. నేను రాహుల్‌ నటించబోయే సినిమా అనుకున్నాను. కానీ తను దర్శకత్వం చేస్తున్నాడని తెలిసి కాస్త సర్‌ప్రైజ్‌ అయ్యాను. కథ వినగానే చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ఓ రాత్రిలో జరిగే కథ ఇది. ఇలాంటి కథ ఆడియెన్స్‌కు కనెక్ట్‌ అవుతుందా? అనే సందేహం ఉండేది. సమంత నీది, రాహుల్‌ది సెన్సిబిలిటీస్‌ ఒకేలా ఉంటాయి. నువ్వు తనతో ఓ సినిమా చెయ్‌ అంది. సినిమా చూసిన తర్వాత తనతో సినిమా చేయడం సంగతి పక్కన పెడితే.. ఎలాగైనా ఈ సినిమాలో భాగం అయితే బావుండు అనిపించి నాన్నగారితో చెప్పాను. నాన్నగారు సినిమా చూశారు. ఆయనకు సినిమా బాగా నచ్చింది. సినిమాలో సుశాంత్‌ చాలా కొత్తగా కనపడతాడు. రుహని చాలా బాగా నటించింది. సుకుమార్‌గారి కెమెరా వర్క్‌, ప్రశాంత్‌ విహారి సంగీతం అన్ని ఎలిమెంట్స్‌ చక్కగా కుదిరాయి. సినిమాలో చాలా రియల్‌ మూమెంట్స్‌ ఉన్నాయి. యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కు సినిమా చక్కగా కనెక్ట్‌ అవుతుంది'' అన్నారు.


సమంత అక్కినేని మాట్లాడుతూ - ''11 ఏళ్లుగా నేను, రాహుల్‌ మంచి మిత్రులం. నా కెరీర్‌ బిగినింగ్‌ నుండి ఈ స్టేజ్‌ వరకు రాహుల్‌ నాకు సపోర్ట్‌ అందిస్తూ వచ్చాడు. తనకు మంచి భవిష్యత్‌ ఉండాలని నేను ఆ దేవుడ్ని చాలా సార్లు ప్రార్థించాను కూడా. తను మంచి హార్డ్‌వర్కర్‌. ఈ సినిమాను తను చూడమనగానే.. భయపడుతూ చూశాను. ఎందుకంటే.. నా స్నేహితుడు యాక్టింగ్‌ను దాటి డైరెక్టర్‌ కావాలనుకుని ఆశగా చేసిన సినిమా. చూసిన తర్వాత ఏం చెప్పాల్సి వస్తుందోనని అనుకున్నాను. సినిమా చూస్తున్నప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. రాహుల్‌ యాక్టర్‌గా నాకు కనెక్ట్‌ కాలేదు కానీ.. డైరెక్టర్‌గా కనెక్ట్‌ అయ్యాడు. కొత్త సుశాంత్‌ని తెరపై చూస్తారు. ఈ సినిమాలో రాహుల్‌పై నమ్మకంతో సుశాంత్‌ నటించాడు. ఆ కాన్ఫిడెన్స్‌ స్క్రీన్‌పై కనపడుతుంది. రుహని ఫైర్‌ క్రాకర్‌గా పేరు తెచ్చుకుంటుంది. తనకు అవార్డ్స్‌ కూడా వస్తాయి. అందరూ ఎగ్జయిట్‌మెంట్‌గా వెయిట్‌ చేస్తున్నాం'' అన్నారు.


రాహుల్‌ రవీంద్రన్‌ మాట్లాడుతూ - ''పెళ్లిచూపుల్లోని అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు కరెక్టా? కాదా? అని ఓ అరగంటలో ఎలా నిర్ణయించుకుంటారు. దానికి ఎంత సమయం పడుతుంది? అనే కాన్సెప్ట్‌తో సాగే చిత్రమిది. పెళ్లే వద్దు అనుకునే అర్జున్‌, అంజలి జీవితం ఓ రాత్రిలో ఎలాంటి మలుపులు తిరిగాయనేది సినిమా కథాంశం. నన్ను, సుశాంత్‌ను నమ్మి సినిమాను ప్రొడ్యూస్‌ చేసిన నిర్మాతలు జస్వంత్‌, భరత్‌గారికి.. సినిమాను విడుదల చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థకు థాంక్స్‌'' అన్నారు.


చిన్మయి మాట్లాడుతూ - ''రాహుల్‌ పర్‌ఫెక్షనిస్ట్‌. ఈ సినిమాకు డబ్బింగ్‌ చెప్పడానికి చాలా కష్టపడ్డాను. నీ సినిమాలకు ఇంకోసారి డబ్బింగ్‌ చెప్పను అని కూడా చెప్పేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. ఆగస్ట్‌ 3న సినిమా విడుదలవుతుంది'' అన్నారు.


సుశాంత్‌ మాట్లాడుతూ - ''నేను ఇప్పటి వరకు చేసిన చిత్రాల్లో ఎక్కువగా నా ఓన్‌ డిషిషన్స్‌ను తీసుకోలేకపోయేవాడిని. వాటి రిజల్ట్స్‌ను పక్కన పెట్టేసి.. నేను స్వంత నిర్ణయంతో ఓ సినిమా చేద్దామని అనుకుంటున్న తరుణంలో రాహుల్‌ రవీంద్రన్‌ ఈ కథతో నన్ను కలిశాడు. ముందు వేరే కథ చెప్పాడు. అంత పూర్తయిన తర్వాత లైటర్‌ వెయిట్‌ ఉండే కథతో సినిమా చేద్దామని అనుకుంటున్నానని అన్నాను. నాలుగు రోజుల తర్వాత తను ఈ కథను నాకు చెప్పాడు. ఇలాంటి కథతో సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది. ఆడియెన్స్‌ హృదయాలను గెలుచుకుంటుందనే నమ్మకం ఉంది. కథను, మమ్మల్ని నమ్మి సినిమా చేసిన నిర్మాతలకు థాంక్స్‌'' అన్నారు.


రుహనీ శర్మ మాట్లాడుతూ - ''సినిమాను విడుదల చేస్తున్న అక్కినేని ఫ్యామిలీకి థాంక్స్‌. నా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి నన్ను సెలక్ట్‌ చేసుకున్నారని చెప్పారు. కాబట్టి ఇన్‌స్టాగ్రామ్‌కి కూడా థాంక్స్‌. ఆగస్ట్‌ 3న విడుదలవుతున్న మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.


నిర్మాత జస్వంత్‌ కుమార్‌ నడిపల్లి మాట్లాడుతూ - ''డైరెక్టర్‌ అవుదామని అనుకున్న నేను నిర్మాతగా మారాను. రాహుల్‌ చెప్పిన కథ విని.. అందరికీ కనెక్ట్‌ అవుతుందనిపిచండంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. మంచి సినిమా చేశామనే నమ్మకం ఉంది. మా సినిమాను చూసి నమ్మకంతో విడుదల చేస్తున్నందుకు అన్నపూర్ణ స్టూడియోస్‌, చైతన్యగారికి థాంక్స్‌'' అన్నారు.


Chi La Sow Press Meet


‘Chi La Sow’ starring Sushanth and Ruhani Sharma in the lead roles is releasing on August 3rd. As the film is getting released in association with Annapurna Studios banner, hero Naga Chaitanya and Samantha held at press meet along with lead cast, director and producers.


Speaking Naga Chaitanya said, “About seven to eight months back, Samantha said to me that Rahul Ravindran would come and narrate a story. I thought he would act in it but was surprised to know that he would direct the movie. When I heard the script, I did find it really fresh. Samantha and Rahul’s sensibilities are similar and she asked me to do a movie with Rahul. Keeping that aside, after watching the movie, we have decided to get associated and informed father (Nagarjuna Akkineni) about it. Even he liked the movie. Sushanth looks completely different in the movie and Ruhani performed well despite being a debutant. Sukumar’s cinematography and Prashanth Vihari’s music are assets for the film. ‘Chi La Sow’ will connect to family and young audience for sure.”


Samantha said, “I know Rahul since 11 years and she has been a pillar of support right from the beginning of my career. I always prayed for his brighter future as he is a hard working guy. One day, he asked me to watch ‘Chi La Sow.’ I was hesitant as what to tell him if I did not like him. But I had tears in my eyes while watching the movie. Rahul did not connect to me as an actor but got connected as a director. Audience will see a new Sushanth in this flick and he had immense confident on Rahul and that showed on the screen. Ruhani is a fire cracker and she will definitely win many awards for this film. We all are excited about the release.”


Rahul Ravindran said, “How a boy and girl decide about their life partner in just half-an-hour time and how long it will take for them, forms the plot. Arjun and Anjali don’t want to get married but how their life turns over a night makes it interesting. Thanks to the producers Jaswanth and Bharat for believing me and Sushanth. Special thank you to Annapurna Studios for backing this film.”


Singer Chinmayi said, “Rahul is perfectionist and it was tough dubbing for this film. I said to Rahul that I won’t be dubbing for his films anymore (joking). The film is releasing on August 3rd.”


Hero Sushanth said, “I did not take my own decision so far for any of films but when I decided to go with my instinct, Rahul narrated this script to me. I told him that I’m planning to do a lighter weight story with sensibilities. I’m really happy to do this film and I’m sure audience will definitely like it. Thanks to my producers.”


Actress Ruhani Sharma said, “Thanks to the Akkineni family for releasing ‘Chi La Sow’ and thanks to Instagram as well as the producers approached after seeing my pictures in the popular photo sharing platform. Our film should be appreciated by all.”


Producer Jaswanth said, “I wanted to become a director but ended up as a producer. I heard the story narrated by Rahul and I immediately decided to produce it. We are confident that we have made a good film and thanks to Annapurna Studios and Naga Chaitanya.”Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !