filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz

View

నందమూరి హీరో చేతుల మీదుగా విడుదలైన 'ఎదురీత' టీజర్

Thursday,March14th,2019, 01:59 PM

'సై', 'దూకుడు', 'శ్రీమంతుడు', 'బిందాస్', 'మగధీర', 'ఏక్ నిరంజన్' సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించిన శ్రవణ్ రాఘవేంద్ర కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా 'ఎదురీత'. శ్రీ భాగ్యలక్ష్మి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్నారు. బాలమురుగన్ దర్శకుడు. లియోనా లిషోయ్ కథానాయిక. అరల్ కొరెల్లి సంగీత దర్శకుడు. డా. చల్లా భాగ్యలక్ష్మి, శ్రేష్ఠ, రోల్ రిడా, విశ్వ, స్వామి పాటల రచయితలు. ఈ సినిమా టీజర్ ను గురువారం ఉదయం నందమూరి కల్యాణ్ రామ్ విడుదల చేశారు. త్వరలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా సినిమా ఆడియో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...

 
శ్రవణ్ రాఘవేంద్ర మాట్లాడుతూ "మేం అడగ్గానే మా టీజర్ విడుదల చేసిన కల్యాణ్ రామ్ గారికి స్పెషల్ థాంక్స్. సినిమా విషయానికి వస్తే... టైటిల్ గురించి మా టీమ్ మధ్య డిస్కషన్స్ జరిగాయి. 'ఎదురీత' కన్ఫర్మ్ చేశాం. ఒకరోజు మా నాన్నగారు సినిమా గురించి అడుగుతూ 'టైటిల్ ఏంటి?' అని అడిగారు. 'ఎదురీత' అని చెప్పాను. అప్పుడు ఆయన 'ఎదురీత' సినిమా గురించి తెలుసా? ఆ టైటిల్ పవర్ తెలుసా? అని ప్రశ్నించారు. నందమూరి తారకరామారావు గారు 1977లో నటించిన 'ఎదురీత' గురించి చెప్పారు. ఇటీవల వస్తున్న చిన్న సినిమాలను మా నాన్నగారు చూస్తున్నారు. వీడు కూడా అలాగే డ్యాన్సులు, ఫైటులు చేస్తాడని అనుకున్నారేమో. అందువల్ల, నేను నాన్నకు కథ, సినిమా గురించి వివరించా. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ గారికి, ప్రేక్షకులకు చెబుతున్నా... 'ఎదురీత' టైటిల్ కు కచ్చితంగా న్యాయం చేస్తాం. ఓ తండ్రి, కుమారుడు మధ్య కథ సాగుతుంది. ఇదొక ఎమోషనల్ డ్రామా. రియల్ లైఫ్ లో నాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఈ సినిమా కథ వినక ముందు, సినిమా చేయక ముందు... నేను రెస్పాన్సిబుల్ ఫాదర్ అనుకున్నా. కాదని ఈ సినిమా చేస్తున్నప్పుడు తెలిసింది. రెస్పాన్సిబుల్ ఫాదర్ అంటే.. ఫీజులు కట్టడం, బట్టలు కొనడం, పిల్లల అవసరాలు చూడటం కాదు. పిల్లలతో మనం టైమ్ స్పెండ్ చేయాలి. ఈ బిజీ లైఫ్ లో రోజూ కుదరకపోయినా వీకెండ్ అయినా పిల్లలతో టైమ్ స్పెండ్ చేయాలి. వాళ్ళతో ఆదుకోవాలి. అప్పుడప్పుడూ వంట చేసిపెట్టాలి. పిల్లల పనులు తల్లి మాత్రమే కాదు.. తండ్రి కూడా చేయాలని తెలుసుకున్నా. ఇక, సినిమా కథ విషయానికి వస్తే... ఎంతగానో ప్రేమించే కొడుకును తండ్రి మర్చిపోతాడు. తరవాత ఏం జరిగిందనేదాన్ని దర్శకుడు చాలా ఎమోషనల్ గా చూపించారు. నన్ను సినిమా ఇండస్ట్రీకి కోడి రామకృష్ణగారు పరిచయం చేస్తే.. రాజమౌళిగారు 'సై' సినిమాతో బ్రేక్ ఇచ్చారు. రాజమౌళి గురించి మనకు తెలుసు... ప్రతి నిమిషం సినిమా గురించి ఆలోచిస్తారు. మా దర్శకుడు బాలమురుగన్ కూడా అంతే. మా నిర్మాత బోగారి లక్ష్మీనారాయణ గారి గురించి ఒక్కటే చెబుతా... నాకు ఫాదర్ తరవాత ఫాదర్ అంతటి వ్యక్తి. ఖర్చుకు వెనుకాడకుండా సినిమా నిర్మించారు. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడూ.. ఇంటికి వెళ్లి పిల్లలను గట్టిగా హత్తుకుంటారు. అంత బావుంది. సినిమాలో ఫైట్స్ ఎవరితో చేయించాలి? అని ఆలోచించా. నాకు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, విజయ్ మాస్టర్ క్లోజ్. అయితే వాళ్ళ డేట్స్ ఖాళీ లేవు. అప్పుడు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కి కథ చెబితే... మీ కథకు రామకృష్ణ మాస్టర్ మాత్రమే న్యాయం చేస్తారని చెప్పారు. వాళ్ళు ఎందుకు అలా చెప్పారో సినిమా చూస్తే తెలుస్తుంది. రత్నవేలుగారి దగ్గర పనిచేసిన విజయ్ మంచి సినిమాటోగ్రఫీ అందించారు. అరల్ కొరెల్లి మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా టీమ్ అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్" అన్నారు.


సినిమా నిర్మాత బోగారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ "ఈ సినిమాకు 'ఎదురీత' టైటిల్ నా గురించే పెట్టారేమో అని ఆలోచనలో పడ్డాను. ఎందుకంటే... నా జీవితమంతా ఎదురీతే. నేను నిర్మాత కాకముందు, సినిమా అంటే 200 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని చూడటమే అనుకునేవాణ్ణి. నిర్మాత అయ్యాక... టికెట్ రేటు 2000 రూపాయలు పెట్టినా తక్కువే అనిపిస్తోంది. సినిమా తీయడంలో ఉన్న కష్టం అర్థమైంది. ఈ సినిమా నిర్మించడానికి ముఖ్య కారణం శ్రవణ్. ఆయనది కూడా మా సిద్ధిపేట్. శ్రవణ్ ఫాదర్ మా ప్రొఫెసర్. మా హీరో ఎంతో సహకారం అందించడంతో సినిమాను ముందుకు తీసుకు వెళ్తున్నా. ఆయనకు రుణపడి ఉంటాను" అన్నారు.


దర్శకుడు బాలమురుగన్ మాట్లాడుతూ "నిర్మాత లక్ష్మినారాయణగారు కొత్త అయినా.. ఆయనకు ఇదే తొలి సినిమా అయినా... ఎక్కడా రాజీ పడకుండా సినిమా తీశారు. నేను అడిగినది ప్రతిదీ ఇచ్చారు. కథను, నన్ను నమ్మిన హీరో శ్రవణ్ కి థాంక్స్" అన్నారు.


లియోనా లిషోయ్ మాట్లాడుతూ "మా సినిమా టీజర్ విడుదల చేసిన నందమూరి కల్యాణ్ రామ్ గారికి థాంక్స్. ఫస్ట్ టైమ్ టీజర్ చూడగానే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. చాలా చాలా బావుంది. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ హార్ట్ అండ్ సోల్ పెట్టి పని చేశారు. నన్ను నమ్మి నాకు మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు బాలమురుగన్ గారికి స్పెషల్ థాంక్స్. అతడితో పని చేసేటప్పుడు నటిగా నా బలం గురించి, బలహీనత గురించి తెలుసుకున్నా. ఇక, మా హీరో శ్రవణ్ విషయానికి వస్తే.. మెంటల్లీ, ఫిజికల్లీ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇదొక ఎమోషనల్ ఫిల్మ్. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా" అన్నారు.
జియా శర్మ మాట్లాడుతూ "టోటల్ సినిమా టీమ్ అంతా చాలా సపోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్. నాకు ఒక మంచి రోల్ ఇచ్చిన దర్శకుడు బాలమురుగన్ గారికి స్పెషల్ థాంక్స్" అన్నారు.


శాన్వీ మేఘన మాట్లాడుతూ "40 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తిగా నటించడం, తరవాత యంగ్ క్యారెక్టర్ ప్లే చేయడం అంత ఈజీ కాదు. నటుడిగా శ్రవణ్ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు" అన్నారు.


నటుడు భద్రమ్ మాట్లాడుతూ "చేపల్లో పులస చాలా స్పెషల్. ఎంతో రుచిగా ఉంటుంది. రేటు కూడా ఎక్కువే. ఎందుకంటే... నీటి ప్రవాహానికి పులస ఎదురీదుతుంది. ఎదురీత వల్లే పులసకు స్పెషల్ టేస్ట్. జీవితంలో ప్రతి మనిషికీ ఎదురీత తప్పదు. అందుకని, మనుషులంతా గ్రేట్. అటువంటి ఓ మనిషి కథే ఈ సినిమా. కథాబలం ఉన్న సినిమా. ఇప్పటివరకూ ఎన్నో సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ చేసిన శ్రవణ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. మంచి బలమున్న కథను ఎంచుకోవడంలో ఆయన పరిణితి ఏంటో అర్థమవుతుంది. ఇప్పటివరకూ సినిమాల్లో కనిపించిన శ్రవణ్ వేరు.. ఈ సినిమాలో శ్రవణ్ వేరు. కొన్ని సన్నివేశాల్లో అతడి నటన కంటతడి పెట్టిస్తుంది. ఆయనలోని నటుడిని ఇప్పటివరకూ ఎవరూ వాడుకోలేదు. అలాగే, ఈ సినిమాలో శ్రవణ్ తిన్న దెబ్బలు ఏ సినిమాలోనూ తిని ఉండడు. అన్ని సినిమాల్లో కలుపుకున్నా అన్ని దెబ్బలు తిని ఉండడు. అతడి చేత దర్శకుడు బాగా చేయించుకున్నాడు. బాలమురుగన్ ని చూస్తే వీక్ గా ఉంటాడు. కానీ, స్ట్రాంగ్ టెక్నీషియన్. స్టార్ దర్శకుణ్ణి తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిచయం చేసిందని గొప్పగా చెప్పుకోవచ్చు" అన్నారు .


ఫైట్ మాస్టర్ రామకృష్ణ మాట్లాడుతూ "శ్రవణ్ గారు ఫస్ట్ టైమ్ హీరోగా చేస్తున్నారు. ఆయన క్యారెక్టరైజేషన్ చాలా బావుంది. సినిమాకు అదే ఇంపార్టెంట్. రెగ్యులర్ హీరో క్యారెక్టరైజేషన్ లా కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది. దర్శకుడు బలమురుగన్ గారితో పని చేయడం గర్వంగా, సంతోషంగా ఉంది. ఫైట్స్ చాలా బాగా వచ్చాయి" అన్నారు.


ఈ కార్యక్రమంలో మాస్టర్ చరణ్ రామ్, సినిమాటోగ్రాఫర్ విజయ్, ఎడిటర్ నగూరన్ రామచంద్రన్, రైటర్ ధనేష్ నెడుమారన్ తదితరులు పాల్గొన్నారు.
సంపత్ రాజ్, జియా శర్మ, శాన్వీ మేఘన, నోయెల్ సేన్, 30 ఇయర్స్ పృథ్వీ, 'రంగస్థలం' మహేష్, కాశి విశ్వనాథ్, రవిప్రకాష్, భద్రమ్, 'మాస్టర్' చరణ్ రామ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
ఛాయాగ్రహణం: విజయ్ ఆర్పుదరాజ్ (రత్నవేలు దగ్గర కుమారి21ఎఫ్, బ్రహ్మోత్సవం, లింగ చిత్రాలకు సహాయకుడిగా పనిచేశారు)
రచయిత: ధనేష్ నెడుమారన్,
పాటల రచయితలు: డా. చల్లా భాగ్యలక్ష్మి, శ్రేష్ఠ, రోల్ రిడా, విశ్వ, స్వామి
ఎడిటర్: నగూరన్ రామచంద్రన్,
మ్యూజిక్ డైరెక్టర్: అరల్ కొరెల్లి
పోస్టర్ డిజైన్: అనిల్ భాను
పీఆర్: నాయిడు - ఫణి
లైన్ ప్రొడ్యూసర్: ప్రకాష్ మనోహరన్
దర్శకుడు: బాలమురుగన్ (దర్శకుడు విజయ్ మిల్టన్ దగ్గర 'గోలి సోడా', 'కడుగు', తెలుగు 'టెన్' టైటిల్ తో విడుదలైన విక్రమ్, సమంత సినిమాకు దర్శకత్వ శాఖలో పని చేశారు)
నిర్మాత : బోగారి లక్ష్మీనారాయణAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !