View

చిన్నికృష్ణ దర్శకత్వంలో ‘సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్స్’’ సినిమా

Saturday,August04th,2018, 01:44 PM

సినిమా పరిశ్రమ లో నిలుదొక్కు కోవాలంటే చాలా అనుభవం కావాలి అంటారు. అలాంటి అనుభవాన్ని సొంతం చేసుకొని డిస్ట్రిబ్యూషన్ పై పరిపూర్ణమైన అవగాహనతో ఇద్దరు కుర్రాళ్ళ ఇండస్ట్రీ లో తమ ప్రయాణం మొదలు పెట్టారు. తమ కలలను సాకారం చేసుకునే వేదికకు ‘‘సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్’’ అనే పేరును ఖరారు చేసారు. వారే సురేష్ వర్మ, అహితేజ బెల్లంకొండ. వీరి ప్రయత్నాన్ని అభినందిస్తూ సినీ పెద్దలు ఈ బ్యానర్ లాంఛ్ లో భాగం అయ్యారు.


ఈ బ్యానర్ ని సెన్సేషనల్ డైరెక్టర్ ‘మారుతి’ అనౌన్స్ చేయగా, ఈ బ్యానర్ పై తొలి సినిమా చేస్తున్న దర్శకుడు చిన్ని కృష్ణను ‘‘ఆర్ ఎక్స్ 100’’ హీరో కార్తికేయ , ‘‘ఈ మాయ పేరేమిటో’’ హీరో రాహుల్ విజయ్ లు అనౌన్స్ చేశారు.. సినిమాహాల్ ఎంట్ టైన్మెంట్స్ బ్యానర్ లోగో ని నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, ‘‘ఆర్స్ ఎక్స్ 100’’ నిర్మాత అశోక్ రెడ్డి, ఫైట్ మాస్టర్ విజయ్ ఆవిష్కరించారు. చిన్ని కృష్ణ దర్శకత్వంలో త్వరలో ఈ బ్యానర్ పై సినిమా మొదలు కాబోతుంది.


ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ:
ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. వీరి ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. నాకు ‘‘ఈ రోజుల్లో’’ టైమ్ లో ఎలాంటి ఫీల్ కలిగిందో అలాంటి ఫీల్ కలిగింది. వీరు బ్యానర్ పెడుతున్నారని చెప్పగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ బ్యానర్ లో మంచి సినిమాలు రావాలనీ, వీళ్ళు పెద్ద ప్రొడ్యూసర్స్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’అన్నారు.


హీరో కార్తికేయ మాట్లాడుతూ:
‘ ఆర్ ఎక్స్ 100 విజయంలో సురేష్ పాత్ర చాలా ఉంది. సినిమా కంప్లీట్ అయిన తర్వాత బిజినెస్ అండ్ డిస్ట్రి బ్యూషన్ కి సంబంధించిన వ్యవహారాలతో పాటు పబ్లిసిటీ కూడా తనే కంప్లీట్ గా చూసుకున్నాడు. మా సినిమాకు ఇంత సహాకారం అందించిన సురేష్ సొంత బ్యానర్ ని ఇంకేంత బాగా చూసుకుంటాడో అర్ధం అవుతుంది. వీరి బ్యానర్ లో తప్పకుండా సినిమా చేయాలని ఉంది’ అన్నారు.


దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ:
‘సినిమా ఇండస్ట్రీ లో కేవలం ఇరవై శాతం మాత్రమే సక్సెస్ అవుతారు. ఈ పరిశ్రమలోకి వచ్చిన వారందరు లో కేవలం 5 పర్సెంట్ మాత్రమే రెండో సినిమాకు మిగులుతారు. అలాంటి వారిలో ఈ నిర్మాతలు ఉంటారని నమ్ముతున్నాను. షార్ట్ టర్మ్ ప్లాన్ లు కాకుండా లాంగ్ టర్మ్ ప్లానింగ్ తో వచ్చే వారికి ఇక్కడ అవకాశాలుంటారు. నేను ఇండస్ట్రీ లో అహితేజ,సురేష్ వర్మల జడ్జిమెంట్ ని బాగా నమ్ముతాను. సినిమా టీజర్, ట్రైలర్ ని చూడగానే సినిమా స్కేల్ ని అంచనా వేయగలరు ఇద్దరు. తప్పకుండా ఈ బ్యానర్ లోగో కూడా వారి నుండి ఎలాంటి సినిమాలు చూడబోతున్నామో చెబుతుంది. ’ అన్నారు.


దర్శకుడు చిన్నికృష్ణ మాట్లాడుతూ:
‘ఒక రోజు కథలేమైనా ఉంటే చెప్పని నిర్మాతలలో ఒకరైన అహితేజ అడిగాడు. ఒక రెండు కథలు చెప్పాక ఇంకేమైనా ఉన్నాయా అని అడిగాడు .నేను ఒక ఐడియా చెప్పాను. ఇది బాగుంది అన్న డవలెప్ చేయ్ సినిమా చేద్దాం అన్నాడు. సినిమా ఆఫీస్ కి వచ్చే టప్పుడు ఇద్దరిలో ఒకరు ఫోన్ చేసి నీకది మొదటిసినిమా అనుకొని రా అన్నారు. మరొకరు ఫోన్ చేసి నీకిది వందో సినిమా అనుకొని రమ్మని అన్నారు. నేను కన్ ఫ్యూజ్ అయ్యాను. తర్వాత అర్దం అయ్యింది. ఒకరు బాధ్యతను గుర్తు చేసారు. మరొకరు ధైర్యాన్ని ఇచ్చారు. ఈ రెండు లక్షణాలు ఉన్న నిర్మాతలు దొరకడం నా అదృష్టం’ అన్నారు.


హీరో రాహుల్ విజయ్ మాట్లాడుతూ:
‘ ఇది నా హోమ్ బ్యానర్ లాంటిది. ఈ నిర్మాతలు నాకు ముందు నుండీ తెలుసు. వీరి బ్యానర్ లో ఒక సినిమా చేయాలనుకుంటున్నాను. మంచి సినిమాలు నిర్మించే బ్యానర్ గా ఎదగాలని కోరుకుంటున్నాను’ అన్నారు.


ఫైట్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ:
‘ఈ నిర్మాతలు నాకు సొంత బిడ్డల్లాంటి వారు. వీరు తప్పకుండా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.


నిర్మాతలలో ఒకరైన ‘‘సురేష్ వర్మ’’ మాట్లాడుతూ:
‘సినిమా ఎక్స్ పీరియన్స్ కలిగించే ఆనందం మా బ్యానర్ లో కనపడాలని లోగో ని అలా డిజైన్ చేసాం. సినిమా ఎక్కడా చూసినా కూడా థియేటర్ ఇచ్చే ఆనందం వేరు. ప్రతి హీరోకి అభిమానులుంటారు. కానీ అందరి అభిమానులు కూడా థియేటర్స్ కి వచ్చే తమ ఆనందాన్ని పంచుకుంటారు. మా సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్స్ పై అలాంటి కథలు వస్తాయనే ప్రామిస్ చేస్తున్నాను. చిరంజీవి గారి మీద అభిమానంతో మొదలైన మా ప్రయాణం ‘‘సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్స్’’ వరకూ వచ్చిందంటే దాని వెనకాల మాకు సహాకరించిన వారందరికీ కృతజ్ఞతలు. నిర్మాతగా మాకు రామోజీరావు గారంటే ఆదర్శం. చిత్రం, ఆనందం వంటి చిన్న సినిమాలతో పెద్ద సక్సెస్ లు అందుకున్నారు. అలాగే ఇండస్ట్రీ లో అల్లుఅరవింద్, యువి క్రియేషన్స్ వంశీ,ప్రమోద్, మా ప్రయత్నానికి అండగా నిలబడిన మధుర శ్రీధర్ రెడ్డి గారంటే చాలా అభిమానం ’ అన్నారు.


నిర్మాతల్లో మరొకరు అయిన ‘‘అహితేజ బెల్లంకొండ’’ మాట్లాడుతూ:
‘నాకు సినిమా అంటే చిరంజీవి గారే.. నాకు సినిమాను పరిచయం చేసి,ఇంత మంది ఫ్రెండ్స్ ను,శ్రేయోభిలాషులను ఇచ్చింది ఆయన..అంతర్వేది అనే చిన్న ఊరి నుండి వచ్చి కమెడియన్ గా సక్సెస్ అయిన ప్రవీణ్ నాకు అన్నయ్య అవుతాడు. ఈ వేదికమీద ఆయన్ను మిస్ అవుతున్నాను. అలాగే మా సినిమాల ద్వారా వచ్చిన లాభాల్లో కొంత మా ఊరి బాగుకోసం ఖర్చుపెడదాంఅనుకుంటున్నాం. మా మొదటి సినిమా నుండే ఆ పనిని మొదలు పెడతాం.’ ఇక మాకు ఇలాంటి మంచి ప్రొడక్షన్ పేరు సజెస్ట్ చేసిన డిజైనర్ ‘‘గౌరి నాయుడు’’ గారికి స్పెషల్ థాంక్స్’’అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !