filmybuzz

View

'మను' ట్రైలర్ లాంఛ్ విశేషాలు

Sunday,August12th,2018, 01:16 PM

రాజా గౌతమ్‌, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'మను' ట్రైలర్‌ను ఆదివారం హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో విడుదల చేశారు. నిర్వాణ సినిమాస్‌ సమర్పణలో క్రౌడ్‌ ఫండెడ్‌గా నిర్మితమైన ఈ చిత్రానికి ఫణీంద్ర నార్‌శెట్టి దర్శకుడు.


రాజా గౌతమ్‌ మాట్లాడుతూ - ''ఇది మూడేళ్ల ప్రయాణం. ఈ జర్నీ స్టార్ట్‌ కాకముందు చాలా షార్ట్‌ ఫిలింస్‌ చూశాను. షార్ట్‌ ఫిలింస్‌ డైరెక్టర్స్‌ని కలిశాను. 40-50 కథలు విన్నాను. ఈ ప్రాసెస్‌లో మధురం అనే షార్ట్‌ ఫిలిమ్‌ చూసాను, చాలా బాగా నచ్చింది. డైరెక్టర్‌ ఫణిని అప్రిషియేట్‌ చేశాను కూడా. ఆ సందర్భంలో మను సినిమా గురించి.. ఓ పదిహేను నిమిషాలు కథ చెప్పాడు. స్క్రిప్ట్‌ అద్భుతంగా ఉందని చెప్పాను. ఓరోజు తను మను క్యారెక్టర్‌ నువ్వే చేస్తున్నావ్‌ అంటూ మెసేజ్‌ చేశాడు. చాలా సంతోషంగా అనిపించింది. 115 మంది డబ్బులు పెట్టి చేసిన సినిమా కాబట్టి.. ఎంత బాధ్యతగా ఉండాలో తెలిసిన వ్యక్తి. ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. హీరోయిన్‌ చాందిని మాతో కలిసిపోయి పనిచేసింది. చాలా ఓపికగా సినిమా కోసం పనిచేసింది. తన కమిట్‌మెంట్‌, డేడికేషన్‌ సూపర్బ్‌. నీల పాత్రలో అద్భుతంగా నటించింది. సెప్టెంబర్‌ 7న సినిమా విడుదలవుతుంది'' అన్నారు.


చాందిని చౌదరి మాట్లాడుతూ - ''ఈ క్షణం కోసం నేను ఎంతో వెయిట్‌ చేశాను. ట్రైలర్‌ అందరికీ నచ్చే ఉంటుంది. దీని కంటే ఎన్నో రెట్లు సినిమా గొప్పగా ఉంటుంది. ఫణి, తను చెప్పేదాని కంటే గొప్ప విజన్‌ ఉన్న డైరెక్టర్‌. నాపై నమ్మకంతో ఫణి నాకు అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాలో నీలు అనే డెప్త్‌ ఉండే క్యారెక్టర్‌ చేశాను.'' అన్నారు.


డైరెక్టర్‌ ఫణీంద్ర నార్‌శెట్టి మాట్లాడుతూ - ''ఇది నాకు ఎమోషనల్‌ మూమెంట్‌. కాబట్టి ఇన్వెస్టర్స్‌ను మరచిపోలేను. ఇంత పెద్ద ప్రయాణం ఎక్కడ మొదలైందని చెప్పలేను. ఈ సినిమా కోసం వెయ్యి రూపాయల నుండి నలబై లక్షల వరకు ఇచ్చిన వాళ్లు ఉన్నారు. సినిమాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. సినిమా మా వర్క్‌ గురించి ఎక్కువగా చెబుతుందని నమ్ముతున్నాం. ఇంత కంటే బెస్ట్‌ టీమ్‌తో పనిచేయలేనేమోననిపిస్తుంది. ఏడాదిన్నర క్రితమే నిర్వాణ సినిమాస్‌ మమ్మల్ని సంప్రదించారు. వాళ్ల నమ్మకాన్ని సినిమా నిజం చేస్తుందని నమ్ముతున్నాను'' అన్నారు.


నిర్వాణ సినిమాస్‌ రాజ్‌ నిహార్‌ మాట్లాడుతూ - ''ఒక సినిమా అందరికీ రీచ్‌ కావాలంటే మంచి కథ కావాలి. అలాంటి కథతో ఫణి చేసిన చిత్రమిది. మంచి సినిమా వచ్చినప్పుడు దాన్ని ప్రేక్షకులకు అందించాల్సిన బాధ్యత డిస్ట్రిబ్యూటర్స్‌గా మాపై ఉందనిపించింది. అందుకే మేము ఈ సినిమాలో భాగమైయాం'' అన్నారు.


రాజా గౌతమ్‌, చాందిని చౌదరి, జాన్‌ కొటొలి, మోహన్‌ భగత్‌, అభిరామ్‌, శ్రీకాంత్‌ ముళ్లగరి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: విశ్వనాథ్‌ రెడ్డి, ఆర్ట్‌: శివ్‌కుమార్‌, సౌండ్‌ డిజైన్‌: సచిన్‌ సుధాకరన్‌, హరిహరన్‌, నిర్మాణం: క్రౌడ్‌ ఫండింగ్‌ మూవీ(115 మెంబర్స్‌), రచన, దర్శకత్వం: ఫణీంద్ర నార్‌శెట్టి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరి ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత ..

Read More !

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

Gossips

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Read More !