View

రాగల 24 గంటల్లో.. ఫస్ట్ లుక్ విడుదల

Sunday,June23rd,2019, 08:51 AM

శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ సమర్పణలో శ్రీ నవహాస్ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో సత్యదేవ్, ఈషా రెబ్బ, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం రాగల 24 గంటల్లో. హీరో శ్రీరామ్ ముఖ్య పాత్రలో నటించారు. శ్రీనివాస్ కానూరు నిర్మాత. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైద్రాబాద్ లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్స్ లో జరిగింది.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ... హీరోయిన్ ఈషా రెబ్బ, హీరో శ్రీరామ్, గణేష్ వెంకట్రామన్, నటుడు కృష్ణ భగవాన్ లతో పాటు తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించారు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో...


హీరో సత్యదేవ్ మాట్లాడుతూ .. ఈ టైటిల్ చూస్తుంటే మనకు బాగా తెలిసిందే .. ఎందుకంటే చిన్నప్పటినుండి మనం వాతావరణం గురించి తెలుసుకోవాలంటే వాళ్ళు ఇదే డైలాగ్ చెబుతారు. అదెంత పాపులర్ అన్నది మనకు తెలుసు. ఇప్పుడు అదే క్రేజీ టైటిల్ ని తీసుకుని ఓ ఆసక్తికర కథను శ్రీనివాస్ రెడ్డి గారు అద్భుతంగా తెరకెక్కించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందన్న నమ్మకం ఉందని అన్నారు.


హీరోయిన్ ఈషా రెబ్బా మాట్లాడుతూ .. ఈ సినిమాలో చాలా మంచి రోల్ చేసాను. నా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నటనకు చాలా ఆస్కారం ఉంటుంది. ఇంత మంచి కథలో నన్ను హీరోయిన్ గా ఎంపిక చేసిన దర్శక నిర్మాతలకు థాంక్స్ చెబుతున్నాను. ఈ పాత్రతో నాకు మరింత మంచి గుర్తింపు వస్తుంది అన్నారు.


హీరో శ్రీరామ్ మాట్లాడుతూ .. కామెడీ ఎంటర్ టైనర్ చిత్రాలను బాగా డీల్ చేసే శ్రీనివాస్ రెడ్డి ఈ సారి సరికొత్త తరహాలో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించాడు. ఇది పూర్తిస్థాయి సీరియస్ సినిమా కాదు .. ఆద్యంతం నవ్వులు పండిస్తూనే... అందరిలో ఆసక్తి రేపుతోంది. నా పాత్రకు కథలో చాలా కీలకంగా ఉంటుంది. అదేమిటన్నది ఇప్పుడు సస్పెన్స్ అన్నారు.


నిర్మాత కానూరు శ్రీనివాస్ మాట్లాడుతూ .. ఈ కథ నన్ను చాలా ఆకర్షించింది. రెగ్యులర్ ఫార్మేట్ తో వస్తున్న చిత్రాలకు బిన్నంగా ఉంటుంది. ప్రతి నిమిషాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే షూటింగ్ పూర్తీ కావొచ్చింది. త్వరలోనే విడుదల డేట్ ప్రకటిస్తాం. శ్రీనివాస్ రెడ్డి తో సినిమా అంటే ఎంత సరదాగా ఉంటుందో అందరికి తెలుసు. అయన మంచి మనిషి. తప్పకుండా ఈ సినిమాతో ఆయనకు మంచి పేరొస్తుంది అన్నారు.


దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ .. రాగల 24 గంటలు అంటే ఏమిటో అందరికి తెలుసు .. మనం వాతావరణం గురించి తెల్సుకోవాలంటే రేడియోల్లో, టీవీల్లో రాగల 24 గంటల్లో అని చెప్పేవారు. అయితే ఈ రాగల 24 గంటల్లో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి అవి ఏమిటన్నదే ఈ సినిమా. ఇప్పటి వరకు కామెడీ, ఎంటర్ టైనర్ చిత్రాలను తెరకెక్కించిన నేను మొదటి సారి థ్రిల్లర్ సినిమా చేస్తున్నాను. అయిన ఇందులో ఫన్ అక్కడ మిస్ అవ్వదు. సత్యదేవ్, ఈషా రెబ్బ చక్కగా చేసారు. ఇక శ్రీ రామ్ మన తెలుగు హీరో అని అందరికి తెలుసు .. అయన ఈ సినిమాలో కీ రోల్ పోషిస్తున్నాడు. ఇక మిగతా పాత్రలు కూడా ఆద్యంతం ఆకట్టుకుంటాయి. షూటింగ్ తో పాటు మిగతా కార్యక్రమాలన్నీ త్వరగా పూర్తీ చేసి చిత్రాన్ని వచ్చే నెలలో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం అన్నారు.


ఈ చిత్రానికి కథ : వై శ్రీనివాస్ వర్మ, మాటలు : కృష్ణ భగవాన్, సంగీతం : రఘు కుంచె, పాటలు : భాస్కర భట్ల, శ్రీ మణి, కెమెరా : అంజి, ఆర్ట్ : చిన్నా, ఎడిటింగ్ : తమ్మిరాజు , యాక్షన్ : విక్కీ మాస్టర్, డాన్స్ : స్వర్ణ మాస్టర్, భాను మాస్టర్ , నిర్మాత : శ్రీనివాస్ కానూరు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శ్రీనివాస్ రెడ్డి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !