View

దుప్పట్లో మిన్నాగు టీజర్ లాంఛ్ విశేషాలు

Saturday,March02nd,2019, 02:52 PM

యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతొన్న చిత్రం "దుప్పట్లో మిన్నాగు". చిరంజీవి క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి అమర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‌ ‌సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో ప్రఖ్యాత కన్నడ కధానాయిక చిరాశ్రీ నటిస్తొంది.


నవ్య వారపత్రికలో నవలల పోటీలో 50,000 ప్రథమ‌బహుమతి పొందిన దిండు కింద నల్ల త్రాచు నవల ఆధారంగా రూపొందుతొన్న చిత్రమిది.‌ ఈ చిత్ర టీజర్ ను పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రసాద్ ల్యాబ్స్ లొ విడుదల చేశారు. చిత్రానికి సంబందించిన కొన్ని సన్నివేశాలను విచ్చెసిన అతిథుల చేత పదర్శించారు.


యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ..‌ 12 సం. క్రితం వచ్చిన ఓ చిన్న ఐడియా తో ఈ కథ రాయటం జరిగింది. ఓ ఇంటర్యూ లొ, ఓ అర్దరాత్రి, నీ జెండర్ మారిపొతే ఏం చెస్తారు అన్న ప్రశ్న కు, ఓ అమ్మాయి చెప్పిన సమాదానం, అందులొ ఉన్న డెప్త్ ను అర్దంగా చేసుకుని ఈ కథను రాయటం జరిగింది. కాశ్మీర్ ఉగ్రవాదం నేపథ్యంలో అకస్మాత్తుగా తప్పిపొయిన తండ్రిని , ఓ కూతురు ఎలా వెతికి పట్టుకుంది. తీవ్రవాదులని ఎలా మట్టు పెట్టిందన్న కథాశంతో రూపొందించిన చిత్రమిది.నిర్మాత..కె.ఎస్.రామారావు, మిత్రుడు కొదండ రామిరెడ్డి వారిరువురు రావటం సంతోషమన్నారు.


కె.ఎస్.రామారావు మాట్లాడుతూ.. దుప్పట్లో మిన్నాగు కథ చదివాను.‌ సినిమాగా చాలా అప్డెటెడ్ గా యండమూరి గారు తీశారు. కాంటెపరరీ టెక్నిషియన్స్ కు ఏమాత్రం తీసిపొకుండా అడ్వాన్స్‌డ్ గా తీశారన్నారు.


మేథా చిరంజీవి మాట్లాడుతూ.. యండమూరి గారు ఈ సినిమాకు అన్నీ తానే తీశారు. రచయితగా , దర్శకుడు గా ఆయన ప్రూవ్డ్. సినిమా ఆకట్టుకుంటుంది అలాగే ఆలొచింప చేస్తుందన్నారు


దర్శకులు కొందడరామిరెడ్డి మాట్లాడుతూ.. సినిమా చూశాను. అంతా బాగుంది.‌ఇప్పుడున్న పరిణామాలకు కరెక్ట్ గా సరిపొయె చిత్రం. ఆయన 12 నవలలు నేను సినిమాలుగా చేశాను. అవి అన్నీ హిట్టె. నాకు దర్శకుడిగా పేరు తెచ్చాయి.‌గురువుగారి సినిమా బాగా ఆడాలని ఆశిస్తున్నానన్నారు.


దర్శకులు అజయ్ మాట్లాడుతూ.. యండమూరి దారి సినిమా అంటే మా సొంత సినిమా లెక్క. "దుప్పట్లొ మిన్నాగు" టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమా కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. యువ దర్శకులకు స్పూర్తి గా ఈ సినిమా మేకింగ్ ఉంటుందన్నారు‌.


నిర్మాత చల్లపల్లి అమర్ మాట్లాడుతూ: 1992 నుంచి ప్రొడక్షన్ లో ఉన్నాను. యాడ్ ఫిలింస్, డాక్యుమెంటరీలు చెస్తుంటాను.‌ఇది మా తొలి చిత్రం . ఈ సినిమా ను చాలా తక్కువ టైమ్ లో తీశాం. అందరి సపోర్ట్ ఉంటుందని నమ్ముతున్నాను. యండమూరి గారు నాకు స్పూర్తి నిచ్చిన వ్యక్తి. ఈ రోజు ఆయనతో సినిమా చేయటం ఆనందంగా ఉందన్నారు.


హీరొయిన్ చిరాశ్రీ మాట్లాడుతూ.. యండమూరి గారు ఇచ్చిన సపోర్ట్ తో సినిమాను చాలా బాగా చేశాము. సార్ చాలా స్పొర్టీవ్ అన్నారు.


దశరధ్ మాట్లాడుతూ .. గురువు గారు వల్లే నేను ఈ స్దాయికి‌ వచ్చాను.‌ఆయన పుస్తకాలే నాకు స్పూర్తి. ‌ఈ కథ ఓ సూపర్ థ్రిల్లర్. అన్నీ పాత్రలు ఎక్సెలెంట్ ఉంటాయి. కమర్షియల్ గా కూడా ఇది ది బెస్ట్ మూవీ అని చెప్పుకొవచ్చు అన్నారు.


సిరి వెన్నెల సీతారామ శాస్తి మాట్లాడుతూ.. యండమూరి గారితో నాకు ఎప్పటినుంచో పరిచయం.తెలుగు తెలిసిన వారందరికి ఆయన తెలిసిన వ్యక్తి. సెలెబ్రటీలు కూడా ఆయనకు అభిమానులు.ఆయన ప్రత్యేకమైన ,పాపులర్ రచయిత. అన్నీ తరహా పాఠకలకు ఆయన రచనా శైలీ నచ్చుతుంది. కథలొ ఆసక్తికరంగా ఓ పాయింట్ తో, అవసరమైన ఎదొ ఒక విషయం ఆయన ప్రస్తావిస్తూ ఉంటాడు. బేతాళ విక్రమార్కుడు లా అందరికీ అవసరమయ్యేలా ఆయన కథలు చెపుతూనె ఉన్నాడు. ఇప్పుడు సినిమా చెస్తున్నారు. ఇది అంతే అర్దంవంతంగా , కాంటెపరరీ ఇష్యూష్ ను టచ్ చెస్తూ ఈ చిత్రాన్ని తీశారనిపించింది.‌యండమూరి రచనకు నేను అభిమానిని. విశిష్టమైన రచయిత.నా ఆలోచనలకు ఇంథనం ఇచ్చే రచనలు ఆయనవి. ఇంకా ఎంతో పేరు రావాల్సిన రచయిత ఆయన. ఈ కథను నేను చదివాను. సినిమా సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను అన్నారు.


ఇంకా ఈ కార్యక్రమంలో సుబ్బరాయ శర్మ, శ్రీశైల మూర్తి పండరీ నాధ్ తదితరులు పాల్గొన్నారు.


చిరాశ్రీ ,విశ్వజిత్, నవీన్ తీర్దహళ్ళ, సుబ్బరాయ శర్మ,సుథీర్ కుమార్ ,మఢథా చిరంజీవి, అమర్ ప్రసాద్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి మాటలు: శ్రీశైల మూర్తి, కెమెరా: నిరంజన్ బాబు, ఎటిడింగ్: పవన్ ఆర్.ఎస్. , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: సతీష్ బాబు, సౌండ్ ఇంజనీర్ : శ్రీరామ్,
పి.ఆర్.ఓ: సాయి సతీష్‌,
బ్యానర్: చిరంజీవి క్రియేషన్స్,
నిర్మాత : చల్లపల్లి‌అమర్,రచన- దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాథ్.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !