filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz

View

'ఎంతవారలైనా' టీజర్ లాంఛ్ విశేషాలు

Tuesday,March05th,2019, 01:20 PM

రామదూత ఆర్ట్స్‌ పతాకంపై గురు చిందేపల్లి దర్శకత్వంలో జి.సీతారెడ్డి నిర్మిస్తున్న థ్రిల్లింగ్‌ హారర్‌ మూవీ 'ఎంతవారలైనా'. ఈ చిత్రంలో అద్వైత్‌, జహీదా శ్యామ్‌, అలోక్‌ జైన్‌, సీతారెడ్డి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను మంగళవారం హైదరాబాద్‌ గోల్డెన్‌ పార్క్‌ హోటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హంజాద్‌ విడుదలచేశారు. ఈ సందర్భంగా...


నిర్మాత జి. సీతారెడ్డి మాట్లాడుతూ - ''దర్శకుడు గురు చిందేపల్లి నా క్లాస్‌ మేట్‌, చిరకాల మిత్రుడు. సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో నిర్మాతనయ్యాను. గురు చిందేపల్లి చెప్పిన కథ ఎంతో నచ్చి ఈ సినిమాను చేశాం. ఈ సృష్టిలో మంచి చెడు రెండు మార్గాలు ఉంటాయి. అయితే చెడు మార్గాన్ని ఎంచుకుంటే ఎలాంటి పరిణామాల్ని అనుభవించాల్సి ఉంటుందో ఈ సినిమా చూపించాం. ఇది న్యూ జనరేషన్‌ హారర్‌ మూవీ. క్లైమాక్స్‌లో వచ్చే 20 నిమిషాలు సినిమాకే హైలెట్‌. గురుచిందేపల్లి నాకు 1-54 నిమిషాల కథను చెప్పి అదే విధంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా హైదరాబాద్‌, మైసూర్‌, బెంగళూరు, చిక్‌మంగళూరులోని అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం. ప్రతి ఆర్టిస్టు, టెక్నీషియన్స్‌ నాకు చాలా సహకారాన్ని అందించారు. నాకు కూడా చిన్నప్పటి నుండి నటనపై ఆసక్తి ఉండడంతో డైరెక్టర్‌ ఈ సినిమాలో నాతో ఎస్‌.పి క్యారెక్టర్‌ చేయించారు. నాకు నిర్మాతగా రామానాయుడుగారు, నటుడిగా ఎస్‌ వి రంగారావుగారు స్ఫూర్తి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్నమా సినిమాను ఏప్రిల్‌లో కన్నడ, తెలుగు భాషల్లో విడుదలచేయబోతున్నాం'' అన్నారు.


దర్శకుడు గురు చిందేపల్లి మాట్లాడుతూ - ''ఎంతవారలైనా కాంత దాసులు కావచ్చు, కనకదాసులు కావచ్చు. కానీ, తప్పు చేసినప్పుడు ఎంతవారలైనా కూడా కచ్చితంగా శిక్షార్హులే.. అనే పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి మా ప్రొడ్యూసర్‌ సీతారెడ్డి గారే కారణం. అలాగే ఈ సినిమాకు మ్యూజిక్‌ సుక్కు. మూడు పాటలు చాలా బాగా వచ్చాయి. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా బాగుంది. ముఖ్యంగా మా డి.ఓ.పి మురళి మోహన్‌ రెడ్డిగారి సహకారం మరువలేనిది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌, టెక్నీషియన్స్‌ ఎంతో కష్టపడి పనిచేశారు. సినిమా ఏప్రిల్‌లో విడుదల కాబోతుంది తప్పకుండా చూసి ఆదరించండి'' అన్నారు.


గోల్డెన్‌ పార్క్‌ హోటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హంజాద్‌ మాట్లాడుతూ - '' సీతా రెడ్డి , గురు చిందేపల్లి నా ప్రాణ మిత్రులు వారిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న 'ఎంతవారలైనా' మూవీ తప్పకుండా విజయం సాధించాలి'' అన్నారు.


అద్వైత్‌, జహీదా శ్యామ్‌, అలోక్‌ జైన్‌, సీతారెడ్డి, స్వప్న, అలీషా, అభిలాష్‌, మాస్టర్‌ అయాన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుక్కు, ఫోటోగ్రఫీ: ఎస్‌.మురళీమోహన్‌రెడ్డి, ఎడిటింగ్‌: వి.నాగిరెడ్డి, ఆర్ట్‌: బాబ్జీ, స్టిల్స్‌: ఈశ్వర్‌, నిర్మాత: జి.సీతారెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: గురు చిందేపల్లి


Teaser Of Thrilling Horror Flick 'Enthavaralaina' Directed By Guru Chindepalli In G.Seetha Reddy's Production Launched


G.Seetha Reddy is Producing a Thrilling Horror Film titled 'Yenthavaralaina' in Guru Chindepalli 's Direction under his banner Ramadutha Arts. Adwaith, Jaheeda Shyam, Alok Jain, Seetha Reddy played important roles in the film. Teaser of the film was unveiled by Hamzad, MD of Goldenpark Hotel on Tuesday (March 5th). On this occasion,


Producer G.Seetha Reddy says, " Director Guru Chindepalli was my classmate and longtime friend. I became producer due to my passion towards the cinema. There are two ways in this world, good and bad. We showed the consequences faced by people going in bad way. This is new generation horror movie. Final 20 minutes stands as a major highlight in the film. Guru Chindepalli narrated me a story of 1 hour 54 mins and he made the film exactly the way he narrated. We shot this film in scenic locations of Hyderabad, Bengaluru, Mysore, Chikmagalur. Knowing my interest for acting, Director encouraged me to do the role of SP in this film. As a Producer Ramanaidu Garu, As an Actor SV Ranga Rao Garu are my inspiration. We release the film in April in Telugu and Kannada languages."


Director Guru Chindepalli says, " 'Yenthavaralaina' deals with the point everyone who committed a crime are bound to be punished. This is being made as a Horror Thriller. Our Producer Seetha Reddy Garu is the main reason for the fantastic output of the film. Music and Background Music is composed by Sukku . 3 songs came out very well. I thank DOP Muralimohan Reddy garu for his support. Every artist and technician worked very hard. Film is releasing in April. I request everyone to watch and support our film."


Golden Park Hotel Managing Director Hamzad says, " Producer G.Seetha Reddy, Director Guru Chindepalli are my close friends. I wish their film 'Yenthavaralaina' to become a huge success."


Principle Cast involves Advaith, Jaheeda Shyam, Alok Jain, Seetha Reddy, Swapna, Alisha, Abhilash, Master Ayaan
Music:Sukku, Cinematography:S.Muralimohan Reddy, Editing:V.Nagi Reddy, Art:Babji, Stills:Eeswar, Producer : G.Seetha Reddy, Story, Screenplay, Dialogues, Direction : Guru ChindepalliAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !