View

మల్లేశం చిత్రానికి ప్రభుత్వ సహకారం అందేలా ప్రయత్నిస్తానంటున్న కెటిఆర్

Saturday,June15th,2019, 03:32 PM

ప‌ద్మ శ్రీ చింత‌కింది మ‌ల్లేశం జీవితం ఆధారంగా తెర‌కెక్కిన సినిమా 'మ‌ల్లేశం'. అగ్గిపెట్టెలో ప‌ట్టేంత చిన్న చీర‌ల‌ను కూడా నేచి ప్రపంచాన్ని అబ్బుర పరిచిన వ్యక్తి మల్లేశం. తను సాధించిన విజయాలతో చేనేత ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా చాటి చెప్పిన ఘ‌న‌త మ‌ల్లేశంగారి సొంతం. ఇలాంటి గొప్ప వ్యక్తి జీవితం ఆధారంగా 'మ‌ల్లేశం' సినిమా తెర‌కెక్కింది. రాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. శ్రీ అధికారి, రాజ్.ఆర్ నిర్మించారు. ఇందులో మ‌ల్లేశం పాత్ర‌లో ప్రియ‌ద‌ర్శి నటిస్తున్నారు. అన‌న్య‌, ఝాన్సీ, చక్ర‌పాణి కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 21న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం జ‌రిగిన ప్రాత్రికేయుల స‌మావేశంలో...


తెలంగాణ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ మాట్లాడుతూ - మ‌ల్లేశం సినిమాను పూర్తి చేయ‌డంలో సూర్యుల్లాగా చాలా మంది ప‌నిచేశారు. వారంద‌రినీ అభినంద‌న‌లు. సినిమా చాలా హృద్యంగా, చాలా మాన‌వీయంగా, స‌హ‌జంగా, అద్భుతంగా మాన‌వ ఉద్వేగాలను చ‌క్క‌గా క్యాప్చ‌ర్ చేశారు. సినిమాలో `సముద్ర గ‌ర్భంలో దాగిన బ‌డ‌బాగ్నులెన్నో, స‌మాజంలో అజ్ఞాత సూర్య‌లెంద‌రో, గాయ‌ప‌డిన క‌వి గుండెల్లో రాయ‌బ‌డ‌ని క‌విత‌లెన్నో` అనే ఓ క‌విత సినిమాలోని రెండు గంట‌ల ఎమోష‌న్‌ని, ప్ర‌యాస‌ని, కృషి, సామాన్యుడి ప్ర‌తిభా పాట‌వాన్ని ఆవిష్క‌రించే క్ర‌మంలో ఎన్ని క‌ష్ట‌న‌ష్టాలుంటాయో తెలియ‌జేసింది. సినిమాలో మూడు నాలుగు అంశాలు నా హృద‌యానికి చాలా ద‌గ్గ‌ర‌య్యాయి. భార‌త‌దేశంలోని అంద‌రూ చేనేత కార్మికులు ప‌డే క‌ష్టం మ‌రుగున ప‌డిపోతున్న క‌ళ‌గా అంత‌రించిపోతున్న త‌రుణంలో వారి నైపుణ్యానికి పెద్ద పీట వేస్తూ వారి క‌ష్ట‌న‌ష్టాల‌ను కూడా ఈ సినిమాలో ప్ర‌స్తావించారు. చేనేత క‌ళాకారుల ఆత్మ‌హ‌త్య‌ల‌ను, స్థితిగ‌తుల‌ను చూపెడుతూ, ఈ వృత్తిలో రాణించాలంటే ఉండే క‌ష్ట‌న‌ష్టాల‌ను చూపుతూ, అందులో భాగంగా ఓ రూర‌ల్ ఇన్‌వెంట‌ర్ జీవితాన్ని చూపించారు. ఒక కొత్త ఆవిష్క‌ర‌ణ‌ను చేయాల‌నుకున్న‌ప్పుడు ఓ వ్య‌క్తికి ఎన్ని ర‌కాల ఇబ్బందులు ఎదుర‌వుతాయి. దాన్ని త‌ట్టుకుని అధిగ‌మిస్తూ ఎలా స‌క్సెస్ కావాల‌నే దానికి కూడా ఈ సినిమా అద్భుత‌మైన ప్రేర‌ణ‌గా నిలిచింది. ప‌ద్మ‌శ్రీ చింత‌కింది మ‌ల్లేశం గారికి, చేనేత క‌ళాకారుల‌కి, తెలంగాణ ప్ర‌భుత్వం గ‌డిచిన ఐదు సంవ‌త్స‌రాలుగా భార‌త‌దేశంలో ఏ ప్ర‌భుత్వం చేయ‌నన్ని అద్భుత‌మైన కార్య‌క్ర‌మాలు చేసింది. చింతకింది మ‌ల్లేశం గారికి మ‌రో యూనిట్‌ను స్టార్ట్ చేయ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం కోటి రూపాయ‌ల ఆర్ధిక సాయాన్ని చేసింద‌నే సంగ‌తిని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేస్తున్నాను. దాంతో పాటు.. అప్ప‌టి వ‌ర‌కు జౌళి శాఖ‌కు రూ.70కోట్ల మాత్ర‌మే ఉండే బ‌డ్జెట్‌ను రూ.1270 కోట్లకు పెంచి ఘ‌న‌త ముఖ్య‌మంత్రి కె.సి.ఆర్‌గారికే చెందుతుంది. ఇంకా చేనేత క‌ళాకారుల స‌మ‌స్య తీరిపోలేదు. సినిమా విష‌యానికి వ‌స్తే చాలా ఎమోష‌న్స్‌ను చ‌క్క‌గా క్యాప్చ‌ర్ చేశారు. ఇంగ్లీష్‌లో నెసిసిటీ ఈజ్ మ‌ద‌ర్ ఆఫ్ ఇన్‌వెన్‌ష‌న్ అనే సామెత ఉంది. కానీ ఈ సినిమాలో మ‌ద‌ర్ ఈజ్ నెసిసిటీ ఆఫ్ ఇన్‌వెన్‌ష‌న్ అని చూపించారు. ఎందుంక‌టే మ‌ల్లేశంగారు త‌న త‌ల్లిగారి క‌ష్టాన్ని చూసి శోధించి క‌నుగొన్నారు. ఆ ర‌కంగా త‌న త‌ల్లికే కాదు.. ఎంతో మంది త‌ల్లుల స‌మ‌స్య‌ను ఆయ‌న తొలగించిన విష‌యాన్ని అద్భుతంగా చూపించారు. ఇలాంటి అజ్ఞాత సూర్యులంద‌రికీ, సోష‌ల్ ఇన్నోవేట‌ర్స్‌కి, యంగ్ ఇన్నోవేట‌ర్స్‌కి, మ‌నం వెళ్లే దారిలో ఎన్నో స‌మ‌స్య‌లుంటాయి. అన్ని దారులు మూసుకుపోయినా, ఏదో ఒక‌దారి తెరుచుకుని ఉంటుందనే విష‌యాన్ని చ‌క్క‌గా వివ‌రించింది. ఈ సినిమా ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు, ఇత‌ర యూనిట్ అభినంద‌న‌లు. ప్రియ‌ద‌ర్శి లీడ్ క్యారెక్ట‌ర్‌లో అద్భుతంగా న‌టించారు. ఆయ‌న‌కు అభినంద‌నలు. అలాగే రైట‌ర్ అశోక్‌కుమార్‌గారు తెలంగాణ భాష‌, యాస‌లోని మాధుర్యాన్ని చ‌క్క‌గా రాశారు. ఎక్క‌డా తొట్రుపాటు లేకుండా, కృత‌కంగా లేకుండా చ‌క్క‌గా యధాలాపంగా ప‌లికారు. ఈ సినిమాకు ప్ర‌భుత్వం నుండి స‌హకారం ఎంతో అవ‌స‌రం. ఆ స‌హ‌కారాన్ని అందించాల‌ని గౌర‌వ సినిమాటోగ్రాఫ‌ర్ మంత్రిగారితో , గౌర‌వ ముఖ్య‌మంత్రిగారితో మాట్లాడుతాను. ప‌ది మందికి ఈ సినిమాను చేర్చేలా చేయాల్సిన స‌హ‌కారం అది ట్యాక్స్ ఎగ్జంప్ష‌న్ అయినా, మ‌రేదైనా నా వంతుగా ఉడ‌తా భ‌క్తిగా చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాన‌ని చెబుతున్నాను. హ్యాండ్ లూమ్ ప్ర‌మోష‌న్స్‌ను చాలా మంది చారిటీకోసం అనుకుంటారు. ప్ర‌తి సోమ‌వారం చేనేత వ‌స్త్రాల‌నే ధ‌రించాలి. చేనేత క‌ళాకారుల‌కు అండ‌గా నిల‌బ‌డాల‌నే ప్ర‌య‌త్నాన్ని ప్రార‌భించిన సంగతి తెలిసిందే. చాలా మంది ఐటీ కుర్రాళ్లు కూడా వారి వంతుగా స‌హాయం చేస్తున్నారు. ఈ ప్ర‌య‌త్నంలో మేం కొంత మేర విజ‌యం సాధించాం. నా విజ్ఞ‌ప్తి ఏంటంటే ఈ సినిమా ద్వారా హ్యాండ్ లూమ్‌కి కూడా కొంత ప్ర‌మోష‌న్ దొరికి చేనేత క‌ళాకారుల బిజినెస్ కూడా పెరిగితే, నేను కూడా ఎంతో సంతోషిస్తాను. చేనేత క‌ళాకారుల‌కు ప్ర‌భుత్వ పరంగా ఎంతో కొంత చేసినా, అంద‌రూ వారికి స‌పోర్ట్‌గా ముందుకు రావాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. స‌హ‌జ‌త్వానికి ద‌గ్గ‌ర‌గా ఉండే సినిమాను చేసిన‌, నాకు చూసే అవ‌కాశాన్ని క‌లిగించిన అంద‌రికీ థాంక్స్‌ అన్నారు.


నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ - రాజ్‌, వెంక‌ట్ ఈ సినిమాను నాకు చూపించారు. ఆయ‌న ప్యాష‌న్ చూసి నేను భ‌య‌ప‌డ్డాను. మార్కెట్ ఎలా ఉంటుందనే విష‌యంలో ఎవ‌రూ రారేమో అని కూడా అన్నాను. అమెరికాలో ఉండే రాజ్‌గారు సినిమాల‌పై ప్యాష‌న్‌తో 6వ త‌ర‌గ‌తి ఫెయిలై వ్య‌క్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఓ సినిమా చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ ఈ సినిమాను చూడాలి. థియేట‌ర్‌కు బ‌య‌ట‌కు వ‌చ్చేట‌ప్పుడు ఓ ఫీల్‌తో బ‌య‌ట‌కు వ‌స్తారు. ఇలాంటి సినిమాల‌ను ఎంక‌రేజ్ చేస్తేనే బెట‌ర్ సినిమాలువ‌స్తాయి. దాని వ‌ల్ల బెట‌ర్ సొసైటీ రూపొందుతుంది అన్నారు.


న‌ర్సింగ్ రావు మాట్లాడుతూ - రాజ్‌కు అభినంద‌న‌లు. సామాన్యుడు మ‌ల్లేశం జీవితాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమాకు స‌పోర్ట్ చేసిన సురేష్‌బాబుగారు స‌హా అంద‌రినీ అభినందిస్తున్నాను. ఐదారేళ్లుగా మ‌న సినిమాల్లో స‌హ‌జ‌త్వం పెరుగుతుంది. ఎంటైర్ యూనిట్‌కు కంగ్రాట్స్‌ అన్నారు.


డైరెక్ట‌ర్ రాజ్ మాట్లాడుతూ - నేను మ‌ల్లేశంగారి వీడియో చూసి నేను ఇన్‌స్పైర్ అయ్యాను. ఇందులో రూర‌ల్ ఇన్నోవేష‌న్‌, హ్యాండ్ లూమ్స్ స‌మ‌స‌స్య‌లు, హ్యుమ‌న్ మోటివేష‌నల్ స్టోరీ ఉంది. అందుక‌నే ఈ సినిమాను చేశాం. పెద్దింటి అశోక్‌గారు చాలా మంచి డైలాగ్స్ ఇచ్చారు. మంచి టీం కుదిరింది. శ్రీ కో ప్రొడ్యూస‌ర్‌, వెంక‌ట్ సిద్ధారెడ్డి మా టీంకు సి.ఇ.ఒగా పినిచేశారు. చ‌క్ర‌పాణిగారు, ఝాన్సీ, అన‌న్య‌, ప్రియ‌ద‌ర్శిల‌కు స్పెష‌ల్ థాంక్స్‌ అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !