View

సవ్యసాచి పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్న సుకుమార్

Wednesday,October24th,2018, 01:31 PM

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై చందు మొండేటి దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ సి వి ఎం సంయుక్తంగా నిర్మిస్తోన్న డిఫరెంట్ కథా చిత్రం సవ్యసాచి. వెర్సటైల్ యాక్టర్ మాధవన్, భూమిక, ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి స్వరవాణి ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ట్రైలర్ ని బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువసామ్రాట్ నాగచైతన్య, చిత్ర దర్శకుడు చందు మొండేటి, ఎం.ఎం.కీరవాణి, కెమెరామెన్ యువరాజు, నిర్మాతలు నవీన్, రవిశంకర్, మోహన్ పాల్గొన్నారు.


బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ"- ఇప్పటివరకు ఇండియన్ స్స్క్రీన్ పైన ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు. ఏ దర్శకుడుకైనా ఇలాంటి సబ్జెక్ట్ తో చేయాలని ఉంటుంది. చాలా విచిత్రమైన సబ్జెక్ట్ ఇది. నేను ఇలాంటి సబ్జెక్ట్ తో చేయనందుకు జెలసీగా ఫీలవుతున్నాను. కార్తికేయ సినిమాకి పెద్ద అభిమానిని. చందు ఈ సినిమాని చాలా బాగా తీసాడు. కీరవాణి గారి గురించి నా మిత్రుడు దేవిశ్రీప్రసాద్ ప్రసాద్ చాలా గొప్పగా చెపుతుంటాడు. ఆయన మ్యూజిక్ జీనియస్. టీజర్, ట్రైలర్ లో రీ- రికార్డింగ్ అద్భుతంగా చేశారు. సాంగ్స్ కి మ్యూజిక్ బ్యూటిఫుల్ గా చేశారు. నవీన్, రవిశంకర్, మోహన్ ముగ్గురు నిర్మాతలు కూడా ఎలాంటి డెసిషన్ అయినా చాలా ఫాస్ట్ గా తీసుకుంటారు. నవీన్ గారు మేనేజ్మెంట్, జడ్జిమెంట్, మోహన్ కోఆర్దినేషన్, రవిశంకర్ ప్లానింగ్ చక్కగా చేస్తారు. అందుకే వరసగా విజయవంతమైన సినిమాలు తీస్తున్నారు. కెమెరామెన్ యువరాజ్ విజువల్స్ పెంటాస్టిక్ గా చేసాడు. 100పర్సెంట్ లవ్ తర్వాత చైతూ నేను రెగ్యులర్ గా కలిసేవాళ్ళం. సమంత వచ్చాక ఈ మధ్య కలవడం లేదు. ట్రైలర్ లో చాలా అందంగా , క్యూట్ గా కనిపిస్తున్నాడు చైతూ. పెర్ఫార్మెన్స్ అద్భుతంగా చేసాడు. డిఫరెంట్ ఎక్సపీరియెన్స్ ఈ సినిమా. క్లయిమాక్స్ ఎవరూ ఊహించని రీతిలో ఉంటుంది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.


స్వరవాణి యమ్. యమ్. కీరవాణి మాట్లాడుతూ"- నవీన్, రవి, మోహన్ ముగ్గురు నిర్మాతలు కూడా అందర్నీ ఫ్రెండ్లీగా కలుపుకుంటూ, గౌరవిస్తూ, వారికి కావాల్సింది రాబట్టుకుంటారు. అందుకే సక్సెస్ పుల్ గా సినిమాలు తీసుకుంటూ వెళుతున్నారు. వారికి నా కంగ్రాట్స్. చందుతో ఈ జెర్నీ ఫ్రెండ్లీగా సాగింది. గతంలో మల్టీస్టారర్ ఫిలిమ్స్ చాలా వచ్చాయి. వస్తున్నాయి. వాటిలో ఇద్దరి హీరోలకి సమానంగా రెండు ఫైట్స్, రెండు పాటలు ఉండేలా బ్యాలెన్స్ చేస్తూ నిర్మాతలు సినిమా చేస్తారు. అవన్నీ పక్కన బెట్టి చైతన్య ఇది మల్టీస్టారర్ ఫిల్మ్ అయినా కూడా కథకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ సినిమా చేసాడు. యువరాజ్ చైతన్యని, హీరోయిన్ నిధి అగర్వాల్ ని బ్యూటిఫుల్ గా, కలర్ ఫుల్ గా చూపించాడు. ఈ నెల 27న ఫ్రీ రిలీజ్ లో అంతా కలుస్తాం అన్నారు.


యువసామ్రాట్ నాగ చైతన్య మాట్లాడుతూ"- నా కెరీర్ బిగినింగ్ లో హండ్రెడ్ పెర్సెంట్ లవ్ లాంటి బిగ్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన సుకుమార్ గారు సవ్యసాచి ట్రైలర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందరికీ ఇన్స్పిరేషన్ ఆయన. నార్వే లో షూటింగ్ లో ఉండగా చందు ఈ లైన్ చెప్పాడు. నాకు బాగా నచ్చింది. అప్పుడే ఈ సినిమా చెయ్యాలనిపించింది. వెంటనే అడిగితే బాగోదు అని అడగలేకపోయాను. ఒక ఇంపాజిబుల్ మిషన్ ని పాజిబుల్ చేసాడు చందు. ప్రేమమ్ కి నేను సూట్ అవుతానా లేదా అని అందరూ అనుకున్నారు. చందు కన్విక్షన్ అయి అందర్నీ కన్విన్స్ చేసి ప్రేమమ్ చేసాడు. అది బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ప్రేమమ్ రిలీజ్ అయ్యాక వెంటనే చందు వచ్చి అప్పుడు నార్వేలో చెప్పిన స్టోరీ చేద్దామా అని అడిగాడు. చాలా హాపీగా ఫీలయ్యాను. ఈ ప్రాజెక్ట్ కి బిగ్గెస్ట్ టెక్నీషియన్స్ యాడ్ అయ్యాక స్కేల్ అంతా మారిపోయింది. సవ్యసాచి కంటెంట్ ని నమ్మి మైత్రి వాళ్ళు ఈ సినిమా చేశారు. ప్రతి సంవత్సరం మైత్రీలో ఒక సినిమా చేయాలని ఉంది. అంత బాగా ప్రొడక్షన్ చేశారు. కీరవాణి గారు మ్యూజిక్ పరంగానే కాకుండా స్క్రిప్టులో ఇన్వాల్వ్ అయి ఇన్ పుట్స్ లో కూడా చాలా హెల్ప్ చేశారు. ఆయనికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నెల 27న ప్రి- రిలీజ్ జరిపి నవంబర్2న ప్రపంచవ్యాప్తంగా సినిమాని రిలీజ్ చేస్తున్నాము. అందరి సపోర్ట్ కావాలి అన్నారు.


నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని మాట్లాడుతూ "- సవ్యసాచి చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకని అక్టోబర్ 27న అభిమానుల సమక్షంలో నార్సింగ్ కన్విక్షన్ సెంటర్ లో గ్రాండ్ గా జరపనున్నాం. నవంబర్ 2న వరల్డ్ వైడ్ గా సినిమాని భారీగా రిలీజ్ చేస్తాం అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !