View

యూ టర్న్ సక్సెస్ మీట్ విశేషాలు

Tuesday,September18th,2018, 11:55 AM

సమంత ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ' యూ టర్న్'.. మిస్టరీ థ్రిల్లర్ జోనర్ గా గ‌త వారం విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా న‌టించ‌గా.. భూమిక చావ్లా, రాహుల్ రవీంద్రన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, వి. వై. కంబైన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి , రాంబాబు బండారు ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబ‌ర్ 18న‌ హైదరాబాద్ లోని ద‌స్ప‌ల్లా హోట‌ల్లో ఈ చిత్ర‌ విజయోత్సవ వేడుక ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమానికి ఎంపీ కవిత, డైరెక్టర్ నందిని రెడ్డిలు ముఖ్య అతిధులుగా వచ్చారు.


ఈ సందర్భంగా నటుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. కమర్షియల్ సినిమాలు మాత్రమే ప్రేక్షకులు చూస్తున్నారన్న అపోహ ఇప్పుడు లేదు.. మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమా , పెద్ద సినిమా ఏదైనా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ప్రొడ్యూసర్స్ గారికి మంచి టేస్ట్ ఉంది.. ఇంత మంచి సినిమా మొదటి సినిమాగా తీయడం వారికే చెల్లింది.. సినిమాని ఇంత విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు చాలా థాంక్స్ అన్నారు.


డైరెక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ.. సినిమా విజయం సాధించినందుకు చాల హ్యాపీగా ఉంది.. తెలుగు, తమిళ్లో వచ్చిన ఈ సినిమా రెండు భాషల్లోనూ మంచి హిట్ అయ్యింది.. ప్రేక్షకులకు ధ‌న్య‌వాదాలు.. సమంత సినిమాలో చాలా బాగా న‌టించారు.. మ్యూజిక్ కి మంచి మార్కులు పడ్డాయి.. అన్నారు.


ఎంపీ కవిత మాట్లాడుతూ.. ఈ సినిమా కి పనిచేసిన అందరికి మంచి విజయం దక్కింది.. వండర్ ఫుల్ సినిమా ఇది.. చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాలా బాగా ఉంది అంటున్నారు.. సమంత ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా కనిపించింది.. రంగస్థలంలో , యూ టర్న్ లో చాలా వేరియేషన్స్ చూపించింది.. సమంత సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి.. డిఫరెంట్ స్టోరీస్ ఉన్న సినిమాలను ప్రతి ఒక్కరు ఆదరిస్తారు అనడానికి ఈ సినిమానే ఉదాహరణ.. చాలా మంచి సినిమా.. ఇలాంటి సినిమాని అందరు ఆదరించాలి.. అన్నారు.


డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడుతూ.. కొంతమంది డైరెక్టర్ ల సినిమా లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటాను అలాంటి డైరెక్టర్ లలో పవన్ కుమార్ గారు ఒకరు.. అయన మేకింగ్ చాల డిఫరెంట్ గా ఉంటుంది.. అయన లూసియా సినిమా చూసాను .. చాలా బాగుంది.. అప్పటినుంచి అయన సినిమాలు చూడడం మొదలుపెట్టాను.. అయన తెలుగులోకి కూడా రావడం చాల ఆనందంగా ఉంది.. ఈ సినిమా లో పనిచేసిన అందరికి కంగ్రాట్స్. సమంత చాల కష్టపడే వ్యక్తి.. ఆమెకు ఈ విజయం దక్కాలి.. మంచి సినిమా వస్తే ప్రతి ఒక్కరు ఆదరిస్తారు.. అన్నారు.


సమంత మాట్లాడుతూ.. సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు అందరికి థాంక్స్..మా సినిమాని సపోర్ట్ చేసినందుకు మీడియాకి, రివ్యూయర్స్ కి చాలా చాలా కృతజ్ఞతలు.. నేను చేసిన సినిమాల్లో ఇంత పాజిటివ్ రివ్యూస్ రావడం , నా యాక్టింగ్ కి రావడం చాలా ఆనందంగా ఉంది.. ఇక్కడికి వచ్చిన కవిత గారికి, డైరెక్టర్ నందికి గారికి చాల థాంక్స్.. ఇంత మంచి సినిమా తీసిన ప్రొడ్యూసర్స్ కి కృతజ్ఞతలు.. వాళ్ళ ఫస్ట్ సినిమా గా ఇది చేసినందుకు గర్వంగా ఉంది.. నా కెరీర్ లో మంచి సినిమా ఇచ్చిన డైరెక్టర్ పవన్ కి చాలా థాంక్స్.. ఈ సినిమా తో మూడు స్టేట్స్ లో సక్సెస్ కొట్టాడు.. ఇది మొదలు మాత్రమే.. ఆయనలో ఇంకా చాలా టాలెంట్ ఉంది.. ఈ చిత్రంలో నటించిన అందరికి శుభాకాంక్షలు.. సినిమా చూసిన ప్రేక్షకులు తప్పకుండా థ్రిల్ కు గురవుతున్నారు.. సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు.. అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !