View

2017, 18 టి ఎస్ ఆర్, టివి 9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్

Friday,February15th,2019, 09:13 AM

‘‘కళాకారులకు జాతీయ స్థాయిలో ఫిల్మ్‌ అవార్డులు ఇవ్వాలని పదేళ్ల కిత్రం నాకో ఆలోచన వచ్చింది. అదీ ప్రజాభిప్రాయం తెలుసుకుని ఇవ్వాలని. ప్రజాభిప్రాయ సేకరణకు టీవీ చానల్‌ ఉంటే బాగుంటుందని టీ వీ9తో కలిసి ‘టీఎస్‌ఆర్‌ టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’ని స్థాపించా’’ అని కళాబంధు, ‘టీఎస్‌ఆర్‌ టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’ చైర్మన్‌ టి.సుబ్బరామి రెడ్డి అన్నారు. 2017, 2018 సంవత్సరాలకు ‘టీఎస్‌ఆర్‌ టీవీ9 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’కి ఎంపికైన వారి వివరాలను గురువారం సుబ్బరామిరెడ్డి ప్రకటించారు.


ఈ సందర్భంగా టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ – ‘‘ఈ అవార్డ్స్‌ ఫంక్షన్‌ని ఈ నెల 17న విశాఖపట్నంలోని పోర్ట్‌ స్టేడియంలో నిర్వహిస్తున్నాం. తెలుగు, హిందీ, పంజాబీ, భోజ్‌పురి, తమిళ్, కన్నడ, మలయాళం... ఇలా భారతదేశంలోని అన్ని భాషల నటీనటులకు అవార్డులు ఇస్తున్నాం. ప్రముఖ కథానాయకులు నందమూరి బాలకృష్ణ, నాగార్జునలకు టీఎస్‌ఆర్‌ జాతీయ అవార్డులు ప్రకటించారు. 2017 సంవత్సరానికిగానూ ఉత్తమ నటుడిగా బాలకృష్ణ (గౌతమిపుత్ర శాతకర్ణి), 2018 సంవత్సరానికి గానూ నాగార్జున (దేవదాస్‌) ఈ పురస్కారాలను అందుకోబోతున్నారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో 2017, 2018 సంవత్సరాలకు గాను విజేతల పేర్లు ప్రకటించారు. ‘‘నాలుగేళ్లుగా ఈ పురస్కారాల్ని అందిస్తున్నాం. ఈ ఆదివారం విశాఖపట్నంలో పురస్కారాల్ని ప్రదానం చేస్తున్నాం. ప్రజాభిప్రాయాన్ని సేకరించి పురస్కారాల్ని అందిస్తున్నాం. మహానటి, రంగస్థలం, గౌతమిపుత్ర శాతకర్ణి.. ఇలా మంచి చిత్రాలకే పురస్కారాలు అందాయి. శ్రీదేవి, దాసరి నారాయణరావు పేరిట కూడా అవార్డుల్ని ఇస్తున్నాం.


ఈ అవార్డుల జ్యూరీ మెంబర్లుగా నగ్మా, జీవితా రాజశేఖర్, మీనా, పరుచూరి గోపాలకృష్ణ, కేఎస్‌ రామారావు, నరేశ్, రఘు రామకృష్ణంరాజు, పింకీ రెడ్డి, శోభన కామినేని వ్యవహరించారు. వేలాది మంది ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అన్ని భాషల నుంచి దాదాపు 60మంది ఫిల్మ్‌ స్టార్స్‌ అవార్డులు తీసుకోనున్నారు’’ అన్నారు.


జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికైన నటి నగ్మా మాట్లాడుతూ –‘‘నా లైఫ్‌ ఇంకా చాలా ఉంది.. ఇంకా చాలా సినిమాలు చేయాలి. అప్పుడే మీరు (సుబ్బరామిరెడ్డి) లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు ప్రకటించారు (నవ్వుతూ). ఈ అవార్డుతో పాటు సామాజిక సేవ చేసినందుకు మార్చిలో ‘రాజీవ్‌గాంధీ’ అవార్డుకూడా అందుకోబోతున్నా. తెలుగులో నా సినీ ప్రయాణం ఇంకా కొనసాగాలి’’ అన్నారు.‘‘అవార్డు జ్యూరీలో నేను సభ్యురాల్ని. ఈసారి నాకు జీవన సాఫల్య పురస్కారం కూడా లభించింది. నటిగా నా కెరీర్‌ ఆగిపోలేదు. ఇప్పుడో చిత్రంలో నటిస్తున్నా’’ అని చెప్పారు.


పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘అందరికంటే కష్టమైన పని ఏంటంటే జ్యూరీ సభ్యునిగా ఉండటం. నక్షత్రాల్లో చంద్రుడ్ని చూపించి ఇందులో ఎవరు పెద్ద, గొప్ప అంటే చంద్రుడ్ని చూపిస్తాం. అందరి చంద్రుల్ని చూపించి ఇందులో ఏ చంద్రుడు గొప్ప అంటే ఏం చెబుతాం? అలా ఈ హీరోలు, హీరోయిన్లందరూ చందమామలే. మా అదృష్టం ఏంటంటే కొన్ని వేలమంది చక్కగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. మేం రెండు మూడుసార్లు చర్చించుకుని ఫైనల్‌ లిస్ట్‌ తయారు చేశాం. వర్షం పడితే రైతుకు ఆనందం. కళాకారుల ముఖం ఆనందంతో తడిస్తే మా సుబ్బరామిరెడ్డిగారికి ఆనందం. మహాభారతంలో ధర్మరాజును అజాతశత్రువు అంటారు. ఈ భారతదేశంలో నాకు సజీవంగా కనిపిస్తున్న ఏకైక అజాత శత్రువు సుబ్బరామిరెడ్డిగారు’’అన్నారు.‘‘కళాకారుల్నిగౌరవించడం సుబ్బిరామిరెడ్డిగారిని చూసి నేర్చుకోవాల’’న్నారు పరుచూరి గోపాలకృష్ణ.


ఈ కార్యక్రమంలో జ్యూరీ సభ్యులు డా.శోభన కామినేని, రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు.


విజేతలు వీళ్లే..
2018కి ఉత్తమ కథానాయకుడిగా రామ్‌ చరణ్‌(రంగస్థలం), ఉత్తమ నటి కీర్తి సురేష్‌ (మహానటి), ఉత్తమ కథానాయిక పూజా హెగ్డే(అరవింద సమేత వీర రాఘవ), 2017కి ఉత్తమ నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌(రారండోయ్‌ వేడుక చూద్దాం), ఉత్తమ కథానాయిక రాశీఖన్నా (జై లవకుశ) ఎంపికయ్యారు. షాలినీపాండే, రాజేంద్రప్రసాద్‌, వీవీ వినాయక్‌, క్రిష్‌, సుకుమార్‌, రాజశేఖర్‌, అఖిల్‌, నాగచైతన్య, కల్యాణ్‌రామ్‌, సుమంత్‌, ఆది పినిశెట్టి, దేవిశ్రీ ప్రసాద్‌, తమన్‌, కల్యాణ్‌దేవ్‌, అలీ, బి.జయ, బోనీకపూర్‌లకు పలు విభాగాలలో అవార్డులు దక్కాయి. శ్రీదేవి స్మారక పురస్కారం విద్యాబాలన్‌కి, దాసరి స్మారక పురస్కారం మోహన్‌బాబుకి లభించింది. ‘అవుట్‌స్టాండింగ్‌ సినీ లిరిక్‌ రైటర్‌’ అవార్డుని సిరివెన్నెల సీతారామశాస్త్రికి ప్రకటించారు.


* Balakrishna, Keerthy Suresh bag top awards


* Vidya Balan for Sridevi Memorial Award.


Senior actors Balakrishna and Nagarjuna have won the Best Actor Awards at the prestigious TSR-TV9 National Film Awards for 2017-19.


The films Gauthamiputra Satakarni and Mahanati won most awards while the Sridevi Memorial Award went to Vidya Balan. The function will be held at Visakhaptnam on Sunday.


The awards for 2017 and 2018 were announced on Thursday by TSR Lalitha Kala Parishath chairman Mr T. Subbarami Reddy.


The awards function will be held at the Visakhapatnam Port Stadium on Sunday from 5 pm onwards. Mr Reddy said this was the second time that he was going to conduct the film event in open grounds. “Many South Indian stars and Hindi stars are going to attend this function. Chiranjeevi is attending as a special guest,” Mr Reddy said.


Balakrishna and Nagarjuna were adjudged best actors for 2017 and 2018, respectively, for their films Gauthamiputra Sathakarni and Devdas.


In the female category, Rakul Preet Singh and Keerthy Suresh got the Best Actress award for their films Rarandoi Veduka Chooddam and Mahanati respectively. Ram Charan gets the Best Hero award for his outstanding performance in the film Rangasthalam.


In the Best Directors category, Radhakrishna Jagarlamudi (Krish) and Nag Ashwin won for the films Gautamiputra Satakarni and Mahanati respectively. Both these films also won Best Films award for the respective years.


Chiranjeevi’s Khaidi No. 150 won the Most Popular Film award for 2017. The film’s director, V.V. Vinayak, won the Most Popular Director award. Interestingly, Chiranjeevi’s son Ram Charan-starrer Rangasthalam is the Most Popular Film for 2018 and its director Sukumar Most Popular Director.


Actors Rajasekhar, Sumanth, Akhil, Naga Chaitanya, Supriya, Kalyan Ram and Bellamkonda Sai Srinivas got Special Jury Awards for their performance in their respective films.


There are many other awards, for singers, music directors and technicians.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !