View

ఈజీ మనీ కోసం మోసాలు చేసే కుర్రాళ్ల కథతో 'పైసా పరమాత్మ'

Tuesday,August07th,2018, 10:30 AM

కొత్తదనం ఉంటే ప్రేక్షకులు ఎలాంటి చిత్రాన్నైనా ఆదరిస్తారని లేటెస్ట్‌గా 'గూఢచారి' చిత్రంతో మరోసారి రుజువు చేసారు. స్టార్స్‌ లేకపోయినా పర్వాలేదు, కంటెంట్‌ ఉంటే చాలు ఆడియెన్స్‌ ఆ చిత్రాలకు పట్టం కడతారని 'పెళ్లిచూపులు, అర్జున్‌ రెడ్డి', రీసెంట్‌గా 'ఆర్‌.ఎక్స్‌ 100' చిత్రాలు ప్రూవ్‌ చేశాయి. ఆ చిత్రాలు సెన్సేషనల్‌ హిట్‌ సాధించి సరికొత్త ట్రెండ్‌ని సృష్టించాయి. తాజాగా కంటెంట్‌ బేస్డ్‌తో 'పైసా పరమాత్మ' చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నూతన నటీ నటులు సంకేత్‌, సుధీర్‌, క ష్ణతేజ, రమణ, అనూష, ఆరోహి నాయుడు, బనీష, ప్రధాన పాత్ర దారులుగా లక్ష్మీ సుచిత్ర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై విజయ్‌ కిరణ్‌ దర్శకుడిగా విజయ్‌ జగత్‌ నిర్మిస్తోన్న డిఫరెంట్‌ కథా చిత్రం 'పైసా పరమాత్మ'. ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కి రెడీ అవుతోంది. కాగా ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని బోనాల పండుగ సందర్బంగా ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరి తన ఆఫీస్‌లో రిలీజ్‌ చేసారు. ఈ కార్యక్రంలో దర్శకుడు విజయ్‌ కిరణ్‌, సంగీత దర్శకుడు కనిష్క, సంకేత్‌, క ష్ణ తేజ, రమణ, ఆరోహి నాయుడు, పాల్గొన్నారు.


ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ - ''ఈ సినిమా కాన్సెప్ట్‌ దర్శకుడు విజయ్‌ కిరణ్‌ చెప్పారు. చాలా కొత్తగా వుంది. అందరూ కొత్త వాళ్ళు ఈ చిత్రంలో నటించారు. టైటిల్‌ చాలా ఇంప్రెస్‌గా వుంది. పోస్టర్‌ చాలా బాగుంది. ఇలాంటి టాలెంట్‌ వున్న వారు కొత్త కాన్సెప్ట్‌లతో ముందుకు రావాలి. కొత్త కంటెంట్‌తో డిఫరెంట్‌గా తీస్తే ఆడియెన్స్‌ ఆదరిస్తున్నారు. అది రీసెంట్‌గా 'గూఢచారి'తో మరోసారి ప్రూవ్‌ అయ్యింది. విజయ్‌ కిరణ్‌ షార్ట్‌ ఫిలిమ్స్‌ కొన్ని తీసి, ఫస్ట్‌ టైం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా మంచి హిట్‌ అయి దర్శకుడిగా విజయ్‌ కిరణ్‌కి మంచి బ్రేక్‌ రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.


దర్శకుడు విజయ్‌ కిరణ్‌ మాట్లాడుతూ - ''కొత్త టాలెంట్‌ని ఎంకరేజే చేయడంలో రాజ్‌ కందుకూరిగారు ఎప్పుడూ ముందుంటారు. మేము అడగ్గానే వెంటనే స్పందించి మా చిత్రం మోషన్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేసిన రాజ్‌ కందుకూరిగారికి మా థాంక్స్‌. ఈజీ మనీ కోసం దొంగతనాలు, మోసాలు చేస్తోన్న ఓ నలుగురు కుర్రాళ్లు, ఇద్దరు యువతలు అనుకోకుండా ఓ ప్రాబ్లమ్‌లో ఇరుక్కొంటారు. ఆ తర్వాత వాళ్ళు ఆ ప్రాబ్లమ్‌ నుండి బయట పడ్డారా లేదా? అనేది ముఖ్య కథాంశం. ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సస్పెన్స్‌, థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం. కంటెంట్‌ని నమ్మి మా నిర్మాత విజయ్‌ జగత్‌ ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. జి.యల్‌. బాబు కెమెరా వర్క్‌, కనిష్క మ్యూజిక్‌ ఈ చిత్రానికి స్పెషల్‌ ఎస్సెట్‌గా నిలుస్తాయి. కనిష్క మూడు పాటలు ఫెంటాస్టిక్‌గా చేసారు. అలాగే తన రీ-రికార్డింగ్‌తో సినిమాని నెక్స్ట్‌ లెవల్‌కి తీసుకెళ్లాడు. తప్పకుండా 'పైసా పరమాత్మ' చిత్రం ఆడియెన్స్‌కి ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ని కలిగిస్తుంది. అలాగే డిస్ట్రిబ్యూటర్స్‌కి, బయ్యర్స్‌కి పైసా వసూల్‌ చేసే చిత్రం అవుతుందని చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాం'' అన్నారు.


సంగీత దర్శకుడు కనిష్క మాట్లాడుతూ - ''ఈ చిత్రంలో మూడు పాటలు ఉన్నాయి. ప్రతి పాట సిట్చ్యుయేషన్‌కి తగ్గట్లుగా వుంటుంది. ఇప్పటి వరకూ రాని ఓ కొత్త పాయింట్‌తో విజయ్‌ కిరణ్‌ 'పైసా పరమాత్మ' చిత్రాన్ని రూపొందించారు. డెఫినెట్‌గా ఈ చిత్రం మంచి హిట్‌ అవుతుంది'' అన్నారు.


నటుడు క ష్ణ తేజ మాట్లాడుతూ - ''ఈ చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌గా మెయిన్‌ లీడ్‌ క్యారెక్టర్‌లో నటించాను. డైరెక్టర్‌ విజయ్‌ కిరణ్‌గారు ప్రతి క్యారెక్టర్‌ని అద్భుతంగా డిజైన్‌ చేసారు. ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసే విధంగా ఈ చిత్రం ఉంటుంది. మోషన్‌ పోస్టర్‌ లాంచ్‌ చేసిన రాజ్‌ కందుకూరిగారికి స్పెషల్‌ థాంక్స్‌'' అన్నారు.


మరో నటుడు సంకేత్‌ మాట్లాడుతూ - ''ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో నటించాను ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌గారికి నా థాంక్స్‌'' అన్నారు.


నటి ఆరోహి నాయుడు మాట్లాడుతూ - ''కిల్లర్‌ క్యారెక్టర్‌లో నటించాను. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.


ఈ చిత్రానికి కథ: హరికిరణ్‌, సంగీతం: కనిష్క, కెమెరా: జి.యల్‌.బాబు, ఎడిటింగ్‌: అనిల్‌ జల్లు, మాటలు: రాకేష్‌ రెడ్డి, స్క్రీన్‌ ప్లే - దర్శకత్వం: విజయ్‌ కిరణ్‌, నిర్మాత: విజయ్‌ జగత్‌.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !