View

గాడ్ ఆప్ గాడ్స్ ఆడియోని విడుదల చేసిన నిర్మాత దిల్ రాజు

Saturday,May18th,2019, 10:53 AM

డివైన్ విజ‌న్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ బ్యాన‌ర్ పై డివిజ‌న్ ఆఫ్ బ్ర‌హ్మ‌కుమారీస్ స‌మ‌ర్పిస్తున్నచిత్రం గాడ్ ఆఫ్ గాడ్స్‌. వెంక‌టేష్‌గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో జ‌గ్‌మోహ‌న్ గ‌ర్గ్‌, ఐఎంఎస్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తేజ‌శ్వీమ‌నోజ్ఞ, త్రియుగ‌మంత్రి, రాజ‌సింహ వ‌ర్మ‌ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. మార్చిలో హిందీలో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించ‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. శాంతి, ప్రేమ విలువ‌ల‌తోకూడిన న‌వ ప్ర‌పంచ పున‌రుద్ధ‌ర‌ణ మ‌హాకార్యం వంటిది ఈ చిత్ర క‌థాంశం. అద్భుత‌మైన ఆడియో విజువ‌ల్స్ ఈ చిత్రం యొక్క మ‌రో ప్ర‌త్యేకత‌. ఈ సంద‌ర్భంగా ఆడియో మ‌రియు ట్రైల‌ర్‌ను ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు చేతుల మీదుగా ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా...


దిల్‌రాజు మాట్లాడుతూ... ఈ చిత్రం ఆడియో మ‌రియు ట్రైల‌ర్ లాంచ్ నా చేతుల మీదుగా జ‌ర‌గ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. మ‌న భార‌త‌దేశంలో ఉన్నన్ని మ‌తాలు మ‌రే దేశంలోనూ ఉండ‌వు. అయినా కూడా మ‌న‌దేశంలో ఎమోష‌న్స్ అనేవి చాలా ఎక్కువ‌. అవి ఇప్ప‌టికీ ఇంకా అలానే ఉన్నాయి. ఈ సినిమా ఆడియోని ఇలా చేస్తార‌ని తెలిసుంటే నేను ఇంకా బాగా డిజైన్ చేసేవాడ్ని. బ్ర‌హ్మ‌కుమారీస్‌వాళ్ళు ఇక ముందు ఇటువంటి సినిమాలు తియ్య‌ద‌లుచుకుంటే న‌న్ను పిలిస్తే త‌ప్ప‌కుండా నేను మీ వెంట వుంటాను అని అన్నారు. అంతేకాక ఈ సినిమా విడుద‌ల‌కు నానుంచి మీకు ఎటువంటి స‌హాయం కావాల‌న్నా త‌ప్ప‌కుండా చేస్తాను అని అన్నారు. నా వ‌ల్ల ఎవ‌రికీ మంచి జ‌ర‌గ‌క‌పోయినా ప‌ర్వాలేదు కాని చెడు మాత్రం జ‌ర‌గ‌కూడ‌ద‌న్న‌ది నా క‌న్సెప్ట్‌. అందుకే నా సినిమాల వ‌ల్ల వీలైనంత‌వ‌ర‌కూ మంచి మాత్ర‌మే చూపిస్తాను అని అన్నారు.


ల‌య‌న్‌ సాయి వెంక‌ట్ మాట్లాడుతూ... ఈ చిత్రం ఆడియోను స‌క్సెస్‌ఫుల్ నిర్మాత అయిన దిల్‌రాజు చేతుల‌మీద‌గా లాంచ్ చేయ‌డం మా అదృష్టంగా భావిస్తున్నాను. అన్ని భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం స్పిరిట్యువ‌ల్ ఆర్గ‌నైజేష‌న్స్‌ నుంచి వ‌స్తుంది. చెడు నుంచి మంచి రావాలంటే ఏంటి అన్న క‌థాంశంతో ఈ చిత్రం ఉంటుంది. మ‌నోజ్ఞ ఈ పాత్ర‌కి చాలా క‌రెక్ట్‌గా సూట్ అయింది. ఆమె ఒక డాక్ట‌ర్‌. క‌మ‌ర్షియ‌ల్ మ‌రియు మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. ఈ ఆడియో రిలీజ్‌లో పాల్గొన‌డం చాలా ఆనందంగా ఉంది. నిస్వార్ధంగా సేవ చేసే బ్ర‌హ్మ‌కుమారీస్ సర్వీస్ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. వీళ్ళ భ‌క్తులు ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నారు. వారిలో ఒక ప‌ది మంది ఈ సినిమా గురించి చెప్పినా చాలు మ‌హ‌ర్షికంటే ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంద‌ని నా న‌మ్మ‌కం అన్నారు.


కుల్‌దీప్ దీది మాట్లాడుతూ... ఈ క‌థ‌ని తెర‌కెక్కించేందుకు డైరెక్ట‌ర్ మ‌రియు ప్రొడ్యూస‌ర్ చాలా క‌ష్ట‌ప‌డ్డారు. చాలా మంచి క‌థ ఇది. ఈ ఈవెంట్‌ని చేయ‌డానికి స‌హాయం చేసిన సాయి వెంక‌ట్‌గారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు. తెలుగులో ఈ చిత్రం విడుద‌ల‌వుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎన్ని దేశాల్లో మా భ‌క్తులు ఉన్నారు అన్న‌ది కూడా ఈ చిత్రం ద్వారా మాకు బాగా తెలిసింది. ఇక్క‌డ‌కు విచ్చేసిన జ‌స్టీస్ ఈశ్వ‌ర‌య్య‌, జ‌డ్జి ర‌మేష్‌గారికి, నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.
తేజ‌శ్వీ మ‌నోజ్ఞ మాట్లాడుతూ... ఈ చిత్రంలో న‌టించ‌డం నాకు చాలా ఆనందంగా ఉంది. మొద‌టి సినిమానే ఇంత మంచి డివోష‌న్‌కి సంబంధించి చేయ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన ప్రొడ్యూస‌ర్‌, డైరెక్ట‌ర్ల‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. గాడ్ ఆఫ్ గాడ్స్ అన్న‌ది ప్ర‌త్యేకించి ఒక మ‌తానికి సంబందించిన చిత్రం కాదు. అంద‌రూ తప్ప‌కుండా చూడాల్సిన చిత్ర‌మిది అని అన్నారు.


డైరెక్ట‌ర్ వెంట‌క్ గోపాల్ మాట్లాడుతూ... ఈ సినిమా చాలా సెన్సిటివ్ స‌బ్జెక్ట్‌. ఎవ్వ‌రినీ నొప్పించ‌కుండా చెయ్యాల్సిన చిత్ర‌మిది. భ‌గ‌వంతుడు ఒక్క‌డే అన్న విష‌యాన్ని అంద‌రూ గ్ర‌హించాల్సిన విష‌య‌మిది అని అన్నారు.


ప్రొడ్యూస‌ర్ ఐ.ఎం.ఎస్‌రెడ్డి మాట్లాడుతూ... ఈ క‌థ చాలా మంచిది. ఎంతో క‌ష్ట‌ప‌డి తెర‌కెక్కించాం. యు.ఎ స‌ర్టిఫికెట్‌ను పొందిన ఈ చిత్రం అద్భుత‌మైన విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో తీసిన చిత్ర‌మిది. ఈ చిత్రాన్ని సంగీతం కూడా చాలా బాగా కుదిరింది అని అన్నారు. ఈ చిత్రాన్ని మెక్సికో, ముంబ‌యి, చెన్నై, యు.కె. మ‌రియు యు.ఎస్‌లో చిత్రీక‌రించ‌డం జరిగింది అని అన్నారు.


ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో ద‌ర్శ‌కుడు ముప్ప‌ల‌నేనిశివ‌, జ‌స్టీస్ ఈశ్వ‌ర‌య్య‌, జ‌డ్జిర‌మేష్‌, తోట‌చిన్ని, జివికెరావ్‌, నిర్మాత ఐఎంఎస్‌రెడ్డి, శివ బికె. త‌దిత‌రులు పాల్గొన్నారు.


తేజ‌స్విని మ‌నోజ్ఞ‌, త్రియుగ మంత్రి, రాజ‌సింహ‌వ‌ర్మ‌, శివ మ‌రియు బ‌బు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ల‌క్ష్మీకాంత్‌-ప్యారేలాల్‌జీ, ల‌క్ష్మీనారాయ‌ణ‌, మ‌రియు విశ్వ‌మ‌ల్లిక్ గాయ‌నీ గాయ‌కులుః శ్రేయా ఘోష‌ల్‌, ర‌మ్య‌బెహ‌రా, మ‌నోజ్‌నెగీ, ప్ర‌వీణ‌చ‌క్ర‌వ‌ర్తి, ప్ర‌స‌న్న‌, రాణియా డాగెర్‌, లోకేష్ వ‌సంత‌, హేమ‌చంద్ర‌, క‌ళ్యాణ‌, డీప్‌దేవ్‌, రామ‌క్రిష్ణ‌, మొ. త‌దిత‌రులు గాత్రాన్ని అందించారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !