View

9మంది ఫిల్మ్ మేకర్స్ చేతుల మీదుగా లాంచ్ అయిన ‘హవా’ ట్రైలర్

Saturday,November03rd,2018, 12:07 PM

తెలుగులో ఇప్పటి వరకూ ఎన్నో కథలు చూశాం. చూస్తున్నాం. కానీ ప్రస్తుతం జానర్ బేస్డ్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటోంది. ఏ జానర్ లో వస్తోన్న సినిమా అయినా హానెస్ట్ గా రాసుకుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలా తెలుగులో వస్తోన్న మరో జానర్ బేస్డ్ ఫిల్మ్ ‘హవా’. రీసెంట్ గా రానా చేతుల మీదుగా విడుదల చేసిన మోషన్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.


అలాగే ‘హవా’ కాన్సెప్ట్ పోస్టర్ ను సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల విడుదల చేశారు. సస్సెన్స్, క్రైమ్, కామెడీ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ మూవీకి ‘9 గంటలకు 9 నేరాలు 9 బ్రెయిన్స్’ అంటూ పెట్టిన క్యాప్షన్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరి ఆ తొమ్మిదిమంది ఎవరు.. ఏం నేరాలు చేశారు.. అదీ తొమ్మిదిగంటల్లోనే.. తద్వారా వాళ్ల లైఫ్ లో జరిగిన మార్పులేంటీ అనేది థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లేతో సాగే కథ. ఈ మూవీ ట్రైలర్ ను 9 మంది సినిమా ప్రముఖుల సమక్షంలో విడుదల చేశారు. ఈ నెల 23న విడుదల కానున్న ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చేలా ఉందని ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమానికి హాజరైన అతిథులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ...


నందిని రెడ్డి - దర్శకురాలు
న్యూ టాలెంట్ అంతా కొత్త ఐడియాస్, కథలతో వస్తోంది. వీళ్ల వల్ల మేం కాస్త జాగ్రత్తగా సినిమాలు చేయాల్సి వస్తోంది. మధుర శ్రీధర్ గారు ఎప్పుడూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తారు. నాకు క్రైమ్ కామెడీస్ అంటే చాలా ఇష్టం. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.


బివిఎస్ రవి - రచయిత, దర్శకుడు
హాలీవుడ్ డైరెక్టర్ గై రుషీ అంటే నాకు చాలా ఇష్టం. ఈ మూవీ చూస్తుంటే నాకు ఆయన సినిమాలు గుర్తొస్తున్నాయి. సినిమాటోగ్రఫీ కానీ.. ఆర్టిస్టులు కానీ.. అద్భుతంగా వర్క్ చేసినట్టు అర్థమౌతోంది. రెండేళ్లుగా తెలుగులో జానర్ లాయల్ సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఇది కూడా జానర్ లాయల్ సినిమాలా కనిపిస్తోంది. అందుకే ట్రెండ్ ను బట్టి ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.


మధుర శ్రీధర్ - నిర్మాత, దర్శకుడు
మహేష్ రాజు కలిశారు. సినిమా కోసం అడిగారు. నేను సినిమా చూశాను. చాలా బావుంది. యాక్షన్ పార్ట్ తో పాటు మంచి కామెడీ ఉంది. ఆర్టిస్ట్ లంతా బాగా చేశారు. ఇలాంటి సినిమాకు హెల్ప్ చేస్తే. ఇంకా మంచి సినిమా అవుతుందనుకున్నారు. ఆల్రెడీ హిందీలో మంచి రేట్ కు శాటిలైట్ అమ్మేశారు. ఇది మంచి బిగినెంగ్ టుదిస్ మూవీ. నవంబర్ 23న విడుదల చేస్తున్నారు. పెద్ద సినిమాల మధ్య విడుదలవుతోంది. అయినా మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. రోబోకు ముందు వస్తోంది. అయినా ఓ మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇలాంటి సందర్భాల్లో ఆకట్టుకుంటుందనేదానికి ఇది ఓ కేస్ స్టడీ లాంటి సినిమా అవుతుందనుకుంటున్నాను.. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అందరికీ మంచి ఫ్యూచర్ ఉంది.


వేణు ఊడుగుల - దర్శకుడు
సినిమా గురించి ఏం తెలియకుండానే వచ్చాను. బట్ ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై రెస్పెక్ట్ పెరిగింది. మంచి కమిట్మెంట్ తో తీసిన సినిమా ఇది. హానెస్ట్ గా డీల్ చేసిన క్రైమ్ డ్రామా అని అర్థమౌతోంది. కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తున్నారు. అందులోనే ఇది కూడా మంచి సినిమాగా నిలవాలని కూడా కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ బెస్ట్ విషెస్. సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.


రాజ్ కందుకూరి - నిర్మాత
హవా టీమ్ కు ఆల్ ది బెస్ట్. మనసుపెట్టి కథ రాసుకుంటే చిన్న ఎటెంప్ట్ కూడా సక్సస్ అవుతుంది. మంచి సోల్ ఉంటే ఏ సినిమా అయినా ఆడుతుంది. కానీ ఇందులో తొమ్మిది సోల్స్ ఉన్నట్టు తెలుస్తోంది. టీమ్ మంచి ఎఫర్ట్ పెట్టినట్టు తెలుస్తోంది. సినిమా కూడా చాలా రిచ్ గా కనిపిస్తోంది. ఇందులో మంచి కటెంట్ ఉన్నట్టు ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. మధుర శ్రీధర్ ఓ సినిమాను మెచ్చుకున్నారంటే ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఆర్టిస్టులంతా బావున్నారు. దర్శకుడు మహేష్ వంటి వారి కోసం టాలీవుడ్ ఎదురుచూస్తోంది. ఎంటైర్ టీమ్ కు ఆల్ ది బెస్ట్.


జానీ - డ్యాన్స్ మాస్టర్
ట్రైలర్ చూస్తే చాలా రిచ్ గా ఉంది. డివోపీ వర్క్ కు నేను అడ్మైర్ అయ్యాను. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి కొత్తవాళ్లు తెస్తోన్న కొత్త కాన్సెప్ట్స్ నాకు బాగా నచ్చుతున్నాయి. ఈ మూవీ వెనక నైన్ థాట్స్, నైన్ బ్రెయిన్స్ ఉన్నాయంటున్నారు.. సినిమా కూడా నైన్ వీక్స్ ఆడాలని కోరుకుంటున్నాను.


మహేష్ రెడ్డి - ‘హవా’ దర్శకుడు
వచ్చిన అతిథులందరికీ థ్యాంక్యూ. సినిమా గురించి నేను ఇప్పుడే ఏమీ చెప్పను. మీరు ట్రైలర్ చూశారు. 23న సినిమా విడుదల కాబోతోంది. అప్పుడే సినిమా ఎలా ఉంటుందనేది మీకే తెలుస్తుంది. మమ్మల్ని మా సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను.


ఈ సందర్భంగా ఈ చిత్ర హీరో చైతన్య మదాడి, హీరోయిన్ దివి ప్రసన్నతో పాటు సంగీత దర్శకుడు గిఫ్టన్ ఎలియాస్ మాట్లాడుతూ.. ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చేసిన అతిథులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ.. తమ చిత్రం ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.


ఇక ఈ నెల 23న విడుదల కాబోతోన్న ‘హవా’ చిత్రంలో చైతన్య మాదాడి, దివి ప్రసన్న జంటగా నటిస్తుండగా.. స్టీఫెన్ మర్ఫీ, ఫోబ్ జాకోబర్, సందీప్ పగడాల, కమల్ కృష్ణ, జో జోసెఫ్, అంజా మేయెర్, ఆల్వోన్ జూనియర్, విలియమ్ ట్రాన్, శ్రీజిత్ గంగాధరన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.


టెక్నికల్ గానూ హై స్టాండర్డ్స్ లో ఉండబోతోన్న ఈ చిత్రానికి ఎడిటర్ : కార్తిక శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ : సంతోష్ షానమోని, సంగీతం : గిఫ్టన్ ఎలియాస్, పిఆర్వో : జి.ఎస్.కే మీడియా, నిర్మాణం : ఫిల్మ్ అండ్ రీల్ , దర్శకత్వం : మహేష్ రెడ్డి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Read More !