View

విశ్వరూపం 2 ఆడియో లాంఛ్ విశేషాలు

Friday,August03rd,2018, 02:19 AM

యూనివర్శల్‌ హీరో కమల్‌హాసన్‌ నటిస్తూ, దర్శకత్వం వహిరచిన చిత్రం 'విశ్వరూపం' సంచలన విజయాన్ని సాధించిన విషయం తెల్సిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోన్న 'విశ్వరూపం-2' చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నంత క్యూరియాసిటీ ఆడియన్స్‌లో నెలకొని వుంది. ఆండ్రియా, పూజా కుమార్‌ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి జిబ్రాన్‌ మ్యూజిక్‌ని అందించారు. ఆస్కార్‌ ఫిలిం ప్రై. లిమిటెడ్‌ వి. రవిచంద్రన్‌ బేనర్‌పై రాజ్‌ కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ సమర్పణలో ఎస్‌. చంద్రహాసన్‌, కమల్‌హాసన్‌ నిర్మించిన 'విశ్వరూపం-2' చిత్రం ఆగస్ట్‌ 10న వరల్డ్‌వైడ్‌గా విడుదల అవుతుంది. కాగా ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ కార్యక్రమం ఆగస్ట్‌ 2న హైదరాబాద్‌ దసపల్లా హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో యూనివర్శల్‌ స్టార్‌ కమల్‌హాసన్‌, హీరోయిన్స్‌ ఆండ్రియా, పూజా కుమార్‌, సంగీత దర్శకుడు జిబ్రాన్‌, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, ఎ.పి. ఫిల్మ్‌ చాంబర్‌ ప్రెసిడెండ్‌ వీరినాయుడు, తెలుగు ఫిలిం చాంబర్‌ కార్యదర్శి ముత్యాల రామదాసు, ప్రముఖ నిర్మాత ఠాగూర్‌ మధు, ఏషియన్‌ ఫిలింస్‌ అధినేత నారాయణ్‌ దాస్‌, టి.ఎమ్‌.టి. ఎండి సుమన్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 'విశ్వరూపం-2' ఆడియో సీడిలను యూనివర్శల్‌ స్టార్‌ కమల్‌హాసన్‌ రిలీజ్‌ చేశారు. లహరి మ్యూజిక్‌ ద్వారా ఆడియో విడుదలైంది.


యూనివర్శల్‌ హీరో కమల్‌హాసన్‌ మాట్లాడుతూ - ''నన్ను స్టార్‌గానే కాదు.. నాకున్న ప్యాషన్‌ ఇంకా కొనసాగుతుందంటే అందుకు తెలుగు ప్రేక్షకుల ప్రేమే కారణం. నేను తెలుగు వాడిని, మలయాళీవాడిని.. ఐ యామ్‌ ఇండియన్‌ అని చెప్పుకోవడానికి ఎప్పుడూ గర్వపడతాను. అది ప్రేక్షకులు, అభిమానుల పంచిన ప్రేమ కారణంగానే సాధ్యమైంది. నాకన్నా పెద్దవాళ్లు నన్ను ఆశీర్వదిస్తే.. నాకన్నా చిన్నవాళ్లు ప్రేమను చూపించారు. నన్ను నటన పరంగా అత్యున్నత స్థితికి తీసుకెళ్లిన సినిమాలన్నీ తెలుగు సినిమాలే. అది టాలెంట్‌ అనడం కంటే అద ష్టం అని చెప్పాలి. ఇక సినిమా గురించి చెప్పాలంటే.. విశ్వరూపం మా ద ష్టిలో ఒకే సినిమా. రెండు భాగాలు విడుదల చేస్తున్నాం. హార్డ్‌వర్క్‌ను, కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ అప్రిషియేట్‌ చేస్తారనే నమ్మకంతో చేసిన సినిమా. 'విశ్వరూపం' పార్ట్‌ వన్‌ కంటే ఇంకా బెటర్‌గా పార్ట్‌ 2ను చేశాం. ఆగస్ట్‌ 10 కోసం ఆత్రుతగా వెయిట్‌ చేస్తున్నాం. ప్రేక్షకులు అందించిన అభిమానంతో మరో పార్శ్వంలోకి ప్రవేశిస్తున్నాను. మీ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. నేను తినేది, వేసుకునే దుస్తులు.. అన్నీ ప్రేక్షకులు ఇచ్చినవే. అందరూ కలిసి నాపై ఇన్‌వెస్ట్‌ చేశారు. మీ ప్రొడక్ట్‌ అయిన నేను ఇప్పుడు ఆయుధంగా మారాను. మీరు తప్పకుండా ఉపయోగించు కోండి. మన ఫ్రీడమ్‌ కోసం మళ్లీ మనం పోరాడాల్సిన తరుణం వచ్చింది'' అన్నారు.


పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ - ''కమల్‌హాసన్‌గారి 'విశ్వరూపం-2' గురించి మాట్లాడే అనుభవం నాకు లేదు. చిన్నప్పటి నుండి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఇవాళ ఆయన సినిమాకి పాటలు రాసే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. కమల్‌హాసన్‌గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సినిమాల ద్వారా ఓ కొత్త ఒరవడిని సృష్టించారు. ఈ చిత్రంలో మూడు పాటలు వున్నాయి. తమిళంలో వున్న పాటల్ని తెలుగులోకి అనువదించాను. 'జాతి మతాల' సాంగ్‌ కమల్‌గారే రాశారు. అలాగే అమ్మ పాట ఒకటి ఆయన స్వయంగా పాడారు. ఆయనతో ఈ సినిమాకి కలిసి పని చేయడం సంతృప్తిగా సంతోషంగా వుంది'' అన్నారు.


సంగీత దర్శకుడు జిబ్రాన్‌ మాట్లాడుతూ - ''ఇది నాకు చాలా ఇంపార్టెంట్‌ ఫిల్మ్‌. నా ఫస్ట్‌ ఫిల్మ్‌ కమల్‌హాసన్‌గారితోనే చేశాను. 'విశ్వరూపం-2' చిత్రానికి వర్క్‌ చేయడం ఓ మెమొరబుల్‌ ఎక్స్‌పీరియన్స్‌. రామజోగయ్య శాస్త్రిగారు తెలుగులో చక్కని పాటలు రాశారు'' అన్నారు.


హీరోయిన్‌ ఆండ్రియా మాట్లాడుతూ - ''ఈ సినిమా ఇన్‌క్రెడిబుల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చింది. కమల్‌హాసన్‌గారితో వర్క్‌ చేయడం నా అదృష్టం. ఆయనొక నట శిక్షణాలయం. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. వెరీ డిసిప్లిన్‌ణ పర్సన్‌. ఈ చిత్రంలో మిలటరీ ఆఫీసర్‌గా నటించాను. ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్‌ చేయడం గర్వంగా ఫీలవుతున్నాను. ఈ సినిమాని ఆడియన్స్‌ తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు'' అన్నారు.

 

మరో హీరోయిన్‌ పూజా కుమార్‌ మాట్లాడుతూ - ''విశ్వరూపం-2' చిత్రం కోసం నేను చాలా ఎగ్జైటెడ్‌గా ఎదురు చూస్తున్నాను. కమల్‌హాసన్‌గారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం గర్వంగా భావిస్తున్నాను'' అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !