View

9తార 'ఐరా' ఈ నెల 28న విడుదల.. ఫ్యామిలీ హారర్

Sunday,March17th,2019, 01:50 PM

న‌య‌న‌తార తొలిసారిగా ద్విపాత్రాభిన‌యం చేసిన `ఐరా` ఈ నెల 28న విడుద‌ల కానుంది. గంగా ఎంట‌ర్‌టైన్మెంట్స్, కేజేఆర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. స‌ర్జున్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తెలుగు, త‌మిళంలో ఒకేసారి విడుద‌ల చేయ‌నున్నారు.

 

ఈ సినిమా గురించి గంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, కేజేఆర్ స్టూడియోస్ అధినేత‌లు మాట్లాడుతూ - న‌య‌న‌తార ద్విపాత్రాభిన‌యం చేసిన 'ఐరా' సినిమా పోస్ట‌ర్లు ఇప్ప‌టికే ప్ర‌జల్లోకి వెళ్లాయి. డీ గ్లామ‌రస్ భవానీగా న‌య‌న‌తార లుక్స్ కి ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. పోస్ట‌ర్‌లో భ‌వాని, య‌మున అనే రెండు పాత్ర‌ల రూపురేఖ‌ల మ‌ధ్య ఉన్న వేరియేష‌న్ క‌థ‌లోనూ క‌నిపిస్తుంది. హార‌ర్‌, థ్రిల్ల‌ర్లు ఇష్ట‌ప‌డేవారికి మాత్ర‌మే కాదు, భావోద్వేగాల‌ను ఇష్ట‌ప‌డే వారంద‌రికీ ఈ సినిమా న‌చ్చుతుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే మా 'ఐరా' భారీగా విడుద‌లై వేస‌విలో అంద‌రి మ‌న్న‌న‌లు పొంద‌డం ఖాయం అని అన్నారు.


ద‌ర్శ‌కుడు స‌ర్జున్ మాట్లాడుతూ - ఇంద్రుడి వాహనం పేరు ఐరావ‌తం. అందులోనుంచే మేం `ఐరా` అనే ప‌దాన్ని ఎంపిక చేసుకున్నాం. 'ఐరా' అన‌గానే అంద‌రూ న‌య‌న‌తార పాత్ర పేరని అనుకుంటారు. ఆమె పేరు ఇందులో ఐరా కాదు. కాక‌పోతే పాత్ర బ‌లాన్ని సూచించ‌డానికి 'ఐరా' అని పేరు పెట్టాం. స్క్రిప్ట్ ప‌నులు జ‌రిగే స‌మ‌యంలో న‌య‌న‌తార మేడ‌మ్ రెండు పాత్ర‌లు చేస్తార‌ని అనుకోలేదు. కానీ ఎందుకో ఒక‌సారి ఆ ఆలోచ‌న త‌ట్టింది. వెంట‌నే ఆమెను సంప్ర‌తించి విష‌యాన్ని వివ‌రించాం. లుక్ టెస్ట్ చేసిన త‌ర్వాత డిసైడ్ చేద్దాం. ఇప్పుడే ఏమీ చెప్ప‌లేను` అని ఆమె అన్నారు. ఆ మాట ప్ర‌కారం లుక్ టెస్ట్ చేశాం. ఇక మేం భ‌వాని పాత్ర కోసం ఇంకెవ‌రినీ సంప్ర‌తించాల్సిన అవ‌స‌రం లేద‌ని అర్థ‌మైంది. మా భ‌వాని, య‌మున పాత్ర‌లను ఒక్క‌రే చేయ‌బోతున్నార‌ని అంద‌రం సంతోషించాం. ఇది సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ అయిన‌ప్ప‌టికీ, రెగ్యుల‌ర్ హార‌ర్ జోనర్ల‌లో క‌నిపించే వినోదాన్ని మించి ఇంకా ఏదో చేయాల‌ని ప్ర‌య‌త్నించాం. సినిమా చూసి ఇంటికెళ్లే ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా ఇందులోని అంశాల‌ను ప‌దిలంగా మోసుకెళ్తారు. సాంకేతికంగానూ ఎక్క‌డా రాజీప‌డ‌కుండా తెర‌కెక్కించాం. సౌండ్ డిజైనింగ్ హైలైట్ అవుతుంది. హార‌ర్ చిత్రాల్లో సౌండ్ కు విప‌రీత‌మైన ప్రాధాన్యం ఉంటుంద‌ని అంద‌రూ అనుకుంటారు. అయితే చాలా సంద‌ర్భాల్లో సైలెన్స్ కూడా చాలా ఎక్కువ విష‌యాల‌ను చెప్ప‌గ‌లుగుతుంది. అందుకే వాటి రెండింటిని క‌లిపి ఇందులో మేం చేసిన ప్ర‌య‌త్నానికి త‌ప్ప‌కుండా మెప్పు ల‌భిస్తుంద‌ని ఆశిస్తున్నాం. తొలి స‌గం ఎంత ఉత్కంఠ‌గా సాగుతుందో, రెండు స‌గం అంత‌కు మించి ఉంటుంది. ప‌ర్ఫెక్ట్ స్క్రీన్‌ప్లేకి నిద‌ర్శ‌నం ఈ సినిమా అని అన్నారు.


న‌టీన‌టులు
కళైయ‌ర‌సి, యోగిబాబు, మ‌నోబాలా, ఎం.ఎస్‌.భాస్క‌ర్‌, వంశీకృష్ణ‌, ప్ర‌వీణ్ రంగ‌నాథ‌న్‌, జ‌య‌ప్ర‌కాష్‌, లీలావ‌తి, కృష్ణ అభిషేక్‌, ర‌వి ప్ర‌కాష్ త‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు
కెమెరా: సుద‌ర్శ‌న్ శ్రీనివాస‌న్‌,
కూర్పు: కార్తిక్ జోగేష్‌,
స్క్రీన్‌ప్లే: ప్రియాంక ర‌వీంద్ర‌న్‌
సంగీతం: సుంద‌రమూర్తి. కె.ఎస్‌.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !