View

సెప్టెంబర్ 21న నన్ను దోచుకుందువటే రిలీజ్.. ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్

Tuesday,September11th,2018, 12:38 PM

సమ్మోహనంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహ‌నం చేసిన సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ లో ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే. టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉండడం... హీరో, హీరోయిన్ పెర్ ఫార్మెన్స్ ఫ్రెష్ గా అనిపించింది. ఆఫీస్ మొత్తం భయ‌ప‌డే సాఫ్ట్ వేర్ కంపెనీ మేనేజ‌ర్ గా సుధీర్‌బాబు న‌టించ‌గా.. అల్ల‌రి చేసే గ‌డుస‌మ్మాయి సిరి పాత్ర‌లో హీరోయిన్ న‌భా న‌టేశ్ క‌నిపించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రెడీ అవుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న ప్రంపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ... సుధీర్ బాబు గారు హీరోగా సుధీర్ బాబు ప్రొడ‌క్ష‌న్స్ లో నిర్మిస్తున్న నన్నుదోచుకుందువ‌టే చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మేం ఎలాంటి బజ్ క్రియేట్ అవుతుందని ఆశించామో అంతకు మించిన క్రేజ్ వచ్చింది. మా టీం అందంరం చాలా హ్యాపీగా ఉన్నాం. ముఖ్యంగా హీరో, హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ కి అంద‌రూ క‌నెక్ట్ అయ్యారు. స‌మ్మెహ‌నం లాంటి మంచి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత సుధీర్‌బాబు గారి నుంచి వ‌స్తున్న చిత్రం కావ‌టంతో ప్రేక్ష‌కుల నుంచి అంచ‌నాలు భారీగా వున్నాయి. సుధీర్ బాబు గారి ఫస్ట్ ప్రొడక్షన్ లో నన్ను నమ్మి, నా కథను నమ్మి అవకాశం ఇచ్చారు. సమ్మోహనం సూపర్ హిట్ అయిన తర్వాత నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన సుధీర్ బాబు గారికి స్పెషల్ గా థాంక్స్ తెలియజేస్తున్నాను. సినిమా మీదున్న నమ్మకంతో ప్రమోషన్ ను కూడా భారీగా ప్లాన్ చేశాం. అందుకు తగ్గట్టే ప్రీ ప్రమోషనల్ టూర్ కి వెళ్లొచ్చాం. ప్రేక్షకులు భారీగా తరలివచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. నన్ను దోచుకుందువటే చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్ధమైంది. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని చెప్పగలను. అలాగే ఈ చిత్రం ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ ఎక్క‌డా త‌గ్గ‌కూడ‌దనే సంకల్పంతోనే సుధీర్‌బాబు గారు కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించారు. ఈ స్టోరీ చాలా ఫ్రెష్ గా వుంది. కొత్త హీరోయిన్ అయినప్పటికీ నభా నటేశ్ చాలా బాగా చేసింది. అజనీష్ సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. అని అన్నారు.


చిత్ర కథానాయకుడు, నిర్మాత సుధీర్ బాబు మాట్లాడుతూ... మా సొంత బ్యానర్ సుధీర్ బాబు ప్రొడక్షన్ లో నిర్మిస్తున్న నన్ను దోచుకుందువటే చిత్రాన్ని ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ట్రైలర్ కు చిత్ర పరిశ్రమ నుంచి.... ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రీ ప్రమోషనల్ టూర్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా థాంక్స్ చెబుతున్నాను. డైరెక్టర్ ఆర్.ఎస్.నాయుడు చాలా మంచి కథ స్క్రీన్ ప్లే తో సినిమా రూపొందించాడు. టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ తో చాలా హ్యాపీగా ఉన్నాం. సమ్మోహనం వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత వస్తున్న సినిమా కావడం.... నా సొంత బ్యానర్ లో నిర్మిస్తున్న మొదటి సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాల్ని తప్పకుండా రీచ్ అవుతామనే నమ్మకం ఉంది. అజనీష్ మ్యూజిక్, సురేష్ కెమెరా వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయి. హీరోయిన్ నభ నటేష్ చాలా బాగా నటించింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే విధంగా సినిమా వచ్చింది. సెప్టెంబర్ 21న మీ ముందుకు వస్తున్నాం.... అని అన్నారు.


నటీనటులు
సుధీర్ బాబు, నభా నటేశ్, నాజర్, తులసి, వేణు, రవి వర్మ, జీవా, వర్షిణి, సౌందర రాజన్, సుదర్శన్ తదితరులు
సాంకేతిక వర్గం
డిఓపి - సురేష్ రగుతు
మ్యూజిక్ డైరెక్టర్ - అజనీష్ బి లోకనాథ్
ఆర్ట్ డైరెక్టర్ - శ్రీకాంత్ రామిశెట్టి
ఎడిటర్ - ఛోటా కె ప్రసాద్
పిఆర్ఓ - ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎస్. సాయి వరుణ్
నిర్మాత - సుధీర్ బాబు
స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ - ఆర్ ఎస్. నాయుడు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !