View

'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' స్థాయిని పెంచిన కీరవాణి పాట

Friday,March08th,2019, 01:35 PM

ప్రచార చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుని, సినిమాపై ఆసక్తిని పెంచిన సినిమా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'. ఆది సాయికుమార్ కథానాయకుడిగా, రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రచార చిత్రాలు ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. వాటికి విశేష స్పందన లభిస్తోంది.


ఈ సినిమా ఫస్ట్ లుక్ ను దగ్గుబాటి రానా విడుదల చేయగా... ఈ సినిమాతో నటుడిగా పరిచయం అవుతున్న అబ్బూరి రవి లుక్ ను ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్... సినిమా టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇంత మంది ప్రముఖుల మద్దతు ఇవ్వడంతో చిత్రానికి అదనపు బలం చేకూరింది.
ఎన్.ఎస్.జి కమాండోగా ఆది సాయికుమార్ లుక్, ఘాజీ బాబా పాత్రలో అబ్బూరి రవి ఆహార్యం ప్రచార చిత్రాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఏంటంటే... ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి గారు పాడిన పాట. సినిమాలో ఓ పాటను ఆయన ఆలపించారు.


ఈ సందర్భంగా సాయికిరణ్ అడివి మాట్లాడుతూ "ఈ పాట చిత్రంలోని కీలక సన్నివేశంలో వస్తుంది. చిత్రాన్ని ఇంకొక స్థాయికి తీసుకువెళ్ళింది. సినిమా స్థాయి పెరిగింది. ఈ పాటకు రామజోగ్గయ్య శాస్త్రి గారు అద్భుతమైన, విలువలతో కూడిన సాహిత్యాన్ని అందించారు. దేశభక్తిని పెంచే ఒక గేయాన్ని పెద్ద సింగర్ పాడాలి అనుకుని కీరవాణి గారిని అడగడం జరిగింది. ఆయన అడిగిన వెంటనే కాదు అనకుండా ఈ పాట పాడడానికి ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు" అన్నారు.


సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ "పాట చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు అందరినీ భావోద్వేగానికి గురి చేసే పాట ఇది. రామజోగయ్యశాస్త్రి గారు లిరిక్స్ చాలా బాగా ఇచ్చారు. కీరవాణి గారు మా విన్నపాన్ని మన్నించి పాడారు. ఆయనకు థాంక్స్. ఆయన పాడటంతో పాట స్థాయి పెరిగింది. ఈ పాట నుంచి సినిమా కొత్త మలుపు తీసుకుంటుంది. జనాన్ని ఆలోచింపచేస్తుంది. ఈ పాటలో ఒక సందేశం ఉంటుంది. కీరవాణి గారు పాట విని... 'చాలా బాగుంది, చేద్దాం' అన్నారు. ఆయన సంగీతం వింటూ పెరిగాను. నా సంగీతంలో ఆయన పాట పాడడం, పాటను మెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. థాంక్స్ టు కీరవాణి గారు. కీరవాణి గారి గానం పాటకి ఇంకా బలాన్ని చేకూర్చింది" అన్నారు.


చిత్ర బృందం మాట్లాడుతూ "అడిగిన వెంటనే కాదు అనకుండా పాట పాడడానికి అంగీకరించిన కీరవాణి గారికి ధన్యవాదాలు తెలుపుతూ పాటని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము" అని తెలిపింది.


ఈ చిత్రం లో ఆది సాయికుమార్, అబ్బూరి రవి, శషా చెత్త్రి , నిత్యా నరేష్, కేరింత నూకరాజు, కార్తీక్ రాజు, మనోజ్ నందం, కృష్ణుడు, అనీష్ కురువిళ్ళ, రావు రమేష్, RJ హేమంత్ ముఖ్య పాత్రలలో నటించారు.


ఈ చిత్రానికి ఫైట్స్ : రామకృష్ణ, సుబ్బు రాబిన్ - నాబా. లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి, ఆర్ట్ : JK మూర్తి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిరణ్ రెడ్డి తుమ్మ, ఎడిటర్ : గ్యారీ BH , సంగీతం : శ్రీచరణ్ పాకాల, DOP : జయపాల్ రెడ్డి, script డిజైన్ : అబ్బూరి రవి, పి.ఆర్.ఓ : నాయుడు - ఫణి, కో - ప్రొడ్యూసర్ : దామోదర్ యాదవ్ (వైజాగ్), ప్రొడ్యూసర్ : ప్రతిభ అడివి, కట్టా ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ BH, సతీష్ డేగల, Artists & Technicians, కధ, కధనం, దర్శకత్వం : సాయికిరణ్ అడివి.


Keeravani's song has raised 'Operation Gold Fish' to a new high: Adivi Saikiran


'Operation Gold Fish' continues to impress the audience with its promotional videos. Directed by Adivi Saikiran, the film stars Aadi Saikumar as the hero and writer Abburi Ravi as the antagonist. The film's teaser, we all know, was out recently. And it has become a big hit with the audience.


The film's First Look was released by Rana Daggubati, while Abburi Ravi's look was unveiled by the respected filmmaker Trivikram Srinivas. None other than Superstar Mahesh Babu unveiled the teaser. With these big names supporting 'OGF', the film has definitely acquired greater strength. Aadi Saikumar's convincing NSG commando's look, and Abburi Ravi as terrorist Ghazi Baba, have been special attractions.


What is distinct is that prominent music director MM Keeravani garu has sung a song in the movie. Talking about it, Adivi Saikiran says, "This particular song comes at a crucial juncture in the movie and has the capacity to take the film to the next level. Ramajogayya Sastry garu has written amazing lyrics that are high on patriotic values. Since it's a patriotic number, we were particular that only a big singer should sing it. And Keeravani garu was the apt choice. We thank him for agreeing to sing the song."


Music director Sricharan Pakala says, "This is the kind of song that can inspire emotions in the listener. The lyrics are wonderful. We are thankful to Keeravani garu for rendering it. With him on board, the song is all the more valuable.

It's a thought-provoking number that has got a message. I grew up listening to Keeravani garu's music. And it's an honour that he has crooned my song."

The entire cast and crew of the film have expressed their happiness over Keeravani crooning the number.


Cast & Crew:
Aadi Saikumar is playing the role of NSG commando Arjun Pandit. Airtel 4G model Sasha Chettri, Karthik Raju, Parvateesham, Nithya Naresh, Manoj Nandam, Krishnudu, Anish Kuruvilla, Rao Ramesh and Ramajogayya Sastry are playing key roles. Abburi Ravi is the antagonist.


Music is by Sricharan Pakala of 'Kshanam', 'PSV Garuda Vega' and 'Goodachari' fame. Cinematography is by Jaipal Reddy Nimmala. Editing is by BH Garry. Fights are by Ramakrishna and Subbu-Nabha duo. Lyrics are by Ramajogayya Sastry. Art direction is by Moorthy. Costumes are by Keerthi.


Script Designing is by Abburi Ravi. Story, screenplay and direction are by Adivi Saikiran.


Produced by Pratibha Adivi, Katta Asish Reddy, Keshav Uma Swaroop, Padmanabha Reddy, Garry BH, Satish Degala, the film's other artists and technicians. Co-producers are Damodar Yadav (Vizag), and Executive Producer is Kiran Reddy Tumma. The promising film is being made with a new business model where artists and technicians are partnering as fellow producers.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !