View

ప్రపంచ వ్యాప్తంగా ఈ 29న భారీ చిత్రం '2.0' విడుదల

Sunday,November18th,2018, 08:44 AM

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం 2.0. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే తొలిసారి 600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని విజువ‌ల్ వండ‌ర్‌గా తీర్చిదిద్ద‌డానికి 2150 వి.ఎఫ్‌.ఎక్స్ షాట్స్ ఉప‌యోగించారు. 3000 మంది వి.ఎఫ్‌.ఎక్స్ టెక్నీషియ‌న్స్.. 1000 టిపిక‌ల్ వి.ఎఫ్‌.ఎక్స్ షాట్ మేక‌ర్స్ ఈ సినిమా కోసం ప‌నిచేశారు. ఆదివారం ఈ సినిమా మేకింగ్ వీడియోస్‌, పాట‌, ట్రైల‌ర్‌ను హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. పూర్తిస్థాయి త్రీ డీ టెక్నాల‌జీతో.. 4డీ సౌండింగ్‌తో తెర‌కెక్కిన తొలి ఇండియ‌న్ సినిమా 2.0. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను ఎన్‌.వి.ఆర్‌. సినిమా పతాకంపై ప్రముఖ నిర్మాత ఎన్‌.వి.ప్రసాద్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. 2.0 పాట‌లు, ట్రైల‌ర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వ‌స్తుంది. సోష‌ల్ మీడియాలో 2.0 ట్రైల‌ర్‌, పాట‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ సంద‌ర్భంగా...


సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ మాట్లాడుతూ - విజువ‌ల్ వండ‌ర్‌గా రూపొందిన 2.0 చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా న‌వంబ‌ర్ 29న విడుద‌ల కానుంది. ఈ డైరెక్ట‌ర్ శంక‌ర్‌గారు సినిమాను అద్భుత‌మైన మెసేజ్‌తో ప్ర‌తి స‌న్నివేశాన్ని ఎంతో అద్భుతంగా మ‌లిచారు. ఈ సినిమాతో ఇండియ‌న్ సినిమా ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయికి చేరుతుంది. ఈ సినిమా ఇంత గొప్ప‌గా వ‌చ్చిందంటే అందుకు ముఖ్య కార‌ణం శంక‌ర్ అయితే.. ఆయ‌న కంటే ముందు అభినందిచాల్సి వ్య‌క్తి నిర్మాత సుభాష్ క‌ర‌ణ్‌. ఆయ‌న‌కు సినిమాపై ఉన్న ప్యాష‌న్ కార‌ణంగానే ఈ సినిమాను ఇంత గొప్ప‌గా చేయ‌గ‌లిగాం. ఎంతో మంది టెక్నీషియ‌న్స్ రాత్రింబ‌గ‌ళ్లు ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. సినిమా కోసం నేను కూడా అంద‌రితో పాటు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నానుఅన్నారు.


గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ మాట్లాడుతూ - సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ గారితో నేను చేస్తున్న మూడో సినిమా `2.0`. పూర్తి స్థాయి యాక్షన్‌ థ్రిల్లింగ్‌ ఎంటర్టైన్‌మెంట్‌. సినిమా అనేదాన్ని కూడా దాటి... త్రీడీ టేకింగ్‌, 4డీ సౌండింగ్ అనే కొత్త అనుభవాన్ని ప్రేక్ష‌కులు ఫీల్ అవుతారు. రెహ‌మాన్‌గారు, రసూల్ పూకుట్టి కొత్త సౌండింగ్ టెక్నాల‌జీని ఈ చిత్రంతో ప‌రిచ‌యం చేస్తున్నారు. ఇలాంటి గొప్ప సినిమాను మ‌నం చేయ‌గలం అని నిరూపించాం. నిర్మాత‌ సుభాష్ క‌ర‌ణ్ సుభాష్ క‌ర‌ణ్ లేకపోతే ఈ సినిమా లేదు. ఇండియన్‌ సినిమాను ఇంత బడ్జెట్‌ తో ఎవరూ నిర్మించరు. ఆయ‌న అందించిన ప్రోత్సాహంతో పాటు సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ అందించిన తోడ్పాటుతో గొప్ప అనుభూతిని ఈ నెల 29న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నాం అన్నారు.


ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ మాట్లాడుతూ - 2.0కి సంగీతం చేయ‌డం చాలా గొప్ప అనుభం. ఎనిమిది సినిమాల‌కు ప‌నిచేసినంత అనుభం వ‌చ్చింది. 4డీ అనే సౌండింగ్ టెక్నాల‌జీని ప‌రిచ‌యం చేస్తున్నాం. రీరికార్డింగ్ కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది టెక్నీషియ‌న్స్ అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డ్డారు. స‌రికొత్త అనుభ‌వాన్ని ప్రేక్ష‌కులు ఈ న‌వంబ‌ర్ 29న ఫీల్ అవుతారు అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !