View

సువ‌ర్ణ‌సుంద‌రి థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ లాంఛ్ విశేషాలు

Wednesday,February06th,2019, 01:53 PM

జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతొన్న చిత్రం "సువర్ణసుందరి". ఈ సినిమాను సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఓ సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ద‌స్‌ప‌ల్లా హోట‌ల్‌లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు బి.గోపాల్ చేతుల మీదుగా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను ఆవిష్కరించారు. విలేక‌రుల స‌మావేశంలో...


స్టంట్ మాస్ట‌ర్ రామ్ సుంక‌ర‌ మాట్లాడుతూ... ఈ చిత్రం మీ అంద‌రికి రెండు ఏళ్ళ నుంచి ప‌రిచ‌యం. మేమంద‌రం రెండేళ్ళ నుంచి ఈ చిత్రానికి ప‌ని చేశాం. సాక్షిగారితో మా జ‌ర్నీ స్టార్ట్ అయింది. ఈ చిత్రంలో క‌త్తి ఫైట్స్ ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల కొంచం ఎక్కువగా ప్రాక్టీస్ చెయించాల్సి వ‌చ్చింది. ప్రాడ్యూస‌ర్ ల‌క్ష్మీగారు మాకోసం రెండేళ్ళ‌పాటు ఎదురు చూసినందుకు చాలా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు. మా డైరెక్ట‌ర్‌గారికి కూడా చాలా కృత‌జ్ఞ‌త‌లు. నాకు ఈ అవ‌కాశం కల్పించిన మీ అంద‌రికి నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.


రైట‌ర్ ప్ర‌దీప్ మాట్లాడుతూ... నేను సూర్య దాదాపు ఎనిమిదేళ్ళ నుంచి మా స్నేహం సాగుతుంది. స‌డెన్‌గా ఒక రోజు నాకు కాల్ చేసి ర‌మ్మ‌న్నారు. నాకు ఈ అవ‌కాశం ఇచ్చినందుకు చాలా కృత‌జ్ఞ‌త‌లు. అన్ని విష‌యాల్లో ద‌గ్గ‌రుండి చాలా జాగ్ర‌త్త‌గా చూసుకున్నారు. డి.ఓ.పి. చాలా బాగా ప‌ని చ‌స్త్రశారు. సాయి కార్తిక్ మ్యూజిక్ కూడా బాగా కుదిరింది. ఈ చిత్ర యూనిట్ అంద‌రికి నా ఆల్ ద బెస్ట్ అన్నారు.


డైరెక్ట‌ర్ సాగ‌ర్ మాట్లాడుతూ... ఇది చాలా ఎక్స్‌ట్రాడిన‌రీ చిత్రం. హీరోయిన్స్ చాలా చ‌క్క‌గా చేశారు. మ‌న తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు అంద‌గ‌త్తె జ‌య‌ప్ర‌ద. ఆవిడ కూడా ఈ చిత్రంలో న‌టించారు. ఎంటైర్ టీమ్ కి ఆల్ ద బెస్ట్. షూటింగ్ స్పాట్ల‌న్ని కూడా చాలా మంచి లొకేష‌న్స్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. సాయికార్తిక్ మ్యూజిక్ బావుంది. మ‌గ‌వారు ఏదైనా ఎటువంటి సాహ‌సాలైనా చెయ్య‌గ‌ల‌రు. కాని ఆడ‌వాడు చెయ్య‌డం గ్రేట్ అన్నారు.


హీరోయిన్ సాక్షి మాట్లాడుతూ... ఇది చాలా అద్భుత‌మైన చిత్రం. మంచి పాట‌లు. ఫైట్స్ చాలా బాగా వ‌చ్చాయి. స్టంట్ మాస్ట‌ర్ చాలా కోప‌రేట్ చేశారు. నాకు బాగా హెల్ప్‌చేశారు. ఆయ‌న‌కు నా కృత‌జ్ఞ‌త‌లు. డిఓపిసార్‌కి నా కృత‌జ్ఞ‌త‌లు న‌న్ను అంత అందంగా చూపించినందుకు. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన సూర్య‌గారికి నా కృత‌జ్ఞ‌త‌లు. నా కో స్టార్ ఇంద్ర‌తో న‌టించ‌డం చాలా ఫ‌న్‌గా అనిపించింది. మా టీమ్ అంద‌రికి నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.


హీరో ఇంద్రా మాట్లాడుతూ... నాకు ఈ చిత్రంలో న‌టించే అవ‌కాశం రావ‌డానికి కార‌ణం సూర్యగారు. నేను వంగ‌వీటి చిత్రంలో న‌టిస్తుండ‌గా ఒక‌రోజు ఫోన్ చేసి ర‌మ్మ‌ని నాకు నా పాత్ర గురించి వివ‌రించారు. నాపైన న‌మ్మ‌కం ఉంచి నాకు అంత మంచి పాత్ర‌ను ఇచ్చినందుకు ఆయ‌న‌కు నేను జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను. ఈ చిత్రం ఇంత లేటు అయిందేంటి అని ఎవ్వ‌రూ అనుకోవ‌ద్దు. దీని వెనుకున్న కార‌ణం ఈ చిత్రం చాలా బాగా రావాల‌ని డైరెక్ట‌ర్‌గారు ప్ర‌తి చిన్న విష‌యంలో చాలా శ్ర‌ద్ధ తీసుకుని శ్ర‌మ‌ప‌డ్డారు. వీఎఫ్ఎక్స్ ఆయ‌న ప‌డిన క‌ష్టం చాలా గ్రేట్‌. నేను ఈ చిత్రంలో ఒక రొమాంటిక్ సీన్ చేశాను. సాక్షి నా కో ఆర్టిస్ట్‌. పూర్ణ కూడా చాలా బాగా చేశారు. టీమ్ అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు. సాయికార్తిక్ మ్యూజిక్‌, సినిమాటోగ్ర‌ఫీ అన్నీ బాగా కుదిరాయి.


పూర్ణ మాట్లాడుతూ... ఒక మ‌నిషికి స‌హ‌నం అంటే అది సూర్య గారినుంచే నేర్చుకోవాలి. ప్ర‌తి ఒక్క‌రికీ చాలా ఓర్పుగా త‌మ త‌మ పాత్ర‌ల గురించి చాలా చ‌క్క‌గా వివ‌రించి ఆయ‌న‌కు ఏమి కావాలో ఆ అవుట్ పుట్ తెప్పించుకున్నారు. సూర్య‌గారు మీకు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు. ఫైట్ మాస్ట్‌కి కూడా నా కృత‌జ్ఞ‌త‌లు. హీరో రామ్ కూడా మొద‌ట్లో కొంచం భ‌య‌ప‌డేవారు కాని బాగా న‌టించారు. సాక్షి మ‌నిద్ద‌రి మ‌ధ్య జ‌రిగే చాలా స‌న్నివేశాలు అన్నీ ఫ‌న్నీగా జ‌రిగిపోయాయి. మా టీమ్ అంద‌రికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.


హీరో రామ్ మాట్లాడుతూ... నాకు ఈ చిత్రంలో అవ‌కాశం రావ‌డానికి కార‌ణం సాయి కార్తిక్ నాకు ఎప్ప‌టి నుంచో ఫ్రెండ్ త‌న ద్వారా నాకు ఈ అవ‌కాశం వ‌చ్చింది. ఆయ‌న నాకు సూర్య‌గారిని ప‌రిచ‌యం చేశారు. సూర్య‌గారు అలా గుర్తుపెట్టుకుని నాకు ఈ చిత్రంలో న‌టించే అవ‌కాశం క‌ల్పించారు. ఇది నా మొద‌టి చిత్రం. సూర్య‌గారికి నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు. నా ఫ‌స్ట్ సినిమాలోనే పూర్ణ‌లాంటి ఎక్స్‌పీరియ‌న్స్ హీరోయిన్‌తో చేయ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.


డైరెక్ట‌ర్ సూర్య మాట్లాడుతూ... ఈ సినిమాని చాలా స్పెష‌ల్‌గా చేశాం. ఈ చిత్రంలో న‌టించిన న‌టీన‌టులంద‌రూ నాకు చాలా స‌హ‌క‌రించారు. ప్ర‌తి ఒక్క‌రికి పేరు పేరునా నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు. ప్ర‌తి ఆర్టిస్ట్ చాలా బాగా న‌టించారు. ఈ చిత్రంలో విఎఫెక్స్ విజువ‌ల్స్ ఉండ‌డం వ‌ల్ల లేట్ అయింది. విఎఫ్ఎక్స్ కోసం క‌నీసం ఏడాదిపాటు దాని పై వ‌ర్క్ జ‌రిగింది. లేటు అయినా కూడా ఫ‌లితం చాలా బాగా వ‌చ్చింది. మా యూనిట్ అంద‌రికీ న‌న్ను ఆశీర్వ‌దించ‌డానికి ఇక్క‌డికి వ‌చ్చిన పెద్ద‌లందరికీ నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.


త‌మ్మారెడ్డి మాట్లాడుతూ... ఇలాంటి సినిమాలు రావ‌డం ప‌రిశ్ర‌మ‌కి చాలా అవ‌స‌రం ఉంది. దాని వ‌ల్ల కొత్త టెక్నీషియ‌న్స్ ప‌రిచ‌యం అవుతారు. డైరెక్ట‌ర్ క‌థ బాగా రాసుకున్నారు. కంటెంట్ చాలా బావుంది. త‌ప్ప‌ ఒక మంచి సినిమా అవుతుంది అని అన్నారు.


బి. గోపాల్ మాట్లాడుతూ... ట్రైల‌ర్ చూశాను చాలా బావుంది. విఎఫెక్స్ వ‌ర్క్ బావుంది. అన్ని షాట్స్ కూడా చాలా బాగా తీశారు. కంటెంట్ బావుంది ఈ సినిమా మంచి స‌క్సెస్ సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌,విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌, బి.గోపాల్‌, సాగ‌ర్ త‌దిత‌రులు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.


న‌టీన‌టులుః జ‌య‌ప్ర‌ద‌, పూర్ణ‌, సాక్షి, ఇంద్ర‌, రామ్, సాయికుమార్‌, కోటాశ్రీ‌నివాస‌రావు, ముక్త‌ర్‌ఖాన్‌, నాగినీడు, స‌త్య‌ప్ర‌కాష్‌, అవినాష్ న‌టిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ్యూస‌ర్ఃఎం.ఎల్‌.ల‌క్ష్మి, మ్యూజిక్‌డైరెక్ట‌ర్ఃసాయికార్తిక్‌, స్టంట్స్ఃరామ్‌సుంక‌ర‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ఃనాగు, డి.ఓ.పి. ఎల్లుమంతిఈశ్వ‌ర్‌, ఎడిట‌ర్ఃప్ర‌వీణ్‌పూడి, స్టోరీఃఎం.ఎస్‌.ఎన్.సూర్య‌, పి.ఆర్‌.ఓ. సాయిస‌తీష్‌, డైరెక్ట‌ర్ఃఎం.ఎస్‌.ఎన్‌.సూర్య‌.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !