View

బేవర్స్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్టోబర్ 12న విడుదల

Monday,September24th,2018, 04:15 PM

"ఆన‌లుగురు", "మీ శ్రేయాభిలాషి" లాంటి గ‌ర్వించ‌ద‌గ్గ ఎన్నో చిత్రాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్ని సొంతం చేసుకున్న న‌ట‌కిరీటి డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు ముఖ్య‌పాత్ర‌లో న‌టించిన చిత్రం బేవ‌ర్స్‌. సంజోష్‌, హ‌ర్షిత హీరో హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. కాసం స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్.ఎస్.కె ఎంటర్ టైన్ మెంట్స్ ప‌తాకం పై నిర్మాత‌లు పొన్నాల‌ చందు, డా.ఎం.ఎస్.మూర్తి, ఎమ్ అర‌వింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ర‌మేష్ చెప్పాల ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. సునీల్ కశ్య‌ప్ సంగీతాన్ని అందించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని అక్టోబ‌ర్ 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు. ఈసందర్భంగా...


నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... మొద‌ట్లో ఈ చిత్రానికి బేవ‌ర్స్ అనే టైటిల్ ఏంటి అనుకున్నాను. ఇదే డౌటు ఆడియెన్స్ కి కూడా వ‌స్తుంది. కానీ ఆ టైటిల్ ఎందుకు పెట్టారనేది ఈ చిత్రం చూస్తే అర్ద‌మ‌వుతుంది. తల్లిదండ్రులను అర్థం చేసుకోని పిల్లలు మాత్రమే బేవర్స్ కాదు... పిల్లల్ని అర్థం చేసుకోని తల్లిదండ్రులు కూడా బేవర్స్ అవుతారనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందించారు. డైరెక్టర్ రమేష్ డైలాగ్స్ అద్భుతంగా రాశాడు. సామాజిక స్పృహ ఉన్న చిత్రం. నా కెరీర్లో మరో సూపర్ హిట్ సినిమా చేశాను అనే తృప్తి వుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. ప్ర‌ముఖ ర‌చ‌యిత సుద్దాల అశోక్ త‌న మ‌న‌సు, ప్రాణం పెట్టి రాసిన‌.. త‌ల్లి త‌ల్లి నా చిట్టి త‌ల్లి నా ప్రాణాలే పోయాయ‌మ్మా.. నీవే లేని లోకాన నేను శవ‌మ‌ల్లే మిగిలానమ్మా.. నాఇంట నువ్వుంటే మాయ‌మ్మే వుందంటూ మురిసానమ్మా..ఏ జ‌న్మ‌లో పాప‌మో నేను చేశానో ఈ శిక్ష‌వేశావమ్మా.. పోద్దున్నే పోద్ద‌ల్లే నువు నాకు ఎదురోస్తే అదృష్టం నాద‌నుకున్నా.. సాయంత్రం వేళల్లో నా బ్ర‌తుకు నీడ‌ల్లొ నా దీపం నీవనుకున్నా.. లోకంలొ నేనింకా ఏకాకినైన‌ట్టు శూన్యంలో వున్నాన‌మ్మా..చిరుగాలిలో ఊగే ఏ చిగురు కొమ్మైనా నీలాగే తోచేన‌మ్మా.. అంటూ సాగే అద్బుతమైన సాంగ్ చాలా మంచి హిట్ గా నిలిచింది. హీరో, హీరోయిన్ చాలా బాగా చేశారు. ఈ సినిమా నా కెరీర్ లో మరో మంచి చిత్రం గా నిలుస్తుంది. అక్టోబ‌ర్ 12న విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. అని అన్నారు.


డైరెక్టర్ రమేష్ చెప్పాలా మాట్లాడుతూ... మీ శ్రేయోభిలాషి చిత్రానికి రచయిత గా ఎంత గా తృప్తి చెందానో బేవర్స్ చిత్రాన్ని రూపొందిస్తున్నప్పుడు కూడా అంతకంటే ఎక్కువ సంతృప్తి చెందాను. రాజేంద్రప్రసాద్ గారు ఈ పాత్ర ఇప్పటివరకు చేయకపోవడం నా అదృష్టం. ఈ చిత్రం త‌ప్ప‌కుండా అంద‌రికి న‌చ్చుతుంది. అక్టోబ‌ర్ 12న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువస్తున్నాం. అలానే ఆస్ట్రేలియా ప్ర‌భుత్వంచే జీవిత సాఫ‌ల్య పుర‌స్కారం అందుకున్న మొట్ట‌మొద‌టి భార‌తీయ న‌టుడుగా మా రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు చరిత్ర‌కెక్క‌డం చాలా ఆనందాన్నిచింద‌ని అన్నారు.


నిర్మాత‌లు పొన్నాల చందు, Dr.M.s.murthy, ఎమ్‌. అర‌వింద్ లు మాట్లాడుతూ.. డా. రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు న‌టించిన అనేక చిత్రాల్లో తెలుగు ప్రేక్ష‌కులు మ‌ర్చిపోలేని కొన్ని చిత్రాల్లో మీ శ్రేయాభిలాషి ఓక‌టి. అలాంటి చిత్రానికి రైట‌ర్ గా ప‌నిచేసిన ర‌మేష్ చెప్పాలా ద‌ర్శ‌కుడిగా రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం బేవ‌ర్స్‌. మా బ్యాన‌ర్ SSK ENTERTAINMENTS పై ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించాము. విడుద‌ల చేసిన సాంగ్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రంలో సంజోష్‌, హ‌ర్షిత లు హీరోహీరోయిన్స్ గా చాలా బాగా నటించారు. అక్టోబ‌ర్ 12న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాము. అయితే ఆస్ట్రేలియ ప్ర‌భుత్వం నుంచి జీవిత‌సాఫ‌ల్య పుర‌స్కారం అందుకుని రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు రిలీజ్ కి ముందే మా చిత్ర బృందంలో ఫుల్ జోష్ నింపారు.ఇలాంటి అరుదైన అవార్డులు ఆయ‌న‌కు మ‌రిన్ని రావాలి అని అన్నారు.


హీరో సంజోష్‌ మాట్లాడుతూ.... నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారితో పని చేయడం నా అదృష్టం. తండ్రి కొడుకు కలిసి ఈ సినిమా చూడాలి. చాలా మంచి చిత్రం చేశాము త‌ప్ప‌కుండా అంద‌రికి న‌చ్చే చిత్రంగా అంద‌రి ప్ర‌శంశ‌లు పొందుతాము. రాజేంద్ర‌ప్ర‌సాద్ గారికి ఇలాంటి అరుదైన పుర‌స్కారం ల‌భించ‌డం నాకు చాలా ఆనందాన్నిచ్చింది అని అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !