View

ఊరంతా అనుకుంటున్నారు ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ లాంచ్‌ విశేషాలు

Wednesday,January16th,2019, 02:48 PM

రోవాస్కైర్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం `ఊరంతా అనుకుంటున్నారు`. న‌వీన్ విజ‌య్‌కృష్ణ‌, శ్రీనివాస్ అవ‌స‌రాల హీరోలు. మేఘా చౌద‌రి, సోఫియా సింగ్ నాయిక‌లు. బాలాజి సాన‌ల ద‌ర్శ‌కుడు. శ్రీహ‌రి మంగ‌ళంప‌ల్లి, ర‌మ్య గోగుల‌, పి.ఎల్‌.ఎన్‌.రెడ్డి, ఎ.ప‌ద్మ‌నాభ‌రెడ్డి నిర్మాత‌లు. ఈ సినిమా టైటిల్ లోగోను సూప‌ర్ స్టార్ కృష్ణ‌, ఫ‌స్ట్ లుక్‌ను విజ‌య‌నిర్మ‌ల‌, హీరో ఫ‌స్ట్ లుక్‌ను న‌రేష్‌, న‌వీన్ లుక్ టీజ‌ర్‌ను కృష్ణ‌, విజ‌య‌నిర్మ‌ల విడుద‌ల చేశారు. హీరో న‌వీన్ విజ‌య్‌కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్ర యూనిట్ కేక్ క‌ట్ చేసిన సెల‌బ్రేట్ చేశారు.


కృష్ణ మాట్లాడుతూ - టైటిల్ బావుంటే సగం సినిమా స‌క్సెస్ అయిన‌ట్టే. అందులోనూ ఈ సినిమాకు 'ఊరంతా అనుకుంటున్నారు' అనే నేటివ్ టైటిల్ దొరికింది. ఇంగ్లిష్ ప‌దాల‌తో ఎక్కువ టైటిల్స్ వ‌స్తున్న ఈ సమ‌యంలో ఇలాంటి టైటిల్ రావ‌డం బావుంది. చిన్న‌ప్ప‌టి నుంచి సినిమా అట్మాస్పియ‌ర్‌లో పెరిగాడు మా న‌వీన్‌. త‌న‌లో ఈజ్ ఉంది. పాట‌లు, ఫైట్లు అన్నీ బాగా చేయ‌గలుగుతున్నాడు. ఆర్టిస్ట్ గా మంచి ఫ్యూచ‌ర్ ఉంటుంది. మా న‌రేష్ జ‌డ్జిమెంట్ బావుంటుంది. న‌రేష్ క‌థ విన్నాన‌ని.. బావుంద‌ని చెబుతున్నాడంటే సినిమాలో విష‌యం ఉన్న‌ట్టే. న‌వీన్‌కి ఈ సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ రావాలి అని అన్నారు.


విజ‌య‌నిర్మ‌ల మాట్లాడుతూ - నిర్మాత‌ను , ఈ సినిమాను అంద‌రూ దీవించాలి అని అన్నారు.


కె.ఎం.రాధాకృష్ణ‌న్ మాట్లాడుతూ - న‌వీన్ పాత్ర చాలా బావుంటుంది. క‌థాబ‌లం ఉన్న సినిమా. గ్రామీణ నేప‌థ్యంతో సాగుతుంది అని చెప్పారు.


న‌వీన్ మాట్లాడుతూ - పాల‌కొల్లులో ఈ సినిమా కోసం షూటింగ్ చేశాం. నేను ఇంత‌కు ముందు ఎప్పుడూ పాల‌కొల్లుకు వెళ్ల‌లేదు. ఈ సినిమాతో అక్క‌డే సెటిల్ కావాల‌నిపించింది. చాలా మంచి సినిమా అవుతుంది అని అన్నారు.


న‌రేష్ మాట్లాడుతూ - నందిని న‌ర్సింగ్ హోమ్‌తో న‌వీన్ మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. హీరోగా, ఆర్టిస్ట్ గా నిల‌దొక్కుకోవాల‌నేది అత‌ని తాప‌త్ర‌యం. ఆ సినిమా త‌ర్వాత 5,6 స్క్రిప్ట్ లు విన్నాడు. వాటిలో ఈ క‌థ మాకు బాగా న‌చ్చింది. నేను బావున్నాయ‌న్న సినిమాలు 99 శాతం ఫెయిల్ కాలేదు. ఇది మంచి ఎంట‌ర్‌టైన‌ర్ అవుతుంది. టైటిల్ బావుంది. మిగిలిన తారాగ‌ణం కూడా చాలా బావుంది. నేను ప్రివ్యూ చూశాను. నిర్మాత‌లకు టేస్ట్ ఉంద‌నిపించింది. డ‌బ్బింగ్ జ‌రుగుతోంది అని చెప్పారు.


నిర్మాత మాట్లాడుతూ - గ్రామీణనేప‌థ్యంలో అందంగా సాగే సినిమా ఇది. క్యూట్ విలేజ్ బోయ్‌గా న‌వీన్ మెప్పిస్తాడు. కొత్త జోన‌ర్ సినిమా అవుతుంది. న‌వీన్‌లోని ప‌లు షేడ్స్ ఈ సినిమాలో ఆవిష్కృత‌మ‌వుతాయి అని అన్నారు.


జ‌య‌సుధ‌, కోట శ్రీనివాస‌రావు, రావు ర‌మేష్‌, అన్న‌పూర్ణ‌మ్మ‌, రాజా ర‌వీంద్ర‌, అశోక్ కుమార్‌, ప్ర‌భావ‌తి, జ‌బ‌ర్ద‌స్త్ రాము, జ‌బ‌ర్ద‌స్త్ బాబి, గౌత‌మ్‌రాజు, అప్పాజి, క్రాంతి కీల‌క పాత్ర‌ధారులు.


ఈ సినిమాకు సంగీతం: కె.ఎమ్‌.రాధాకృష్ణ‌న్‌, పాట‌లు: వ‌న‌మాలి, పెద్దాడ‌మూర్తి, శ్రీహ‌రి మంగ‌ళంప‌ల్లి, కెమెరా: జి.ఎల్‌.ఎన్‌.బాబు, ఎడిటింగ్: మ‌ధు, నృత్యాలు: భాను, క‌థ‌: శ్రీమంగ‌ళం, ర‌మ్య‌, ఆర్ట్: కృష్ణ‌మాయ‌, నిర్మాణ స‌హ‌కారం: యు అండ్ ఐ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, నిర్మాత‌లు: శ్రీహ‌రి మంగ‌ళంప‌ల్లి, ర‌మ్య గోగుల‌, పి.ఎల్‌.ఎన్‌.రెడ్డి, ఎ.ప‌ద్మ‌నాభ‌రెడ్డి, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: బాలాజి సాన‌ల‌.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !