View

ఆగస్ట్ 31న వస్తున్న 'పేపర్ బాయ్'

Thursday,August23rd,2018, 02:05 PM

సంతోష్ శోభన్ హీరోగా ప్రియాశ్రీ, తాన్యా హోప్ హీరోయిన్స్ గా జయశంకర్ దర్శకత్వంలో సంపత్ నంది టీమ్ వర్క్స్, ప్రచిత్ర క్రియేషన్స్, బి ఎల్ ఎన్ సినిమా బ్యానర్స్ పై సంపత్ నంది, రాములు, వెంకట్, నర్సింహులు సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'పేపర్ బాయ్'. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలకు, టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. హిట్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లై ని అందించడం విశేషం. ఇక ఈ చిత్రం థియేటర్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ఆగష్టు 23న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. 'పేపర్ బాయ్' టైటిల్ సాంగ్ ని రచయిత కసర్ల శ్యాం రిలీజ్ చేసారు. ఈ కార్యక్రమంలో కథా రచయిత, నిర్మాత సంపత్ నంది, దర్శకుడు జయశంకర్, హీరో సంతోష్ శోభన్, సంగీత దర్శకుడు భీమ్స్ సిసి రోలియో, నిర్మాతల్లో ఒకరైన నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.


పాటల రచయిత కాసర్ల శ్యాం మాట్లాడుతూ - ఈరోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను.నేను రాసిన పేపర్ బాయ్ టైటిల్ సాంగ్ ని నా చేత రిలీజ్ చేయించడం చాలా హ్యాపీగా వుంది. ఈ పాటని చంద్రబోస్ గారు ఆలపించడం గొప్ప వరంగా భావిస్తున్నాను. నేను ఏక లవ్య శిష్యుండ్ని ఆయనికి. ఆయన పాటలు వింటూ పెరిగిన వాడ్ని. సంపత్ నంది గారితో ప్రతి మీటింగ్ ఓ పండగలా జరిగింది. పోక్, మాస్, తెలంగాణ యాసలో పాటలు రాసె నాకు ఇలాంటి టైటిల్, మెలోడీ పాటలు రాసె ఛాన్స్ ఇచ్చిన సంపత్ గారికి నా థాంక్స్. నా శైలిని పూర్తిగా మార్చి నాతో పాటలు రాయించుకున్న భీమ్స్ కి నా ధన్యవాదాలు. పేపర్ బాయ్ వున్నంతకాలం ఈ టైటిల్ సాంగ్ గుర్తుంటుంది అని చంద్ర బోస్ గారు మెచ్చు కున్నారు అన్నారు.


సంగీతదర్శకుడు భీమ్స్ మాట్లాడుతూ - చంద్రబోస్ గారి పాటలు విను అని సంపత్ నంది గారు నాకు కొన్ని వందలసార్లు చెప్పారు. మంచి మ్యూజిక్ చేయడానికి ఆయనే నాకు ఇన్స్పిరేషన్. ఆయన్ని పాట పాడాలి అని అడగ్గానే స్టూడియోకి వచ్చి ఒకరోజు అంతా ఉండి టైటిల్ సాంగ్ పాడారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు పెద్ద హిట్ అయ్యాయి. సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చుతుంది అన్నారు.


హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ - పేపర్ బాయ్ టైటిల్ సాంగ్ పాడిన చంద్రబోస్ గారికి నా థాంక్స్. ఈ సినిమా ఆగష్టు 31న విడుదల అవుతుంది. సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.


కతా రచయిత, నిర్మాత సంపత్ నంది మాట్లాడుతూ - ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వాటి గురించి అందరూ పాజిటివ్ గానే రివ్యూస్ రాసారు. వారందరికీ ఫస్ట్ నా థాంక్స్. పేపర్ బాయ్ టైటిల్ సాంగ్ ని కాసర్ల శ్యామ్ అద్భుతంగా రాసారు. పేపర్ బాయ్ వున్నంతకాలం ఈ పాట నిలిచిపోతుంది. చంద్రబోస్ గారికి నేను పెద్ద అభిమానిని. ఆయన రాసిన 'మంచుకొండల్లోని' నుండి నిన్నటి యెంత సక్కగున్నావే వరకు ఆయన పాటలంటే నాకు ఎంతో ఇష్టం. అలాంటిది ఆయన మా సినిమా టైటిల్ సాంగ్ పాడటం చాలా హ్యాపీగా వుంది.బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ కోరిక మేరకు ముందు అనుకున్న ప్రకారం సెప్టెంబర్ 7న కాకుండా ఆగస్టు 31న ఈ చిత్రాన్నివరల్డ్ వైడ్ గా అత్యధిక స్క్రీన్ లలో రిలీజ్ చేస్తున్నాం.


ఈరోజు నుండి పేపర్ బాయ్ రోడ్ ట్రిప్ !!
ఈ సినిమా గురించి అందరికీ తెలియాలి. అందరికీ ఈ సినిమా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు నుండి రోడ్ ట్రిప్ ప్లాన్ చేసాం. మా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ప్రతి గ్రామం, ప్రతి టౌన్, ప్రతి సిటీ, ఇంటింటికి తిరిగి పేపర్ వేసి అందర్నీ కలవబోతున్నారు అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !