filmybuzz

View

ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో విడుదలైన కృష్ణారావ్ సూప‌ర్‌మార్కెట్ టీజ‌ర్

Monday,June17th,2019, 11:12 AM

బిజెఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్ బ్యాన‌ర్ పై ప్ర‌ముఖ క‌మెడియ‌న్ గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా కృష్ణారావ్ సూప‌ర్‌మార్కెట్ టీజ‌ర్ ప్ర‌సాద‌ర్‌ల్యాబ్‌లో ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో విడుద‌ల‌ చేశారు. ఈ చిత్రానికి నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీ‌నాధ్ పుల‌క‌రం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో ...


హీరో సుమ‌న్ మాట్లాడుతూ...నా ప‌క్క‌న ఓ గొప్ప వ్య‌క్తి నుంచున్నారు నాకు చాలా గ‌ర్వంగా ఉంది. 30 సినిమాల‌కు పైగా ప్రొడ్యూస‌ర్ చేసిన ఆయ‌న‌తో ఈ రోజు స్టేజ్ మీద నిల‌బ‌డ‌డం చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా భ‌ర‌ణిలాంటి పెద్ద వాళ్ళ‌తో ఉండ‌డం చాలా చాలా ఆనందంగా ఉంది. గౌత‌మ్ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నా అని చెప్ప‌గానే ఎందుకు ఇంత రిస్క్ చేశావ్ అని అన్నాను. నేను నా కొడుకుని హీరోగా ఇంట్ర‌డ్యూస్ చెయ్యాల‌నుకున్నాను. అది నా కోరిక అన్నారు. ఇందులో ఒక సాంగ్ నాకు చాలా బాగా న‌చ్చింది. రెండున్న‌ర‌గంట‌లు సినిమా ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించాడు. మీ అంద‌రి ఆశీర్వాదాలు ఆయ‌న‌కు ఉండాల‌ని అంద‌రూ ఈ సినిమాని బాగా ప్ర‌మోట్ చెయ్యాల‌ని మ‌న‌సారా కోరుకుంటున్నాను అని అన్నారు.


త‌నికెళ్ళ భ‌ర‌ణి మాట్లాడుతూ... ఆర్ నారాయ‌ణ‌మూర్తిగారు మంచి నీళ్ళ‌లాంటి వాళ్ళు. అంద‌రితోనూ క‌లుపుగోలుగా ఉంటారు. సినిమా అనేది చాలా పెద్ద య‌జ్ఞం లాంటిది. ఎన్నో క‌ష్టాలు ప‌ని ఈ సినిమాని తీస‌ని డైరెక్ట‌ర్‌కి నా అభినంద‌న‌లు తెలుపుతున్నాను. నెక్స్‌ట్ సీన్ ఏంటి అని ప్రేక్ష‌కుల్లో ఒక క్యూరియాసిటీని క‌లిగించేలా ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్నితెర‌కెక్కించాడు. గౌతంరాజు కోసం ఇంత మంది వ‌చ్చారు. ఈ సినిమాలో అన్ని పాత్ర‌లు చాలా బాగా కుదిరాయి. చిన్న సినిమాల‌లోనే మాకు చాలా ప్ర‌త్యేక‌మైన పాత్ర‌లు ఉంటాయి. మాకు మంచి గుర్తింపు కూడా వ‌స్తుంది. ఖ‌చ్చితంగా అంద‌రూ ఈ సినిమాని చూసి ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.


ఆర్‌. నారాయ‌ణ‌మూర్తి మాట్లాడుతూ... కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్ సినిమా చూశాను నాకు చాలాబాగా న‌చ్చింది. త‌నికెళ్ళ‌భ‌ర‌ణిగారు స‌రస్వ‌తి పుత్రుడు. అల్లు అర‌వింద్‌గారు నా శ్రేయోభిలాషి. గౌత‌మ్‌రాజు నా కొడుకుని హీరో చెయ్యాల‌ని ఆయ‌న చేసే సంక‌ల్పం చాలా గొప్ప‌ది. ఆయ‌న ఎవ‌రి డ‌బ్బులు ఉంచుకోరు. సినిమా మంచి హిట్ అవుత‌ది. ఇక్క‌డ ఎవ‌రి సింప‌తీ ఎవ‌రికి అక్క‌ర‌లేదు. డైరెక్ట‌ర్ ఈ సినిమాని చాలా గొప్ప‌గా తీశారు. నూత‌నంగా వ‌చ్చే ద‌ర్శ‌కుల్లో మీరు ఎంతో గొప్ప‌స్థాయికి రావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు. తండ్రి రుణం త‌ప్ప‌కుండా తీర్చుకోవాల‌ని కృష్ణాని కోరుతున్నాను. తండ్రులు చాలా గొప్ప‌వారు ధ‌ర్మేంద్ర త‌న కొడుకు కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. అలాగే బెల్లంకొండ సురేష్ త‌న కొడుకు కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. అలాగే నేడు గౌత‌మ్ కూడా ఆయ‌న కొడుకు కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు అని అన్నారు.


గౌత‌మ్‌రాజు మాట్లాడుతూ... ఫ‌స్ట్ కాపీ వ‌చ్చేసింది సినిమా చూశాం చాలా బావుంది. సెన్సార్ ప‌నులు అన్నీ పూర్త‌యిపోయాయి. సినిమా ఇంట‌ర్ వెల్ వ‌ర‌కు ఒక ఎత్తు ఇంట‌ర్‌వెల్ త‌ర్వాత త‌ల తిప్ప‌రు ఒట్టు. సినిమాని చాలా బాగా తీశారు. ఈ సినిమా కోసం నాకు చాలా మంది హెల్ప్ చేశారు. మార్తాండ‌గారు కూడా చాలా హెల్ప్ చేశారు.


హీరో కృష్ణ మాట్లాడుతూ... చాలా క‌ష్ట‌ప‌డి ఈ సినిమాని తీశాం. మంచి ప్రాజెక్ట్ కోసం బాగా క‌ష్ట‌ప‌డ్డాం. నా కెరియ‌ర్‌కి ఇదో మంచి మూవీ అవుతుంది. స్టోరీ అంద‌రికీ చూపించాము. త‌నికెళ్ళ భ‌ర‌ణిగారు క‌థ చూసి చాలా పాజిటివ్‌గా రెస్పాన్స్ అయ్యారు. ఎడిట‌ర్ బాగా ఎడిట్ చేశారు. ఈ చిత్రంలో ఆరు ఫైట్లు ఉన్నాయి. ఆర్ ఆర్ బాగా కుదిరింది బోలేగారు బాగా స‌పోర్ట్ చేశారు. సిజి టీమ్ లాల్‌గారు చాలా బాగా క‌ష్ట‌ప‌డ్డారు. నేను చాలా అదృష్ట‌వంతుడ్ని ఇంత మంచి టెక్నీషియ‌న్స్ దొర‌క‌డం నా అదృష్టం. ఎల్సా చాలా వండ‌ర్‌ఫుల్ హీరోయిన్‌. అమ్మ మీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నా విషెస్‌. అదే విధంగా ఫాద‌ర్స్‌డే సంద‌ర్భంగా ఫాద‌ర్స్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు. మా నాన్న‌గారికి కూడా నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు. నేను ఇది ఇలాగే నిల‌బెట్టుకోవాల‌ని మీరంద‌రూ నాకు చాలా హెల్ప్ చెయ్యాలి అని కోరుకుంటున్నాను అన్నారు.


ద‌ర్శ‌కుడు శ్రీ‌నాధ్ పుల‌కుర‌మ్ మాట్లాడుతూ... ఈ సినిమా ప్రారంభ‌మైన మొద‌ట్లో నేను ఒక్క‌డినే క‌థ రాసుకున్నాను. త‌ర్వాత గౌత‌మ్ గారికి క‌థ వినిపించాను ఆయ‌న‌కు బాగా న‌చ్చి ఓకే చెప్పారు. గౌత‌మ్ గారు నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చినందుకు మీకు చాలా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఫైట్‌మాస్ట్ర్ ఫైట్ సీన్స్ చాలా బాగా డిజైన్ చేశారు. డైరెక్ట‌ర్ డిపార్ట‌మెంట్ నాకు చాలా బాగా స‌పోర్ట్ చేశారు. హీరో బాగా ఎంతో ఓర్పుతో క‌ష్ట‌ప‌డి చేశారు. ఎల్సా కూడా చాలా బాగా న‌టించింది. శివ గారు నాకు ఫేస్‌బుక్ ద్వారా ప‌రిచయం అయ్యారు. లాంగ్వేజ్ విష‌యంలో నాకు బాగా హెల్ప్ చేశారు అని అన్నారు.


హీరోయిన్ ఎల్సా మాట్లాడుతూ... ఇది నా మొద‌టి డెబ్యూ చిత్రం. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన గౌత‌మ్ గారికి డైరెక్ట‌ర్‌గారికి, కృష్ణ‌గారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. నాకు లాంగ్వేజ్ విష‌యంలో చాలా బాగా హెల్ప్ చేశారు. ప్లీజ్ మీరంద‌రూ త‌ప్ప‌కుండా సినిమాని చూసి ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.
ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో అశోక్‌కుమార్‌, సంతోష్‌కుమార్‌, రంగ‌రాజు, సీనియ‌ర్‌జ‌ర్న‌లిస్ట్ వినాయ‌క‌రావ్‌, ర‌వికుమార్‌, కాశీ, బెన‌ర్జీ, ర‌విప్ర‌కాష్‌, సురేష్‌కొండేటి, మాధ‌వ్‌, పెద్దిసురేష్‌, కందికొండ త‌దిత‌రులు పాల్గొన్నారు.


న‌టీన‌టులు... కృష్ణ‌, ఎల్సాగోష్‌, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, గౌతంరాజ్‌, బెన‌ర్జీ, ర‌విప్ర‌కాష్‌, సూర్య‌, స‌న‌, దొర‌బాబు, సంజు, స‌హ‌స్ర‌, త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ః బోలే ష‌వాలీ, కెమెరామెన్ః ఎ. విజ‌య్‌కుమార్‌, ఎడిట‌ర్ః మార్తాండ్‌, కె.వెంక‌టేష్‌, ద‌ర్శ‌కుడుఃశ్రీ‌నాద్‌పుల‌క‌రం, నిర్మాతః బిజెఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్‌.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !