View

ఎక్స్‌క్యూజ్ మీ రాక్షసి... అంటోన్న సిద్ధార్థ్!

Saturday,March09th,2019, 04:20 PM

తెలుగు ప్రేక్షకులకు సిద్ధార్థ్ పేరు చెబితే... 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు', 'ఆట', 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సినిమాలు గుర్తొస్తాయి. సిద్ధార్థ్ నటుడిగా మాత్రమే కాదు... గాయకుడిగానూ తెలుగు ప్రేక్షకులను అలరించారు. 'బొమ్మరిల్లు'లో 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో...', 'ఓయ్' సినిమాలో '176 బీచ్ హౌస్ లో ప్రేమదేవత', 'ఆట' సినిమాలో 'నిన్ను చూస్తుంటే' పాటలను పాడింది సిద్ధార్థే. చాలా రోజుల తరవాత ఈ హీరో మరో తెలుగు పాట పాడారు. ఆయన కోసం కాదు. సందీప్ కిషన్ కోసం!


సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా 'నిను వీడని నీడను నేనే'. అన్యా సింగ్ హీరోయిన్. కార్తీక్ రాజు దర్శకుడు. ఏకే ఎంట్టైన్మెంట్స్ ప...తాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్ 'ఎక్స్‌క్యూజ్ మీ రాక్షసి ...'ను సిద్ధార్థ్ పాడారు. ఇటీవల సాంగ్ రికార్డింగ్ పూర్తయింది. ఈ పాటకు సామ్రాట్ సాహిత్యం అందించారు.


ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ "తెలుగులో పాట పాడటం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. ప్రపంచంలోని మధురమైన భాషల్లో తెలుగు ఒకటి. సంగీతంలో తెలుగు భాష మరింత తీయగా ఉంటుంది. న‌టుడిగా నాకు గుర్తింపు, గౌర‌వం, స్టార్‌డమ్‌నీ ఇచ్చింది తెలుగు సినిమాయే. తెలుగు ప‌రిశ్ర‌మ‌ అంటే నాకు ప్ర‌త్యేక అభిమానం ఉంది. తెలుగు ప్రేక్షకులతో ప్రత్యేక అనుబంధం ఉంది. తెలుగును నేనెప్పుడూ మరచిపోను. నేను ఈ పాట పాడటానికి ఒక్కటే కారణం. నాకు సందీప్ కిషన్ అంటే చాలా ఇష్టం. వ్యక్తిగా... నటుడిగా. తను నాకు తమ్ముడి లాంటి వాడు. తను ఫస్ట్ టైమ్ నిర్మాతగా చేస్తున్నాడు. నిర్మాతగా తన తొలి సినిమాలో నన్ను పాడమని అడిగాడు. తన కోసం నేను పాట పాడాను" అన్నారు.


సందీప్ కిషన్ మాట్లాడుతూ "నాకు సిద్ధార్థ్ అంటే చాలా ఇష్టం. హీరోగా నా తొలి రోజుల్లో చాలా సపోర్ట్ చేశాడు. నేను ఫస్ట్ టైమ్ ప్రొడక్షన్ చేస్తున్న సినిమాలో తను ఏదో రకంగా అసోసియేట్ అయితే బావుంటుందని అనిపించింది. అలాగే, సిద్ధార్థ్ వాయిస్ కి, తను పాడిన పాటలకు నేను పెద్ద అభిమానిని. 'అప్పుడో ఇప్పుడో..' పాటకు, '176 బీచ్ హౌస్ లో పాటకు నేను పెద్ద అభిమానిని. నిర్మాతగా నా మొదటి సినిమాలో సిద్ధార్థ్ గొంతులో నా పాట రావడం అనేది చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. ఇదొక ఫన్, హై ఎనర్జిటిక్ సాంగ్. నటుడిగా నాకు మొదటి నుంచి ఎవరెవరు అయితే అండగా నిలిచారో.. వారందరూ ఏదో రకంగా చిన్న భాగంగా అయినా ఉండాలని కోరుకున్నాను. అది ఇలా అయినందుకు సంతోషంగా ఉంది" అన్నారు.


సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ మాట్లాడుతూ "సిద్ధార్థ్ హీరోగా నటించి, నిర్మించిన తొలి సినిమా 'లవ్ ఫెయిల్యూర్'కి... సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మాతగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి నేను సంగీత దర్శకుడు కావడం యాదృచ్చికమే. నాకు ఇది సంతోషంగా ఉంది. ఇద్దరూ నాకు మంచి స్నేహితులు" అన్నారు.


పాట రచయిత సామ్రాట్ మాట్లాడుతూ "ఈ లిరిక్స్ రాసేటప్పుడు ఈ పాట సిద్ధార్థ్ గారు పాడితే ఎలా ఉంటుంది?' అని ఆలోచిస్తూ, ఆయన్ను మనసులో పెట్టుకుని రాశాడు. ఏయే తెలుగు పదాలు ఆయన వాయిస్ లో బావుంటాయని ఆలోచించి రాశా. ఇప్పటివరకూ సిద్ధార్థ్ పాడిన ప్రతి తెలుగు పాట బ్లాక్ బస్టర్. ఈ పాట కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నా" అన్నారు.


పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, పూర్ణిమ భగ్యరాజ్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు - ఫణి, సంగీతం: ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహణం: ప్రమోద్ వర్మ, ఎడిటింగ్: కేఎల్ ప్రవీణ్, ఆర్ట్ డైరెక్టర్: విదేష్, ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ చెర్రీ, సీతారామ్, కిరుబాక‌ర‌న్‌, నిర్మాతలు: దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్, దర్శకుడు: కార్తీక్ రాజు.


Siddharth sings 'Excuse Me Rakshasi' for Sundeep Kishan


Mention Siddharth's name and the Telugu audience are sure to remember 'Bommarillu', 'Nuvvostananate Nenoddantana', 'Aata', 'Konchem Ishtam Konchem Kashtam' and other films. And he has entertained the audience not just as an actor but also as a singer. 'Appudo Ippudo' from 'Bommarillu', '176 Beach House Lo Prema Devatha' from 'Oye', 'Ninnu Choostunte' from 'Aata' are popular.


And, now, Siddharth has rendered a Telugu song after many years. This time, it's for Sundeep Kishan. It's for a song in the film 'Ninu Veedani Needanu Nenu'. Sundeep Kishan is producing this novel movie on Venkatadri Talkies (Production No. 1) in association with Vista Dream Merchants. Directed by Caarthick Raaju, the actor is paired up with Anya Singh in this entertainer.


SS Thaman has composed the romantic song titled 'Excuse Me Rakshasi'. Sid completed recording for the song only recently. Samrat has written the awesome number.


Speaking about the number, Siddharth says, "I always feel happy to sing a Telugu song. Telugu is one of the sweetest languages. When it is coupled with music, it becomes even sweeter. It's Telugu cinema that has given me recognition, respect and stardom as an actor. I have always shared a special relationship with the Telugu audience. I can't forget Telugu. The one reason I have rendered this song in 'NVNN' is my friend Sundeep Kishan. He is like a younger brother to me. He is producing a film for the first time and I wanted to sing a song for his first film."


Sundeep Kishan said, "I like Siddharth a lot. During my struggling days as an actor, he was of great support. I felt that he should be associated with my first production venture in some or the other way. Also, I have always been a big fan of his voice and songs. I especially love his songs from 'Bommarillu' and 'Oye'. It's exciting to have his voice for a song in my maiden production venture. 'Excuse Me Rakshasi' is high on fun and energy. I have wanted to engage all those who have supported me over the years. I am glad that it has become a reality."


Music director SS Thaman said, "I am happy to have composed the music for Siddharth's first film as producer, 'Love Failure'. And I am happy to have done it for Sundeep Kishan's first film as a producer. They both are good friends of mine and they are the heroes of their respective movies."


Lyricist Samrat said, "I have written the song keeping Siddharth's voice in mind. I chose only those words that would sound the best in his voice. All the songs that Siddharth has rendered in Telugu were blockbusters. And 'Excuse Me Rakshasi' too will be a blockbuster."


Posani Krishna Murali, Murali Sharma, Vennela Kishore, Poornima Bhagyaraj, Pragathi and others are part of the cast.
Music is by SS Thaman, cinematography is by Pramod Varma, editing is by KL Praveen (National Award winner), and art direction is by Videsh. Executive Producers are Siva Cherry, Seetharam and Kirubakaran. PRO: Naidu - Phani (Beyond Media)



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !