View

ఇష్టపడి 'యు టర్న్' చేసాను - సమంత

Wednesday,September12th,2018, 02:52 PM

సమంత ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ' యూ టర్న్'. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 13 న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా మిస్టరీ థ్రిల్లర్ జోన్ గా రానుండగా పవన్ కుమార్ దర్శకుడు. కాగా ఈ రోజు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ గా జరగగా ఈ సమావేశానికి సినిమా నటీనటులతో పాటు నాగార్జున ముఖ్య అతిధిగా వచ్చారు.


హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ - ఈ సినిమాకంటే ముందే పవన్ కుమార్ గారి లూసియా చూసి ఆయనతో ఓ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. యూటర్న్ తో ఆ కోరిక తీరింది. సినిమా గురించి చెప్పాలంటే ఇప్పుడు వచ్చే వెరైటీ సినిమాల్లో ఈ సినిమా టాప్ అని చెప్పొచ్చు. వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. చిన్న పాయింట్ ని తీసుకుని చాలా బాగా కథ అల్లారు. ఇక హీరోయిన్ సమంత ఈ సినిమా కోసం ఎంత కష్టపడిందో నాకు తెలుసు. మొదలైనప్పట్నుంచి రేపు రిలీజ్ అయ్యేంతవరకు చాలా పని చేసింది. తన కోసం ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరందరికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది అన్నారు.


దర్శకుడు పవన్ మాట్లాడుతూ - ఈ సినిమా చేసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.. ఈ సినిమా తప్పక ఆడియన్స్ కి నచ్చుతుందని అనుకుంటున్నా. సమంత గారు ఈ సినిమా లో చాలా బాగా చేశారు. నాగార్జున గారు ఈ సినిమా చూసి ఎలా స్పందిస్తారనేది చూడాలని ఉంది అన్నారు.
నటుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ - విజయశాంతి, అనుష్క గారి తర్వాత ఈ జెనరేషన్ లో సూపర్ స్టార్ అంటే సమంత. ఆవిడలో చాలా టాలెంట్ దాగుంది. ఈ సినిమాతో మీరు కూడా ఒప్పుకుంటారు. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా వస్తే అది ఫ్లాప్ అయితే ఎందుకు ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటారు. కానీ ఈ సినిమా మీ అందరికి మంచి అనుభూతిని మిగిలిస్తుంది అన్నారు.


కింగ్ నాగార్జున మాట్లాడుతూ - క్రౌడ్ ఫండెడ్ మూవీ గా దర్శకుడు పవన్ తీసిన లూసియా మంచి హిట్ అయ్యింది.. ఇప్పుడు యూ టర్న్ తో మరో హిట్ కొట్టబోతున్నాడు. ట్రైలర్ చూసాను. చాలా బాగుంది. సమంత తో ఇదే మాట చెప్పాను. సామ్ స్టోరీ చెప్పేటప్పుడు ఎంతో థ్రిల్ గా ఫీల్ అయ్యాను. ఒక ఇన్సిడెంట్ తో మొదలయ్యి సినిమా మొత్తం ఫజిల్ లా మరిన్ని మలుపులు తిరిగింది. ఈ సినిమా ద్వారా వస్తున్న అందరికి గ్రాండ్ వెల్ కం. సినిమా ద్వారా అందరికి విజయం చేకూరాలని కోరుకుంటూ అందరికి అల్ ద బెస్ట్ అన్నారు.


సమంత మాట్లాడుతూ - నన్ను నమ్మి ఈ సినిమా ని ప్రొడ్యూస్ చేసిన నిర్మాతలకు చాలా థాంక్స్. చిన్న సినిమానే అయిన ఒక పెద్ద సినిమా లుక్ ని తీసుకు వచ్చారు. నిన్నటి వరకు ఈ సినిమా ప్రమోషన్స్ పనుల్లో ఉన్నాం సినిమా చాలా బాగా వచ్చిందనుకుంటున్నాను. మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది. ట్రైలర్స్ కి, సాంగ్ కి మీరిచ్చిన సపోర్ట్ చూస్తుంటే సినిమా కూడా హిట్ అనిపిస్తుంది. నన్ను సపోర్ట్ చేసినందుకు నా క్రూ కి చాలా థాంక్స్.. మేమంతా ఎంతో ఇష్టపడి చేసిన సినిమా .. రేపు స్క్రీన్ పైన అందరిని అలరిస్తుంది ఆశిస్తున్నా అన్నారు.


నటీనటులు : సమంత అక్కినేని, ఆది పినిశెట్టి, భూమిక చావ్లా, రాహుల్ రవీంద్రన్ , నరేేన్ తదితరులు.
సాంకేతిక నిపుణులు :
దర్శకత్వం : పవన్ కుమార్
నిర్మాతలు : శ్రీనివాస్ చిట్టూరి , రాంబాబు బండారు
సంగీత దర్శకుడు : పూర్ణ చంద్ర తేజస్వీ
డిఓపి : నికేత్ బొమ్మిరెడ్డి
బ్యానర్ : శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, వి. వై. కంబైన్స్
ఎడిటర్ : సురేష్ ఆరుముగం
నిర్మాత : శ్రీనివాస్ చిట్టూరి
P.R.O : వంశీ - శేఖర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !