View

అల్లు శిరీష్ ఏబిసిడి 'మెల్ల మెల్లగా' ఫస్ట్ సింగిల్ లాంచ్

Thursday,February21st,2019, 10:26 AM

కంటెంట్ వున్న‌ క‌థ‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డి సురేష్ బాబు ఈ చిత్ర స‌మ‌ర్ప‌కులు. మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు, బాల నటుడు భరత్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ధీరజ్ మొగిలినేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ను హైలైఫ్ పబ్ లో గ్రాండ్ గా లాంచ్ చేశారు. యూత్ లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న మోస్ట్ వాంటెడ్ సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాట పాడటం విశేషం. ఆ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో లైవ్ లో సిద్ శ్రీరామ్ పాట పాడి సందడి చేశాడు. మెల్ల మెల్లగా ఆంటూ సాగే ఈ పాటను కెకె రచించగా సిద్ శ్రీరామ్ అదితితో కలిసి ఆలపించారు. ఈ సాంగ్‌కు సంబంధించిన బిగ్ సీడీని నిహారికా కొణిదెల విడుద‌ల చేశారు. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ సందర్బంగా మ్యూజిక్ డైరెక్ట‌ర్ జుధా శాండీ మాట్లాడుతూ - తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోకి రావాల‌నుకుని చాలా రోజులుగా అనుకునేవాడిని నా క‌ల నేటితో నిజమైంది. మై ఫ్రెండ్ హీరో అల్లు శిరీష్ తో పాటు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు చాలా థాంక్స్. మెల్ల మెల్లగా అనే ఈ పాటను సిద్ చాలా అద్భుతంగా పాడారు. కృష్ణ‌కాంత్‌గారు ఎక్స్‌లెంట్‌గా రాశారు. అంద‌రికీ థాంక్స్‌ అన్నారు.


నిర్మాత మ‌ధుర శ్రీధ‌ర్ మాట్లాడుతూ - జుడా శాండీగారికి తెలుగు సినిమాల్లోకి మా సినిమా ద్వారా ఆహ్వానం ప‌లుకుతున్నాం. ఆయ‌న చాలా మంచి మ్యూజిక్ అందించారు. ఈ సినిమాతో ఆయ‌న‌కు చాలా మంచి పేరు వస్తుంది. అలాగే పాట‌ను చ‌క్క‌గా పాడిన సిద్ శ్రీరాంకు అభినంద‌న‌లు. సాంగ్ చార్ట్ బ‌స్ట‌ర్‌లో నిల‌బ‌డుతుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కం ఉంది. సినిమా కోసం అంద‌రం క‌ష్ట‌పడ్డాం. మంచి ఫ‌లితం కోసం ఎదురుచూస్తున్నాం అన్నారు.


ద‌ర్శ‌కుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ - నా పై న‌మ్మ‌కంతో ద‌ర్శ‌కుడిగా నాకు అవ‌కాశం ఇచ్చిన అల్లు శిరీష్‌గారికి ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను. య‌ష్ రంగినేనిగారు ఈరోజు ఇక్క‌డ‌కు రాలేక‌పోయారు. ఆయ‌న‌కు, ధీర‌జ్ మొగిలినేని గారికి థాంక్స్‌. జుడా శాండీ ఎక్స‌లెంట్ మ్యూజిక్ ఇచ్చారు. భ‌విష్య‌త్‌లో చాలా మంచి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకుంటారు. కృష్ణ‌కాంత్‌గారు అద్భుత‌మైన సాహిత్యం అందించారు. సిద్‌గారి వాయిస్‌తో ఈ పాట‌కు ఇంకా అందం వ‌చ్చింది. అంద‌రికీ థాంక్స్‌ అన్నారు.


కెమెరామెన్ రామ్‌ మాట్లాడుతూ - ఈ ప్రాజెక్ట్‌కి ప‌నిచేయడం హ్య‌పీ. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌ అన్నారు.


భ‌ర‌త్ మాట్లాడుతూ - శాండీ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సిద్ శ్రీరాంగారు పాడిన తొలి పాట‌ను అద్భుతంగా పాడారు. మంచి ఆల్బ‌మ్‌ను అందించినందుకు థాంక్స్‌ అన్నారు.


నిర్మాత ఎస్‌.కె.ఎన్ మాట్లాడుతూ - ఈ సాంగ్ చార్ట్ బ‌స్ట‌ర్... సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


రుక్సార్ థిల్లాన్ మాట్లాడుతూ - మంచి టీంతో ఈ సినిమా చేయ‌డం హ్య‌పీగా ఉంది. సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. ఈ రోజు విడుద‌లైన సాంగ్ చాలా పెద్ద హిట్ అవుతుంది. అలాగే సినిమా పెద్ద హిట్ అవుతుంది అన్నారు.


నిహారిక కొణిదెల మాట్లాడుతూ - సాంగ్ చాలా బాగా న‌చ్చింది. నేను సిద్ శ్రీరాంకు నేను పెద్ద ఫ్యాన్‌ని. మ‌ధుర శ్రీధ‌ర్ స‌హా ఎంటైర్ టీంకు అభినంద‌న‌లు. శాండీకి తెలుగు ఇండ‌స్ట్రీలో మంచి ఫ్యూచ‌ర్ ఉంటుంది. సినిమా చాలా బాగా ఆడుతుంది అన్నారు.


హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ - నిమా గురించి చాలా మాట్లాడాలి. అవన్నీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతా. ఇప్పుడు ఈరోజు రిలీజ్ చేసిన సింగిల్ గురించి మాట్లాడుతూ. నేను ఓ రోజు బెంగళూరులో కారులో వెళ్తున్నప్పుడు రేడియోలో ఓ పాట విన్నాను. ఆపాట ఇంగ్లిష్ లో స్టార్ట్ అయి కన్నడలో వచ్చింది. సాంగ్ చాలా బాగా నచ్చింది. ఈ సాంగ్ గురించి తెలుసుకున్నప్పుడు జుదా సాంధీ గురించి తెలిసింది. ఈ తరహా సౌండ్ తెలుగు సినిమాకు తీసుకురావాలనిపించింది. ఎబిసిడి సినిమాకు జుదా కరెక్ట్ అనిపించింది. అతనితో ఈ సినిమాకు వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. తెలుగు సినిమాకు మంచి మ్యూజిక్ డైరెక్టర్ ను పరిచయం చేస్తున్నాం. ఈ పాటకు ఓకల్స్ అందించిన సిద్ శ్రీరామ్ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయన పాటలంటే అంత ఇష్టం. నా సినిమాలోని మంచి పాటను సిద్ పాడటం చాలా హ్యాపీగా ఉంది. నా నిర్మాతలు మధుర శ్రీధర్, యశ్ రంగినేని, కో ప్రొడ్యూసర్ ధీరజ్, మా డైరెక్టర్ సంజీవ్ గురించి మా టెక్నీషియన్స్ గురించి వచ్చే ఫంక్షన్ లో మాట్లాడుతాను ని అన్నారు.

Allu Sirish, Niharika Konidela Launch ‘Mella Mellaga’ Single From ABCD


Allu Sirish, Niharika Konidela launched ‘Mella Mellaga’, a melodious romantic soundtrack, from Allu Sirish’s ‘ABCD’ at a grand event in Hyderabad on February 20. The event, which was held at Hylife, saw the entire team of the film including Allu Sirish, Rukshar Dhillon, Sanjeev Reddy, Judah Sandhy, Sid Sriram, Madhura Sreedhar, Raam, Bharath, Bekkam Venugopal, and Aditi Bhavaraju come together to talk about the film and the song. The highlight of the event was a live performance by Sid Sriram and Aditi Bhavaraju, who sang the song much to everyone’s delight.


Talking at the event, Allu Sirish said, “Last year, when I was in Bangalore, I happened to hear a song on the local FM. The sound was fresh and new to me that I, initially, thought it was an English song, but it was in fact a Kannada song. I was so impressed with it that I wanted to find out more about the music director. That’s how I came across Judah Sandhy’s works. I think it was a divine blessing. Ever since we started working on ABCD, I’ve been wanting to introduce a new music director, and when I heard the Judah’s song, I knew that was the kind of music that I wanted to bring to the Telugu audience. I hope he has a long career ahead in Telugu film industry.” Sirish also praised Sid Sriram and said that he’s one of his favourite singers. “Among the top 20 songs that I hear on a loop, at least 8-10 of them have been sung by Sid Sriram. I’m in love with his voice, and I’m confident that people will fall in love with Mella Mellaga too. I really want to speak more about the film and the technicians who have worked hard on the film, but I’ll save it for the pre-release event,” Sirish added.


Judah Sandhy, music director, thanked Allu Sirish for introducing him to Telugu film industry, and said, “It was a pleasure working on this film. Thank you Sid Sriram and Aditi for singing this song. I am eagerly looking forward to the response for the whole album and the film too.” Sid Sriram and Aditi Bhavaraju, who impressed everyone with their performance, wished the team a big success.


Niharika Konidela, who was one of the guests at the event, stated that she’s an ardent admirer of Sid Sriram. “The song is wonderful and it’s going to be a chartbuster. I’m a huge fan of Sid Sriram’s voice and he’s a big asset to any film that he’s part of. He also sang a song in one of my films. I wish the entire team a big success and hope the film does really well,” Niharika said.


Madhura Sreedhar, one of the producers of Allu Sirish’s ABCD, was all praise for the actor and said, “I really enjoyed working on this project with Allu Sirish. We have worked hard to make a good film, and I hope the audience will like it too. Judah Sandhy is going to make it big in Telugu film industry, and I thank Sid Sriram and Aditi for bringing such a beautiful song to life. We are introducing a new director Sanjeev Reddy with this film and I’m sure he will make a good name for himself.”


Sanjeev Reddy, who’s making his debut as a director with this film, recalled an incident from the shoot of Mella Mellaga and stated that Allu Sirish is not just a reel hero, but also a real life hero. “Allu Sirish and Rukshar were on a bike, and all of a sudden, few drunkards passed some comments and walked away. After the shot was done, when I came back to meet Sirish, I saw him making the drunkard apologise to Rukshar. I was really touched by his gesture. He is not only a reel hero but also a real life hero,” Sanjeev said.


Krishna Kanth, popularly known as KK, has penned the lyrics. ABCD stars Allu Sirish and Rukshar Dhillon in lead roles, along with Bharath Kumar M, Vennela Kishore, K Naga Babu, Kota Sreenivasa Rao, and Subhalekha Sudhakar. Madhura Sreedhar Reddy and Yash Rangineni have produced the film under Madhura Entertainment and BigBen Cinemas banner. Raam is the cinematographer and Navin Nooli is the editor. Suresh Babu is presenting this film which will release on March 21.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !