View

రుణం ప్రీ రిలీజ్‌, ఆడియో సక్సెస్‌మీట్‌ విశేషాలు

Monday,April08th,2019, 12:51 PM

బెస్ట్‌విన్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌ పై భీమినేని సురేష్‌, జి.రామకృష్ణారావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రుణం. ఎస్‌.గుండ్రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇద్దరి స్నేహితులు ఒక వ్యక్తిని నమ్మి మోసపోవడంతో వారి జీవితాల్లో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. గోపికృష్ణ, మహేంద్ర షిల్పా, ప్రియా అగస్థ్యన్లు నటీనటులుగా నటించారు. ఈ చిత్రం షూటింగ్‌ సెన్సార్‌ పనులు పూర్తి చేసుకొని ఏప్రిల్‌ 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఫిలింఛాంబర్‌లో ఏర్పాటు చేసిన ఆడియో సక్సెస్ మీట్ లో ...


ప్రొడ్యూసర్‌ జి. రామకృష్ణారావు మాట్లాడుతూ... ఈ సినిమా ఏప్రిల్‌ 12న విడుదలవ్వడం చాలా ఆనందంగా ఉంది. మానవ సంబంధాలపై రాసిన కథ. ప్రతి ఇంటిలోనూ రుణానుబంధాలు ఉంటాయి. డైరెక్టర్‌గారు చాలా టైటిల్స్‌ను వెతికి మరీ ఈ కథకు అనుగుణంగా ఉండే రుణం టైటిల్‌ను ఎంచుకున్నారు. ఈ కథ ఫ్యామిలీ ఎమోషన్స్‌ మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రం. ఇద్దరి స్నేహితుల ఫ్యామిలీల మధ్య నడిచే కథ. ఈ చిత్రానికి డైలాగులు బాగా కుదిరాయి. డైరెక్టర్‌గారు ప్రతి పాత్రని చాలా చక్కగా చిత్రీకరించారు. నేను ఎన్నో సినిమాలు చూశాను కాని ప్రొడ్యూస్‌ చెయ్యడం మొదటిసారి. మ్యూజిక్‌ హైలెట్‌గా నిలిచింది. డిఓపి కూడా చాలా కష్టపడ్డారు. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరూ వారి వారి పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించారు నాకు అవకాశం కల్పించిన అందరికీ కృతజ్ఞతలు అన్నారు.


ప్రొడ్యూసర్‌ భీమినేని సురేష్‌ మాట్లాడుతూ... మా చిత్ర యూనిట్‌ అందరికీ నా కృతజ్ఞతలుఅన్నారు. ఏప్రిల్‌ 12న విడుదల కాబోతుంది. మా యూనిట్‌ అందరికీ నేను రుణ పడి ఉన్నాను. వచ్చే నెలలో ఇదే టీమ్ తో మరో చిత్రం స్టార్ట్‌ చేయబోతున్నాం. ఇదే యూనిట్‌కి మరో ఛాన్స్‌ ఇస్తాం అని అన్నారు.


మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌.వి.మల్లిక్‌ తేజ మాట్లాడుతూ... రుణం శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్‌ 12న విడుదల కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను కొత్తవాడినని కూడా చూడకుండా నన్ను ఆదరించిన దర్శకనిర్మాతలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. ఈ కథతోపాటు నా జర్నీ సాగింది. ఎప్పుడూ డైరెక్టర్‌తోనే ఉండేవాడిని. చిన్న సినిమా అని చూడకుండా మమ్మల్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.


డైరెక్టర్‌ ఎస్‌.గుండ్రెడ్డి మాట్లాడుతూ... నేను గతంలో కన్నడలో ఐదు చిత్రాలు చేశాను. రైటర్‌గా నా కెరీయర్‌ని మొదులుపెట్టి ఎన్నో సీరియల్స్‌ రాశాను. తెలుగు, కన్నడకు చేస్తూ ఉండగా ఇప్పుడు డైరెక్టర్‌గా మారాను. నా సినిమాలో ఎక్కడా అశ్లీలత అనేది ఉండదు. ఎవరికీ సందేశమివ్వాలనే ఉద్దేశంతో చెయ్యలేదు. తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండే పిల్లలకు తల్లిదండ్రుల మీద, వారి బంధాలు బాంధవ్యాలు ఇంట్లో జరిగే చిన్న చిన్న అపార్ధాల మధ్య కొనసాగుతుంది. ఈ చిత్రం చూస్తే ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే చిన్న చిన్న మిస్‌ అండర్‌స్టాండింగ్స్‌ అన్నీ పోతాయి. సెన్సార్‌ కూడా పూర్తయింది. ఇది చాలా పెద్ద మూవీగా తీసుకొస్తున్నాము. మా ప్రొడ్యూసర్లు ఇద్దరు మమ్మల్ని చాలా బాగా చూశారు. హీరోగా చేసిన గోపికృష్ణ కన్నడలో చేశారు. ఇప్పుడు తెలుగు కి వచ్చారు. మీరందరూ మా సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.


హీరో మహేంద్ర మాట్లాడుతూ... ఏప్రిల్‌12న మీ ముందుకు రాబోతుంది. డైరెక్టర్‌గారు ఆయన నిజ జీవితంలో జరిగిన కథను ఆధారంగా తీసుకుని చేశారు. కాని ఇది కేవలం ఆయన జీవితం మాత్రమే కాదు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సంఘటనలానే ఉంటుంది. ఖచ్చితంగా ఈ చిత్రం మీ అందరికీ నచ్చుతుంది. మనం చేసే పనుల వల్ల మన తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అన్న మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రం. అందరూ ఆదరించాని కోరుకుంటున్నాను అన్నారు.


హీరో గోపికృష్ణ మాట్లాడుతూ... ఒక మంచి చిత్రంతో మీ ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉంది. అన్ని రకాల హంగులతో ఉంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో జరిగే రియల్‌ స్టోరీ ఇది. ఏప్రిల్‌ 12న విడుదలకాబోతుంది. అందరూ ఆదరించాలి. ప్రొడ్యూసర్లు ఇద్దరూ చాలా కష్టపడి ఈ చిత్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. అవుట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది అన్నారు.


హీరోయిన్‌ ప్రియా మాట్లాడుతూ... ఈ చిత్రంలో నటించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. మా ప్రొడ్యూసర్లు ఇద్దరూ చాలా మంచివారు. ఇది కేవలం మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రంమే కాదు ఎక్కడా అశ్లీ లత అనేదే ఉండదు. మేము ఇక్కడి వరకు రావడానికి చాలా కష్టాలు పడ్డాము. మీ అందరికీ తప్పకుండా ఈ సినిమా నచ్చుతుంది. దయచేసి రివ్యూస్‌ చూసి సినిమాని జడ్జ్‌ చేయవద్దు. అదే విధంగా 11న అందరూ వెళ్ళి తమ ఓట్‌ హక్కును వినియోగించుకోండి అని అన్నారు.


విలన్‌ ప్రదీప్‌ పత్తికొండ మాట్లాడుతూ... ఈ సినిమాలో నేను నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎవరు ఎవరికి రుణపడి ఉంటారు అన్నది కథ. మ్యూజిక్‌ చాలా బాగా కుదిరింది. మా డైరెక్టర్‌గారికి సినిమా అంటే పిచ్చి, మా ప్రొడ్యూసర్‌గారికి ప్యాషన్‌ ఇవి రెండూ కలిస్తేనే ఈ సినిమా. ఏప్రిల్‌ 12న విడుదకాబోతుంది మీరందరూ తప్పకుండా ఆదరించాలి అని అన్నారు.


ఇంకా ఈ కార్యక్రమంలో సినిమాలో నటించిన ఆర్టిస్టు నారాయణ, మహేష్‌ తదితరులు పాల్గొని ప్రసంగించారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

Gossips

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !