filmybuzz

View

దేశంలో దొంగలు పడ్డారు లోని ట్విస్ట్ లు చాలా బాగున్నాయి - అలీ

Tuesday,August28th,2018, 03:53 PM

అలీ సమర్పణలో ఖ‌యూమ్‌, తనిష్క్, షానీ, పృథ్విరాజ్‌, స‌మీర్‌, లోహిత్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన సినిమా దేశంలో దొంగ‌లు ప‌డ్డారు. సారా క్రియేషన్స్ ప‌తాకంపై. రూపొందింది. గౌత‌మ్ రాజ్‌కుమార్ ద‌ర్శ‌కుడు. ర‌మా గౌత‌మ్ నిర్మాత‌.


ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ - ఇదొక క్రైమ్ థ్రిల్ల‌ర్‌. హ్యూమ‌న్ ట్రాఫికింగ్ అంశాన్ని హైలైట్ చేస్తూ, ఇప్పుడు స‌మాజంలో జ‌రుగుతున్న ప‌రిస్థితుల‌ను ప్ర‌తిబింబిస్తూ క‌థ‌ను తెర‌కెక్కించాం. ఇప్ప‌టికే విడుద‌ల‌యిన టీజ‌ర్‌కి విశేష స్పంద‌న వ‌చ్చింది. ఇటీవ‌ల సినిమా చూసిన అలీ బాగా న‌చ్చ‌డంతో ఈ సినిమాకు స‌మ‌ర్ప‌కుడిగా ఉండ‌టానికి అంగీక‌రించారు. త‌మ్ముడి కోసం ఆయ‌న స‌మ‌ర్పించ‌డం లేదు. సినిమా న‌చ్చి స‌మ‌ర్పిస్తున్నారు. మా టీమ్ అంద‌రూ చాలా క‌ష్ట‌ప‌డి ప‌నిచేశారు. ద‌ర్శ‌కుడిగా ఇది నా తొలి సినిమా. నేను బాగా చేశాన‌ని చెప్ప‌డం క‌న్నా, ప్రేక్ష‌కులు సినిమా చూసి చెప్తార‌ని ఆశిస్తున్నాను. విడుద‌ల‌కు ముందే మా సినిమా బ్లాక్ బెర్రీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెస్టివ‌ల్‌కి వెళ్లింది. అది చాలా సంతోషం అని అన్నారు.


ఖ‌య్యుమ్ మాట్లాడుతూ - ఇప్ప‌టిదాకా వంద సినిమాలు చేశాను. అందులో హీరోగానూ ఉన్నాయి. నా కంటూ ఓ డ్రీమ్ రోల్ ఉంటుంది క‌దా.. అలాంటి సినిమా ఇది. క‌థ విన‌గానే న‌మ్మి చేశాను. టీమ్ అంద‌రూ క‌ష్ట‌ప‌డి పనిచేశారు. త‌ల్లి సెంటిమెంట్ ఉన్న సినిమా ఇది. హ్యూమ‌న్ ట్రాఫికింగ్ మీద ఉంటుంది. నా లైఫ్లో చెప్పుకునే సినిమా అవుతుంది. తొలిసారి ఈ సినిమా చూసి మా అన్న‌య్య న‌న్ను అప్రిషియేట్ చేశారు. సినిమా చాలా బాగా చేశార్రా బావుంది అని ఆయ‌న అన‌డం మ‌ర్చిపోలేను అని అన్నారు.


స‌హ నిర్మాత సంతోష్ మాట్లాడుతూ - షూటింగ్‌లో ఓ సారి ఖ‌య్యుమ్‌గారికి యాక్సిడెంట్ అయింది. అక్క‌డి నుంచి ఫ్లైట్స్ కూడా లేవు. అయినా 12 గంట‌లు ఆయ‌న ర‌క్తం కారుతున్నా ప్ర‌యాణం చేశారు. అలా ఎంత‌గానో అంద‌రూ స‌హ‌క‌రించారు అని చెప్పారు.


అలీ మాట్లాడుతూ - టి.కృష్ణ‌గారి ద‌ర్శ‌క‌త్వంలో దేశంలో దొంగ‌లుప‌డ్డారు అనే సినిమా వ‌చ్చింది. అప్ప‌ట్లో అందులో వేషం వేయ‌డానికి నేను వెళ్లాను. నీ ఫేస్ చాలా కామెడీగా ఉంటుంది. చిన్న‌పిల్లాడివి. నువ్వు చ‌చ్చిపోయే పాత్ర చేస్తే జ‌నాలు న‌వ్వుతారు వ‌ద్దు.. అని న‌న్ను పంపించేశారు. `ఏ రోజుకైన ఈ అబ్బాయి పెద్ద‌స్టార్ అవుతాడు` అని ఆయ‌న త‌న స్నేహితుల‌తో ఆరోజే చెప్పార‌ట‌. టి.కృష్ణ‌గారి స్నేహితుడు నాగేశ్వ‌ర‌రావుగారు టి.కృష్ణ స‌మ‌ర్పించు అనే ఓ సినిమా చేశారు. ముత్యాల సుబ్బ‌య్య‌గారి ద‌ర్శ‌క‌త్వంలో. ఆ సినిమా `అమ్మాయి కాపురం`. ఆ సినిమాకు నాకు ఉత్త‌మ క‌థానాయ‌కుడిగా అవార్డు వ‌చ్చింది. ఇప్పుడు దేశంలో దొంగ‌లు ప‌డ్డారు అని కృష్ణ‌గారి టైటిల్‌తో మా త‌మ్ముడు ఓ సినిమా చేశాడు. ఈ సినిమాకు నా జేబు నుంచి రూపాయి కూడా పెట్ట‌లేదు. సినిమా చాలా బావుంద‌నిపించింది. అందుకే స‌మ‌ర్పిస్తున్నాను. మా త‌మ్ముడు గోల్డెన్ స్పూన్‌తో పుట్టాడు. క‌ష్టాలు నేను ప‌డ్డాను కానీ, వాడు ప‌డ‌లేదు. కానీ ఈ సినిమా కోసం కొన్నాళ్లు భోజ‌నం కూడా స‌రిగా లేకుండా ప‌నిచేశాన‌ని చెప్పాడు. వాడి కోస‌మే ఈ సినిమా చూశాను. ట్విస్ట్ ల‌న్నీ చాలా బావున్నాయి. నేను ద‌ర్శ‌కుడిని పిలిచి ఎక్క‌డ ప‌నిచేశావ‌ని అడిగాను. ఎవ‌రి ద‌గ్గ‌రా చేయ‌లేద‌ని చెప్పాడు. 30 ఏళ్ల‌కు ముందు రామ్‌గోపాల్ వ‌ర్మ‌ను చూసిన‌ట్టు అనిపించింది. ఈ సినిమాను వ‌ర్మ చూస్తే త‌ప్ప‌కుండా మెచ్చుకుంటాడు అని అన్నారు.


సెలెబ్ కనెక్ట్ అధినేత సుమన్ మాట్లాడుతూ - ట్రైలర్ చూడగానే మంచి సినిమా అవుతుందనిపించింది. సినిమా నచ్చి మూవీ కి సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నాం. ఇకపై కూడా ఇలాంటి మరిన్ని మంచి సినిమాలను ప్రోత్సహిస్తూ నిర్మాతలుగా భాగం పంచుకొవాలనుకుంటున్నాం అన్నారు.


గిరిధ‌ర్‌, జ‌బ‌ర్ద‌స్త్ రాఘ‌వ‌, వినోద్‌, త‌డివేలు త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ధారులు. ఈ సినిమాకు కెమెరా: శేఖ‌ర్ గంగ‌న‌మోని, సంగీతం: శాండీ, ఎడిటింగ్‌: మ‌ధు.జి.రెడ్డి, క‌ళ‌: మ‌ధు రెబ్బా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: సాయికుమార్ పాల‌కుర్తి, స‌హ నిర్మాత‌లు: సంతోష్ డొంకాడ‌, సెలెబ్ కనెక్ట్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Read More !