View

ఆర్ ఎక్స్ 100 కంటే హిప్పీ పెద్ద హిట్ అవుతుంది - కార్తికేయ

Friday,April05th,2019, 09:44 AM

RX 100 ఫేమ్ కార్తికేయ హీరోగా న‌టించిన చిత్ర‌ం 'హిప్పీ'. దిగంగన సూర్యవన్సీ హీరోయిన్. టీఎన్ కృష్ణ దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపధ్యంలో చిత్రం యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.


ఈ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ - ''ఆర్‌ఎక్స్‌100 విడుదలైన తర్వాత చాలా స్క్రిప్ట్‌లు విన్నాను. అందరికీ నచ్చేవిధంగా ఉండి నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవడానికి మంచి స్క్రిప్ట్‌ కోసం ఎదురు చూస్తున్న సమయంలో టి.ఎన్‌. కృష్ణగారు నాకు ఫోన్‌ చేసి నన్ను కలవాలి అన్నారు. మంచి ప్రేమకథా స్టోరి ఉంటుందని అనుకున్నాను. మంచి లవ్ స్టోరీ చెబుతారేమోననుకున్నాను. కానీ నరేషన్‌ విన్నాక పక్కా కమర్షియల్‌ ఎంటర్ టైనర్ అర్ధమయ్యింది. వెంటనే సినిమా చేద్దామన్నాను. ఈ సినిమా రియలిస్టిక్‌ స్టోరితో పాటు ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైనర్ గా ఉంటుంది. కలైపులి ఎస్‌. థానుగారు ఈ సినిమాని నిర్మించడం మాకు ఫుల్ ఎనర్జీని ఇచ్చింది. జె.డి. చక్రవర్తి గారు కథ విన్న వెంటనే ఈ సినిమా చేయడానికి అంగీకరించారు. ఆయనకు ఈ సందర్భంగా థ్యాంక్స్. సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఆర్ ఎక్స్ 100 ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ఇప్పుడు ‘హిప్పీ’ మూవీ కూడా అంతకన్నా పెద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవుతుంది'' అని తెలిపారు.


ద‌ర్శ‌కుడు టీఎన్ కృష్ణ మాట్లాడుతూ - ''మన ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబర్స్‌ జీవితంలో జరుగుతున్నట్లుగా ఉంటుంది. ఫస్ట్‌ సీన్‌ నుండి లాస్ట్‌ సీన్‌ వరకు ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. ఈ సినిమాను తమిళ్‌లో డైరెక్ట్‌ చేద్దామనుకున్న సమయంలో కార్తికేయ నటించిన ‘ఆర్‌ఎక్స్‌100’ తమిళ్‌ రీమేక్‌ చేసే అవకాశం వచ్చింది. అప్పుడు హీరో కార్తికేయను చూసి ఈ స్టోరి తనకు యాప్ట్‌ అవుతుందని అనడంతో థానుగారు ఒప్పుకొని కార్తికేయకి స్టోరి చెప్పడం జరిగింది. కార్తికేయకు హీరోయిన్‌ కోసం చాలామందిని ఆడిషన్స్‌ చేసి దిగంగనని ఎంపిక చేసి వాళ్ళిద్దరికీ టెస్ట్‌షూట్‌ చేశాం. జె.డి. చక్రవర్తిది సినిమాలో క్రూషియల్‌ రోల్‌. కానీ చాలా లవబుల్‌గా ఉంటుంది. ఈ సినిమా ద్వారా తనకి మంచి పేరు వస్తుంది. సినిమాటోగ్రాఫర్‌ ఆర్‌డి రాజశేఖర్‌ ‘చెలి’ సినిమా నుండి నన్ను సపోర్ట్‌ చేస్తూ వస్తున్నారు. అందరి సహకారంతో 48 రోజుల్లోనే షూటింగ్‌ పూర్తి చేశాం. తెలుగులో మంచి కమెడియన్‌గా పేరున్న వెన్నెల కిషోర్‌ ఈ సినిమాలో మంచి పాత్ర పోషించారు. త్వరలోనే సినిమా విడుదలవుతుంది. అందరూ చూడండి'' అని చెప్పారు.


నిర్మాత కలైపులి ఎస్‌. థాను మాట్లాడుతూ – ”డి.వి.ఎస్‌. రాజు, దాసరి నారాయణరావు, డి. రామానాయుడులాంటి లెజెండరీ పర్సన్స్‌ ఉన్న తెలుగు ఇండస్ట్రీ స్టేజిమీద నుండి వారిని ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. ఒకసారి కార్తికేయ నా ఆఫీస్‌కి వచ్చి నేను ‘ఆర్‌ఎక్స్‌ 100’ హీరో కార్తికేయ అని పరిచయం చేసుకున్నారు. మీ సినిమాలో హీరోగా చేస్తున్నా అని చెప్పారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ హిట్‌ అయ్యాక చాలామంది ప్రొడ్యూసర్స్‌ నీతో సినిమా తీయడానికి రెడీగా ఉన్నారు కదా? అన్నాను. ‘స్టోరి చాలా బాగుంది.. నాకు చాలా నచ్చింది సార్‌’ అన్నారు. ఆ వెంటనే కృష్ణకి ఫోన్‌ చేసి నువ్వు ఈ సినిమాని డైరెక్ట్‌ చెయ్‌ అని చెప్పాను. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది. ఔట్‌ స్టాండింగ్‌ స్క్రిప్ట్‌. డెఫినెట్‌గా ఈ సినిమా సూపర్‌డూపర్‌ హిట్‌ అవుతుంది. ఆ క్యారెక్టర్‌కి జె.డి. చక్రవర్తి టూ హండ్రెడ్‌ పర్సెంట్‌ న్యాయం చేశారు. ఈ సినిమా విడుదలైన తర్వాత కార్తికేయ ఫ్రంట్‌లైన్‌ హీరోగా నిలబడతారు. భానురేఖ, సావిత్రి, హేమమాలిని, సరోజనీదేవి, జయలలితలాంటి పొటెన్షియల్‌ ఉన్న హీరోయిన్‌ దిగంగన. ఆర్‌డి రాజశేఖర్‌గారు అద్భుతమైన విజువల్స్‌ ఇచ్చారు. నేను ఆయన్ని కూడా దర్శకుడిగానే పరిగణిస్తాను. ఆయన్ని డైరెక్షన్‌ చేయమని అడిగాను. లేదు సార్‌, నాకు ఫొటోగ్రఫీ అంటే ఇష్టం అని చెప్పారు. ఈ సినిమా తర్వాత దర్శకుడు కృష్ణ రెండు సినిమాలకి వర్క్‌ చేయనున్నారు. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అన్నారు.


హీరోయిన్‌ దిగంగన సూర్యవన్సీ మాట్లాడుతూ – ”జీవితంలో మనకి తెలియకుండానే ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సంఘటనల సమాహారమే ఈ సినిమా. ఈ సినిమాలో రాజశేఖర్‌గారు నన్ను చాలా అందంగా చూపించారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్‌” అన్నారు.
జె.డి. చక్రవర్తి మాట్లాడుతూ – ”ముందుగా ఈ సినిమా ప్రొడ్యూసర్‌ కలైపులి థానుగారి గురించి మాట్లాడాలి. ఆయన బిజీయెస్ట్‌ అండ్‌ బిగ్గెస్ట్‌ ప్రొడ్యూసర్‌. గ్రేటెస్ట్‌ హ్యూమన్‌ బీయింగ్‌. ఆర్‌డి రాజశేఖర్‌గారు ఈ సినిమాకి బ్యూటిఫుల్‌ విజువల్స్‌ అందించారు. హీరో కార్తికేయ ‘ఆర్‌ఎక్స్‌100’ నుంచి చూస్తున్నాను. కార్తికేయ రొమాన్స్‌, ఫైట్స్‌, డ్యాన్స్‌ చాలా బాగా చేస్తున్నారు. తప్పకుండా మంచి హీరోగా ఎదుగుతారు” అన్నారు.


ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాటల రచయిత అనంత శ్రీరామ్, సినిమాటోగ్రాఫర్ ఆర్ డి రాజశేఖర్ సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తపరిచారు.


నటీనటులు:
కార్తికేయ , జేడీ చక్రవర్తి, దిగంగన, జజ్బా సింగ్, వెన్నెల కిశోర్ , బ్రహ్మాజీ తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: టీఎన్ కృష్ణ
సినిమాటోగ్రాఫర్: ఆర్‌డీ రాజశేఖర్
సంగీతం: నివాస్ కే ప్రసన్న
ఎడిటర్: ప్రవీణ్ కేఎల్
సాహిత్యం: అనంత శ్రీరాం
మాటలు: టీఎన్ కృష్ణ, కాశీ నడింపల్లి
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
ఆర్ట్: మిలన్ ఫెర్నాండేజ్Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !