View

4 ఇడియట్స్ ఆడియో లాంఛ్ విశేషాలు

Tuesday,August21st,2018, 04:10 PM

నాగార్జున సినీ క్రియేషన్స్ పతాకం పై కార్తీ, సందీప్, చలం, సన్నీ, చైత్ర, ప్రియా, శశి మరియు రుచి హీరో హీరోయిన్ గా సతీష్ కుమార్ శ్రీరంగం స్వయం దర్శకత్వం లో నిర్మించబడిన చిత్రం 4 ఇడియట్స్. ఈ చిత్రానికి సంభందించిన ఆడియో విడుదల వేడుక హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో ఘనంగా జరిగింది. అగ్ర నిర్మాత సి. కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేసి 4 ఇడియట్స్ ఆడియోను విడుదల చేసారు.


అనంతరం సి కళ్యాణ్ మాట్లాడుతూ - "ఈ సినిమా లో అందరు కొత్తవాళ్లు నటించారు. దర్శక నిర్మాత సతీష్ కుమార్ శ్రీరంగం నాకు బాగా పరిచయం. చిన్న సినిమాలు విడుదల చాల కష్టం, వారానికి 6 సినిమాలు విడుదలవుతున్నాయి కానీ జనం థియేటర్ కి రావటం లేదు. చాల బాధగా ఉంది. కానీ నిర్మాత సతీష్ కి డిస్ట్రిబ్యూషన్ మీద మంచి పట్టు ఉంది. అతనికి చాల అనుభవం ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా విడులవుతుంది. ఈ 4 ఇడియట్స్ విడుదలై మంచి విజయం సాధించాలని కోరుకుంటున్న" అని అన్నారు.


కార్పొరేటర్ సంజయ్ గౌడ్ గారు మాట్లాడుతూ - "దర్శక నిర్మాత సతీష్ గారు చాలా కష్టపడ్డారు. ఈ సినిమా ద్వారా చాలా మంది కొత్తవాళ్లకు అవకాశం కల్పించారు. ఈ సినిమా మంచి విజయం కావాలి" అని కోరుకున్నారు.


తుమ్ములపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ - "ఎన్నో ఆశలు పెట్టుకుని ఇండస్ట్రీ కి వచ్చే కొత్తవాళ్ళకి మార్గదర్శం మా సతీష్ కుమార్ శ్రీరంగం. ఈరోజుల్లో చిన్న సినిమా అంటే చాలా కష్టం అలాంటిది మా సతీష్ అందరు కొత్తవాళ్లతో నిర్మించిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఓపెనింగ్ కి నేను వచ్చాను, ఇప్పుడు ఆడియో విడుదల వీడుక జరుగుతుంది అలాగే ఈ సినిమా కూడా విడుదలై మంచి విజయకావాలి. యూనిట్ సభ్యులందరికి నా శుభాకాంక్షలు" అని తెలిపారు.


సాయి వెంకట్ మాట్లాడుతూ - "చాలా తక్కువ సమయం లో ఈ 4 ఇడియట్స్ సినిమా నిర్మించారు మా సతీష్ కుమార్ శ్రీరంగం గారు. అయన మంచి టాలెంట్ ఉన్న నిర్మాత దర్శకుడు. ఎన్నో సినిమా నిర్మించి విడుదల చేసారు. అని మంచి హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా మంచి విజయం కావాలి" అని కోరుకున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ జయ సూర్య మాట్లాడుతూ - "సినిమా పేరు 4 ఇడియట్స్ కానీ ఈ సినిమా కి పని చేసిన టెక్నీషియన్ అందరు మంచి ఇంటెలిజెంట్. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి పాటలు ఉన్నాయ్. అందరికి నచుతుంది" అని కోరుకున్నారు.


దర్శక నిర్మాత సతీష్ కుమార్ శ్రీరంగం మాట్లాడుతూ - "ప్రభు దేవా గారు నటించిన లక్ష్మి సినిమా ఈ వరం రిలీజ్ ఉన్న సి కళ్యాణ్ గారు చాలా బిజీ గా ఉన్న నా సినిమా ఆడియో విడుదల చేయటానికి విచ్చేసిన సి కళ్యాణ్ గారికి నా కృతఙ్ఞతలు. ఈ సినిమా లో పనిచేసిన 24 క్రాఫ్ట్స్ నటీనటులు అందరు కృష్ణ నగర్ లో ఉన్నవారే. గతం లో నేను చాల మంది కొత్తవాళ్లను సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేశాను. చాల మంది సక్సెస్ అయ్యారు. మంచి పరిచయాలు ఉన్న నేను ఇప్పటివరకు 14 చిన్న సినిమాలు తెలుగు,తమిళం, మలయాళం భాషల్లో చేశాను అని మంచి విజయం సాధించాయి. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుంది అని నమ్మకం ఉంది. పాటలు చాలా బాగున్నాయి. ఒక్కపుడు ఇండస్ట్రీ లో ఎవరికైన భాధ ఉంటే మన దర్శకరత్న దాసరి నారాయణ రావు గారు ఉన్నారు. ఇప్పుడు మన సినీ రత్న సి కళ్యాణ్ గారు ఉన్నారు. అందరు చిన్న సినిమా నుంచే వచ్చారు. ఈ 4 ఇడియట్స్ మంచి కథ, కొత్త వాళ్ళతో తీసాను. మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్. వచ్చే నెల విడుదలకు సన్నాహాలు చేస్తున్నాను" అని తెలిపారు.


బ్యానర్ : నాగార్జున సినీ క్రియేషన్స్
నటీనటులు : కార్తీ, సందీప్, చలం, సన్నీ, చైత్ర, ప్రియా, శశి, రుచి, జబర్దస్త్ రైసింగ్ రాజు, గణపతి, జూనియర్ రాజశేఖర్, సుధీర్, నాగు, విజయ్ కుమార్, మాస్టర్ శ్రీశాంత్
సంగీతం : జయ సూర్య, డాన్స్ : వినోద్, ఫైట్స్ : శ్యామ్, ఎడిటర్ : సెల్వ కుమార్, కెమెరా : నగేష్, ఆర్ట్ : విజయ్ కృష్ణ, పాటలు (టైటిల్ సాంగ్) : కొమ్ము యాదయ్య , కథ, కథనం, దర్శకత్వం, నిర్మాత : సతీష్ కుమార్ శ్రీరంగం



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !