View

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ప్రీ రిలీజ్‌ వేడుక విశేషాలు

Wednesday,June19th,2019, 11:49 AM

న‌వీన్ పొలిశెట్టి, శృతి శ‌ర్మ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌’. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాల‌ను పూర్తి చేసుకుని యు/ఏ స‌ర్టిఫికేట్‌ను తెచ్చింది. స్వరూప్ ఆర్‌.ఎస్‌.జె ద‌ర్శకుడు. రాహుల్ యాద‌వ్ న‌క్కా నిర్మాత‌. ఈ చిత్రాన్ని జూన్ 21న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సాయి తేజ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. బిగ్ టికెట్‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా...


సుప్రీమ్ హీరో సాయితేజ్ మాట్లాడుతూ - నేను ఎ.ఐ.బిలో న‌వీన్ వీడియోస్‌ను చాలానే చూశాను. అత‌న్ని రెగ్యుల‌ర్‌గా ఫాలో అయ్యేవాడిని. త‌ను మంచి యాక్ట‌ర్‌. ఇప్పుడు త‌న సినిమా రంగంలోకి రావ‌డం ఆనందంగా ఉంది. ఓ మంచి సినిమాతో మ‌న ముందుకు రాబోతున్నాడు. పోస్ట‌ర్స్‌ను చూసి చాలా ఇన్‌స్ఫైర్ అయ్యాను. నాకు చాలా ఇష్ట‌మైన సినిమా చంట‌బ్బాయ్‌. అదే జోన‌ర్‌లో ఈ సినిమాను చేయ‌డం ఆనందంగా ఉంది. జూన్ 21న విడుద‌ల‌కానున్న ఈసినిమా కోసం ఆస‌క్తిగా ఎద‌రుచూస్తున్నాను. న‌వీన్‌, హీరో స్వ‌రూప్‌, నిర్మాత రాహుల్‌గారికి అభినంద‌న‌లు. టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


న‌వీన్ పొలిశెట్టి మాట్లాడుతూ - మేం ట్రైల‌ర్ విడుద‌ల చేసిన‌ప్పుడు మాకు ట్విట్ట‌ర్ ద్వారా ఏ సెల‌బ్రిటీ స‌పోర్ట్ చేస్తారా? అని ఎదురుచూస్తున్న త‌రుణంలో సాయితేజ్ మా ట్రైల‌ర్‌ను షేర్ చేయ‌డం ద్వారా ఎంతో హెల్ప్ చేశాడు. త‌న‌కు ఈ సంద‌ర్భంగా థాంక్స్ చెబుతున్నాను. అలాగే డైరెక్ట‌ర్ స్వ‌రూప్‌కి స్పెష‌ల్ థాంక్స్‌. ఆయ‌న క‌థ‌ను సిద్ధం చేసుకున్న త‌ర్వాత ఎంద‌రో హీరోలు ముంద‌కు వ‌చ్చినా, నాతోనే సినిమా చేయాల‌ని వెయిట్ చేశారు. మా అంద‌రినీ 720 పిక్స‌ల్ వీడియో నుండి 70 ఎం.ఎం స్క్రీన్ వ‌ర‌కు తీసుకు వ‌చ్చిన అంద‌రికీ థాంక్స్‌. సినిమా హీరో కావాల‌నేది నా డ్రీమ్‌. ఆ క‌ల నేర‌వేరింది. రెండున్న‌రేళ్ల క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా ఇది. 21న ఈ సినిమా విడుద‌ల కానుంది. మా ప్ర‌య‌త్నాన్ని ఆశీర్వ‌దించాల‌ని.. హిలేరియ‌స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌ని చెప్ప‌గ‌ల‌ను అన్నారు.


డైరెక్ట‌ర్ స్వరూప్ ఆర్‌.ఎస్‌.జె మాట్లాడుతూ - డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరి స్క్రిప్ట్ రాసే క్ర‌మంలో నాకు చాలా టిప్స్ చెబుతూ వ‌చ్చాడు. టీజ‌ర్ రిలీజ్ అయిన త‌ర్వాత థ్రిల్ల‌ర్ మూవీకి ఓ సెక్ష‌న్ ఆఫ్ ఆడియ‌న్స్ మాత్ర‌మే ఉంటార‌ని కొంద‌రు స్నేహితులు చెప్పారు. ఈ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యే సినిమా ఇది. కుటుంబ క‌థా థ్రిల్ల‌ర్ చిత్రం. మ‌రికొంద‌రు చంటబ్బాయ్ సినిమాలాగే ఉంద‌ని కూడా అన్నారు. అయితే చంట‌బ్బాయ్ అనేది ఓ క్లాసిక్‌. దాన్ని ఎవ‌రూ ముట్టుకోకూడ‌దు. కాబ‌ట్టి, మేం చంట‌బ్బాయ్ సినిమా చేయ‌లేదు. చిరంజీవిగారి, జంధ్యాల‌గారి టైమింగ్ మేం 1 శాతం కూడా మ్యాచ్ చేయ‌లేం. రాహుల్ నిర్మాత‌గా కంటే మంచి స్నేహితుడిగా నాకు స‌పోర్ట్ ఇచ్చారు. దాదాపు అంద‌రూ కొత్త‌వాళ్ల‌తో చేసిన చిత్ర‌మిది. 21న సినిమా చూసే ప్రేక్ష‌కుల‌కు, మంచి సినిమా చూశామ‌నే ఫీలింగ్‌తో బ‌య‌ట‌కు వెళ‌తార‌ని చెప్ప‌గ‌ల‌ను అన్నారు.


గౌత‌మ్ తిన్న‌నూరి మాట్లాడుతూ - నిర్మాత రాహుల్ కొత్త ద‌ర్శ‌కుల‌పై న‌మ్మ‌కంతో సినిమా చేయ‌డం గొప్ప విష‌యం. నాకు కూడా త‌నే డైరెక్ట‌ర్‌గా అవ‌కాశం ఇచ్చాడు. భ‌విష్య‌త్‌లో చాలా మంది కొత్త వారిని ప‌రిచ‌యం చేయాల‌ని కోరుకుంటున్నాను. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌` చాలా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ గారు చేసిన సపోర్ట్ మర్చిపోలేనిది.. అయన కు నా ప్రత్యేక కృతజ్ఞతలు.. కొత్తవాళ్ళని ఇంట్రడ్యూస్ర్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాను.. మళ్ళీ రావా సినిమా తో గౌతమ్ మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చాడు.. ఐదుగురి ని ఇండస్ట్రీ కి పరిచయం చేయాలనీ నిశ్చయించుకున్నాను.. ఈ సినిమా ను అందరు చూసి విజయవంతం చేయాలనీ కోరుకుంటున్నాను అన్నారు.


కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు మహా వెంకటేష్ మాట్లాడుతూ.. మొదటిసారి ఈ సినిమా టైటిల్ విన్నప్పుడు చాల పెద్ద టైటిల్ పెట్టారనుకున్నాను.. ఇండస్ట్రీ కి చాల మంది కొత్త దర్శకులు వస్తున్నారు.. కానీ స్వరూప్ చాల మంచి సినిమా తో వస్తున్నారు.. నవీన్ పోలిశెట్టి సినిమా లు చూశాను.. మంచి యాక్టర్.. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది.. కథ చాల ఫ్రెష్ గా ఉంది.. అందరికి అల్ ది బెస్ట్ అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !