View

వారి స‌మ‌స్య‌ల‌తో 'ఆప‌రేష‌న్ గోల్డ్‌ఫిష్‌'

Tuesday,March05th,2019, 03:40 AM

వినాయ‌కుడు, విలేజ్‌లో వినాయ‌కుడు, కేరింత విజ‌యాల త‌ర్వాత అడివి సాయికిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ చిత్రం ఆప‌రేష‌న్ గోల్డ్‌ఫిష్. ఆదిసాయికుమార్‌, అబ్బూరి ర‌వి, స‌షా ఛెట్రి, కార్తిక్‌రాజు, నిత్యాన‌రేష్‌, పార్వ‌తీశం ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ప్ర‌తిభా అడివి, క‌ట్టా ఆశిష్‌రెడ్డి, కేశ‌వ్ ఉమా స్వ‌రూప్‌, ప‌ద్మ‌నాభ‌రెడ్డి, గ్యారీ బీహెచ్‌, స‌తీష్ డేగ‌ల‌తో పాటు న‌టీన‌టులు,సాంకేతిక నిపుణులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజ‌ర్‌ను మ‌హేష్‌బాబు విడుద‌ల‌ చేశారు.
ఈ సంద‌ర్భంగా సోమ‌వారం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో ఏర్పాటు చేసిన సమావేశం లో ద‌ర్శ‌కుడు అడివి సాయికిర‌ణ్ మాట్లాడుతూ - క్రాస్ జోన‌ర్‌లో యాక్ష‌న్, రొమాంటిక్ కామెడీ అంశాల‌ను మేళ‌వించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. భార‌తీయ తెర‌పై ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ ఈ క‌థ‌ను ట‌చ్ చేయ‌లేదు. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు అంద‌రూ క‌లిసి నిర్మించిన చిత్ర‌మిది. ఎన్ ఎస్‌జీ క‌మాండో పాత్ర‌కు ఆదిసాయికుమార్‌ను అనుకున్న‌ప్పుడు ఆ పాత్ర‌కు డ్యాన్సులు ఉండ‌వు కాబ‌ట్టి అత‌డు చేస్తాడో లేదో అని కంగారుప‌డ్డాను. క‌థ విని న‌టుడిగా నాకు చాలా కొత్త‌గా ఉంటుంద‌ని వెంట‌నే అంగీక‌రించారు. ఈ చిత్ర నిర్మాణంలో ప‌ద్మ‌నాభ‌రెడ్డి, సురేష్ అద్భుత‌మైన స‌హ‌కారాన్ని అందించారు అని తెలిపారు.
ఆది సాయికుమార్ మాట్లాడుతూ - ద‌ర్శ‌కుడు సాయికిర‌ణ్ టైటిల్ చెప్ప‌గానే ఆస‌క్తిక‌రంగా అనిపించింది. కానీ ల‌వ‌ర్‌బాయ్ పాత్ర‌లు చేసిన నాకు ఎన్ ఎస్‌జీ క‌మాండో లుక్ సెట్ అవుతుందో లేదో అనిపించింది. నాన్న ఈ త‌ర‌హా పాత్ర‌లు చాలా చేశారు. ఆయ‌న క‌థ విని నాకు ఈ పాత్ర బాగుంటుంద‌ని చెప్పారు. లుక్ టెస్ట్ చేయ‌గానే ధైర్యం వ‌చ్చింది. ఈ పాత్ర నాకు స‌రిపోతుంద‌ని అస్స‌లు ఊహించ‌లేదు. నా పాత్ర‌కు హీరోయిన్‌, పాట‌లు ఏవీ ఉండ‌వు. క‌శ్మీర్ పండిట్‌ కుటుంబంలో పుట్టిన కుర్రాడిగా క‌నిపిస్తాను. య‌థార్థ అంశాల స్ఫూర్తితో నిజాయితీగా ఈ సినిమా చేశాం. న‌వ్య‌మైన క‌థాంశాల‌తో తెర‌కెక్కిన చిత్రాల్ని ప్రేక్ష‌కులు విజ‌య‌వంతం చేస్తున్నారు. మా సినిమాను ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది. 1980 నాటి కాలంలో క‌శ్మీర్ పండిట్ కుటుంబాల‌కు జ‌రిగిన అన్యాయాన్ని చ‌ర్చిస్తూ ఈ సినిమా చేశాం. ఇటీవ‌ల అలాంటి ఘ‌ట‌న‌లే మ‌ళ్లీ క‌శ్మీర్‌లో జ‌ర‌గ‌డం బాధ‌ను క‌లిగించింది అని అన్నారు
నిత్యాన‌రేష్ మాట్లాడుతూ - చ‌క్క‌టి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. యాక్ష‌న్‌, స‌స్పెన్స్‌, రొమాంటిక్ కామెడీ హంగుల‌తో రెండు క‌థ‌లను జోడించి ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. మా నాన్న‌గారు ఆర్మీలో ప‌నిచేశారు. అందుకే నా హృద‌యానికి ఈ చిత్రం చాలా ద‌గ్గ‌రైంది. కేరింత సినిమాతో ద‌ర్శ‌కుడు సాయికిర‌ణ్ న‌న్ను చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌యం చేశారు. ఈ సినిమాలో నా కోసం ఆయ‌న మంచి పాత్ర‌ను సృష్టించారు అని తెలిపింది
కార్తిక్‌రాజు మాట్లాడుతూ - టీమ్ ఎఫెర్ట్‌కు నిద‌ర్శ‌న‌మిది. సాయికిర‌ణ్‌ను ప‌నిరాక్ష‌సుడు అంటారు. రోజుల‌కు 22 గంట‌లు ఈ సినిమా కోసం ప‌నిచేశారు. ప్రాణంపెట్టి సినిమా చేశారు. ఈ సినిమాతో కొత్త ఆదిసాయికుమార్‌ను చూస్తారు. ల‌వ్‌లీ స్టార్‌ను యాక్ష‌న్ స్టార్‌గా ఈ సినిమా ఆవిష్క‌రిస్తుంది. పార్వ‌తీశం మాట్లాడుతూ సాయికిర‌ణ్ అడ‌వి ఏ సినిమా చేసినా నాకో మంచి పాత్ర‌ను ఇస్తుంటారు. చాలా క‌ష్ట‌ప‌డి ఈ సినిమా చేశాం అని తెలిపారు.
నిర్మాత‌ల్లో ఒక‌రైన ప‌ద్మ‌నాభ‌రెడ్డి మాట్లాడుతూ - ప‌దిమందితో క‌లిసి బ‌త‌క‌డం నాకు ఇష్టం. అలాంటి ల‌క్ష‌ణాలున్న మ‌నిషి అడివి సాయికిర‌ణ్‌. కెమెరామెన్ జైపాల్‌రెడ్డి ద్వారా ప‌రిచ‌యం అయ్యారు. నిర్మాత‌ను కూడా సాంకేతిక నిపుణుడిగా భావించి ఈసినిమా చేశారు. వంద‌శాతం విజ‌యాన్ని సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది.
సంగీత ద‌ర్శ‌కుడు శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల మాట్లాడుతూ - ఇంటెన్స్ ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్ర‌మిది. నాలుగు పాట‌లుంటాయి. క్ష‌ణం, గ‌రుడ‌వేగ‌, గూఢ‌చారి త‌ర్వాత నాకు మంచి పేరును తెచ్చిపెడుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది అని తెలిపారు.
అబ్బూరి ర‌వి మాట్లాడుతూ - ద‌ర్శ‌కుడిగా సాయికిర‌ణ్ త‌న పంథాను మార్చి చేస్తున్న సినిమా ఇది. అత‌డి గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా ఉంటుంది. క‌థ విని నోట మాట రాలేదు. సాయి ఇలాంటి సినిమా చేస్తాడ‌ని ఊహించ‌లేదు. సాయికిర‌ణ్ డ‌బ్బు సంపాదించ‌క‌పోవ‌చ్చు కానీ మంచి మ‌నుషుల్ని సంపాదించుకున్నాడు. హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డిన క‌శ్మీర్ పండిట్ కుటుంబాల్ని క‌లుసుకొని వారి బాధ‌ల‌ను స్వ‌యంగా తెలుసుకొని సాయికిర‌ణ్ ఈ క‌థ‌ను రాసుకున్నారు. అలాగే ఈ సినిమా కోసం క‌శ్మీర్ స‌మ‌స్య‌ల ప‌ట్ల అవ‌గాహ‌న ఉన్న వారంద‌రిని క‌లుసుకున్నారు. పండిట్ కుటుంబాలు ప‌డే బాధ‌ల్ని వారి భావోద్వేగాల్ని ఈ సినిమాలో స‌హ‌జంగా చూపించారు. న‌టించ‌డం నాకు రాదు. క‌ష్ట‌ప‌డి న‌న్ను భ‌రిస్తూ ఈ సినిమా చేయించుకున్నారు అని తెలిపారు.
ఈ కార్య‌క్ర‌మంలో గ్యారీ బీహెచ్, సురేష్‌, రామ‌కృష్ణ‌, జైపాల్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.
మనోజ్‌ నందం, రావు రమేష్‌, అనీష్‌ కురువిల్లా, కృష్ణుడు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జైపాల్‌రెడ్డి, ఆర్ట్‌: జె.కె.మూర్తి, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, ఎడిటింగ్‌: గ్యారీ బీహెచ్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: కీర్తి సిరికొండ, యాక్షన్‌: రామకృష్ణ, సుబ్బు, నభా, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, పబ్లిసిటీ డిజైనర్‌: అనిల్‌ భాను, కో.ప్రొడ్యూసర్‌: దాయోధర్‌ యాదవ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిరణ్‌రెడ్డి తుమ్మ, పి.ఆర్‌.ఓ: నాయుడు-ఫణి.

 

Mahesh Babu unveils 'Operation Gold Fish' Teaser


The Teaser for 'Operation Gold Fish' was on Monday unveiled by Superstar Mahesh Babu, marking Maha Shivratri. An event was held at Prasad Lab in Hyderabad to celebrate the occasion. It was graced by the film's cast and crew members.


Speaking on the occasion, director Adivi Saikiran said, "Our film is a cross-genre entertainer. It is a rom-com as well as an action flick. It touches upon the eviction of Kashmiri Pandits (in the late 1980s) from Kashmir. We have made this film on a never-before-attempted business model. All the technicians and artists of the film are its producers. When I went to Aadi Saikumar with the script, I was not sure if he would agree to do the role of NSG commando Arjun Pandit. His role has got no songs and is only into action in the film. However, he warmed up to the role as he felt it's fresh. Sai Kumar garu (Aadi's father and senior actor) also felt that the script offers a big span. It was great working with the heroines Sasha Chettri and Nithya Naresh, the male leads Karthik Raju and Parvatheesam. Music director Sricharan Pakala started out with 'KISS' and has since gone on to work on films like 'Kshanam' and 'PSV Garuda Vega'. He is a specialist when it comes to RR. As for action sequences, I myself was surprised on watching them. All credit goes to stunt master Ramakrishna. I thank Padmanabha Reddy garu for the finances. Cinematographer Jayapal's on-screen translation of my vision is wonderful. It was great working with editor Garry who edited 'Kshanam' after learning the technique in just 2 weeks. I thank every artist who has worked on the film. It took me three months to impress upon Abburi Ravi garu to play the role of Ghaji Baba in the movie. I have been associated with Usha Pictures' Eluru Suresh since the days of 'Vinayakudu'. He told me beforehand that 'OGF' will cost more than expected."


Aadi Saikumar said, "Operation Gold Fish is such an interesting title. I initially had my doubts about whether I can play the role of an NSG commando. All along, I had played only lover boy's roles. Fitness is never an issue to me as I have always taken care to be fit. But playing an intense role is something else. It's when my father felt that I will definitely fit the bill. He himself has essayed patriotic cop roles in films such as 'Police Story'. Once my hair stylist Ram readied me, I was sure that I can do the role of the NSG commando. We have made this honest film on the basis of real incidents. The visuals are stunning. The BGM can give you goosebumps. It was great working with everyone."


Abburi Ravi said, "I have played the role of Ghaji Baba in the film. The entire credit goes to the director. He has changed his track with 'OGF' after making films like 'Vinayakudu', 'Village Lo Vinayakudu' and 'Kerintha'. When I listened to the story, I was speechless. Saikiran may not have earned money after all these years of being in the industry but he has definitely earned people. In writing the film, we have spoken to members of the Kashmiri society, PMO's advisory members, and journalist Suresh Kochattil garu. We have read Rahul Pandita's book, and interacted with nine Kashmiri Pandit families in Hyderabad to directly know their pain. Not the entire film is about Kashmiri Pandits. But we did extensive research to represent their sensibilities in the film accurately. I thank Rana Daggubati garu for releasing the First Look, Trivikram Srinivas for releasing my character's look, and Mahesh Babu garu for releasing the teaser."


Nithya Naresh said, "I would say that 'OGF' is a family entertainer as there is something for everyone. It's a rom-com, an actioner as well as a suspense thriller. How they have been woven and meet at a point is the crux. Since my daddy comes from a Navy background, this film will always be close to my heart. It's an inspiring film for sure. The trend these days for military movies is to inspire patriotism in us. I am glad to have teamed up with the director once again after my debut film 'Kerintha'. It was such fun working with everyone. Sasha is a wonderful co-star. I have loved the RR of this movie. I thank the cinematographer for making us look so beautiful. The character that I have played in 'OGF' is 75 percent like the real me. She is bubbly, fun-loving and enthusiastic."


Karthik Raju said, "This film happened pretty fast for me. I have worked with many directors but have never come across a director like Adivi Saikiran garu. He works relentlessly, even up to 22 hours a day, to give the best. The four songs in the movie are simply amazing. If this product has come out this well, it's only because of the hard working direction department."


Parvatheesam said, "The film has come out really well. I have got to play a very good character in 'OGF' and I hope to play many more such characters in future as well."


Sricharan Pakala said, "It has been a nice journey. 'OGF' also has a love story. There are four songs in the movie. I thank the director for the opportunity. The direction department has worked hard 24/7 to deliver the best."
Fight master Ramakrishna said, "It was great working on the movie. It is going to be a hit film for sure."


One of the producers Padmanabha Reddy said, "It was always my dream to work in collaboration with people like these. When I met Saikiran, it was like my dream coming true. I have always liked the idea of a producer being a technician. I got to be one for this movie. I never had to ask questions of the director."Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !