View

ఎప్పుడో కన్న కల 'గూఢచారి' - అడవి శేష్

Thursday,August02nd,2018, 02:25 PM

అడివిశేష్‌, శోభితా ధూళిపాళ హీరో హీరోయిన్‌గా అభిషేక్ పిక్చ‌ర్స్‌, విస్టా డ్రీమ్ మ‌ర్చంట్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ స‌మ‌ర్ప‌ణ‌లో... శ‌శి కిర‌ణ్ తిక్క ద‌ర్శ‌కుడిగా, అభిషేక్ నామ‌, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మించిన చిత్రం గూఢ‌చారి. ఆగ‌స్ట్ 3న సినిమా విడుద‌ల‌వుతుంది.


ఈ సంద‌ర్భంగా బుధ‌వారం జ‌రిగిన ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో అడివిశేష్ మాట్లాడుతూ.. 2004లో తెలుగు నేర్చుకుంటున్న స‌మ‌యంలో ఈ కాన్సెప్ట్ ఐడియా వ‌చ్చింది. నేను రాసుకున్న ఫైల్‌ను దాచుకున్నాను. దాన్ని క్ష‌ణం రిలీజ్ త‌ర్వాత డైరెక్ట‌ర్ శ‌శికిర‌ణ్‌కి చూపించాను. త‌ను దాన్ని చ‌దివి.. ఇది చాలా బ్యాడ్‌గా ఉంది. వ‌ర్కవుట్ కాదు అన్నాడు. మూల క‌థ‌ను బేస్ చేసుకుని ప‌ది నెల‌లు క‌ష్ట‌ప‌డి నేను, రాహుల్‌, శశి స్క్రిప్ట్‌, స్క్రీన్‌ప్లే త‌యారు చేశాం. ఎప్పుడో క‌న్న క‌ల ఇప్పుడు నిజ‌మైంది. మంచి, చెత్త సినిమా.. దేనికైనా క‌ష్ట‌ప‌డాల్సిందే. నేను డైరెక్ట‌ర్ శ‌శితో సింక్ కావ‌డానికి టైమ్ ప‌ట్టింది. త‌న‌ను నేను న‌మ్మితే... త‌ను న‌న్ను న‌మ్మాడు. త‌ను సినిమాను చాలా బాగా గైడ్ చేశాడు. శ్రీచ‌ర‌ణ్ పాకాల‌.. హీరో అని చెప్ప‌వ‌చ్చు. త‌న‌తో క్ష‌ణం చేశాను. ఈ సినిమాకు అద్భుత‌మైన రీ రికార్డింగ్ చేశాడు. శోభితకు థాంక్స్‌. అలాగే సుప్రియ‌ను 22 ఏళ్ల త‌ర్వాత తెలుగులో మా సినిమాతో మ‌ళ్లీ న‌టింప చేశాం. ఓ మంచి యూనిట్‌తో మంచి సినిమా చేశామ‌నే భావ‌న క‌లిగింది. అలాగే ఈ సినిమాలో నా చిన్న‌ప్ప‌టి పాత్ర‌ను సుధీర్ బాబు త‌న‌యుడు... కృష్ణ‌గారి మ‌న‌వ‌డు చేశాడు. ఈ సినిమాను హిందీలోనూ.. త‌మిళంలోనూ రీమేక్ చేయాల‌నుకుంటున్నారు. నిర్మాత‌ల‌కు థాంక్స్‌ అన్నారు.


డైరెక్ట‌ర్ శ‌శికిర‌ణ్ తిక్క మాట్లాడుతూ.. శేషు విజ‌న్‌ని నేను షేర్ చేసుకోగ‌ల‌నా అనుకున్నాను. అయితే 9-10 నెల‌లు నేను, రాహుల్‌, శేష్ క‌లిసి స్క్రిప్ట్ రాశాం. మ‌ధ్య మ‌ధ్య‌లో అబ్బూరి ర‌విగారిని క‌లిసేవాళ్లం. ఆయ‌న ద‌గ్గ‌ర రియ‌ల్ ఫిలిం స్కూల్ అంటే ఏంటో నేర్చుకున్నాను. ప్ర‌తి స‌న్నివేశాన్ని బెట‌ర్‌గా ఎలా రాయ‌వ‌చ్చో అనేది ఆయ‌నే నేర్పిస్తూ.. మంచి మాట‌లు ఇచ్చారు. శ్రీచ‌ర‌ణ్ అద్బుత‌మైన సంగీతం అందించాడు అన్నారు.


కోన‌వెంక‌ట్ మాట్లాడుతూ.. ప్రేక్ష‌కులు టీజ‌ర్‌ను చూసే సినిమా ఎలా ఉందో డిసైడ్ చేసుకుని సినిమాకి వెళ్లాలా వ‌ద్దా? అని నిర్ణ‌యించుకుంటున్నారు. శేషు నాకు తెలిసి ఆంధ్ర ఆమిర్‌ఖాన్ అని నా ఫీలింగ్‌. సినిమా చేయ‌డానికి ఎందుకు ఇన్నిరోజులు ప‌డుతుంద‌ని నేను ఆలోచించాను. అయితే టీజ‌ర్ చూసిన త‌ర్వాత షాక్ అయ్యాను. తెలుగు సినిమా స్టాండ‌ర్డ్స్‌ని పెంచిన సినిమాగా పేరు తెచ్చుకుంది. ఎందుకంటే అంత మంచి క్వాలిటీ సినిమా ఇది. మంచి స‌పోర్టివ్ టీం దొరికింది. అనీల్ సుంక‌ర‌, విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్‌గారు సినిమా యూనిట్‌కు అందించిన స‌పోర్ట్ కార‌ణంగానే ఇది సాధ్య‌మైంద‌ని భావిస్తున్నాను. యూనిట్‌కి ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


శోభితా దూళిపాల మాట్లాడుతూ.. తెలుగులో నా మొద‌టి చిత్రం. నేను తెలుగు అమ్మాయినే. ఓ మంచి టీంతో ప‌నిచేశాన‌నే ఫీలింగ్ క‌లిగింది. ప్ర‌తి క్యారెక్ట‌ర్‌కు ప్రాముఖ్య‌త ఉంటుంది. మంచి ఎమోష‌న్స్ ఉన్నాయి అన్నారు.


డి.సురేశ్ బాబు మాట్లాడుతూ.. శేష్‌.. సినిమాల‌పై ఆస‌క్తితో అమెరికా నుండి ఇక్క‌డ‌కు వ‌చ్చాడు. క్ష‌ణం త‌ర్వాత చేసిన చిత్ర‌మిది. విజువ‌ల్స్ చూస్తేనే సినిమా ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. 160 రోజుల్లో 168 లొకేష‌న్స్‌లో ఈ సినిమాను షూట్ చేయ‌డం గొప్ప విష‌యం. నిర్మాత‌లంద‌రికీ అభినంద‌న‌లు అన్నారు.


అనిల్ సుంక‌ర మాట్లాడుతూ.. శేష్ వ‌చ్చి ఈ క‌థ చెప్పిన‌ప్పుడు.. బ‌డ్జెట్ ఎంత అవుతుంద‌ని అడిగితే.. శేష్ చెప్పిన బ‌డ్జెట్ విని ఏదో చెబుతున్నాడ‌ని అనుకున్నాను. కానీ సినిమా టీజ‌ర్ త‌ర్వాత థ్రిల్ అయ్యాను. అంత త‌క్కువ బ‌డ్జెట్‌లో ఇంత మంచి సినిమా చేయ‌డానికి కుదురుతుందా అనిపించింది. నేను చేయ‌లేను. 20-30 కోట్ల రూపాయ‌ల సినిమాలా అనిపిస్తుంది. ప్లానింగ్‌, ప్రీ ప్రొడ‌క్ష‌న్, హార్డ్ వ‌ర్క్ ఉంటే సినిమాను చాలా త‌క్కువ బ‌డ్జెట్‌లో చేయ‌వ‌చ్చు. ఈ సినిమాకు ప‌నిచేసిన ఇత‌ర నిర్మాత‌ల‌కు థాంక్స్‌ అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !