filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz
filmybuzz

View

జై సేన కు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ - సముద్ర

Monday,June24th,2019, 02:44 PM

శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌గౌతమ్‌లను హీరోలుగా పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయి అరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం 'జై సేన'. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన టైటిల్‌, మోషన్‌ పోస్టర్‌, సునీల్‌ టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. కాగా, ఈ సినమాలోని మొదటి పాట 'సేన జైసేన... యుద్ధం చెయ్‌' అంటూ సాగే మొదటి పాటను జూన్‌ 23న హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో విడుదల చేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు బి.గోపాల్‌ 'జైసేన' మొదటి పాటను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు సునీల్‌, దర్శకుడు వి.సముద్ర, కోప్రొడ్యూసర్‌ శిరీష్‌రెడ్డితోపాటు ఇతర నటీనటులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా బి.గోపాల్‌ మాట్లాడుతూ ''ఈ సినిమా సూపర్‌హిట్‌ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కాన్సేప్టే చాలా ఆరుగురు యంగ్‌స్టర్స్‌తోపాటు శ్రీకాంత్‌, సునీల్‌ కూడా చాలా మంచి క్యారెక్టర్స్‌ చేశారు. తప్పకుండా ఈ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.


నటుడు సునీల్‌ మాట్లాడుతూ ''సముద్ర డైరెక్షన్‌లో చేసిన 'జైసేన'లో చాలా మంచి క్యారెక్టర్‌ చేశాను. సముద్ర కోడైరెక్టర్‌గా ఉన్నప్పుడు నన్ను ఎలా చూసుకున్నారో, ఇప్పుడూ అలాగే చూసుకుంటున్నారు. ఇందలో నేను పోలీస్‌ ఆఫీసర్‌ కారెక్టర్‌ చేశాను. నేను చాలా సీరియస్‌గా యాక్ట్‌ చేస్తుంటాను. దానికి మీ అందరికీ నవ్వొస్తుంది. నాకు డైలాగ్స్‌ తక్కువ యాక్షన్‌ ఎక్కువ ఉంటుంది. అలాగే శ్రీకాంత్‌ అన్నయ్య ఓ మంచి క్యారెక్టర్‌ చేశారు. అప్పట్లో టి.కృష్ణగారు మంచి సందేశంతో సినిమాలు తీసేవారు. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన ు రేపటిపౌరులు సినిమా చూశాను. రేపటిపౌరులు సినిమా చూశాను. అందులో నలుగురు పిల్లలతో చేసిన సినిమా అది. అలా ఈ సినిమాలో నలుగురు యంగ్‌స్టర్స్‌ ఉంటారు. సినిమా చాలా బాగుంది. డబ్బింగ్‌ చెప్పేటపుడు చూశాను. మంచి మెసేజ్‌తో చేసిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఈ సినిమలో నాకోసం చందు చాలా మంచి డైలాగ్స్‌ రాశాడు. నాకు ఎలా చేయాలో తెలియని టైమ్‌లో సీరియస్‌గా కనిపిస్తూనే కామెడీ చేసేలా చేశాడు చందు. ఫ్యూచర్‌లో కూడా ఇలాంటి డైలాగ్స్‌ నాకు రాయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.


ప్రీతి శర్మ మాట్లాడుతూ ''నేను బెంగుళూరు నుంచి వచ్చాను. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్‌. సముద్రగారు నన్ను కూతురులా బాగా చూసుకున్నందుకు థాంక్స్‌. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ థాంక్స్‌'' అన్నారు.


నీతు గౌడ మాట్లాడుతూ ''సముద్రగారు మంచి హ్యూమన్‌ బీయింగ్‌. ఈ సినిమాలో ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్‌. నన్ను సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌'' అన్నారు.


ప్రవీణ్‌ మాట్లాడుతూ ''ఇలా ఈ స్టేజ్‌మీద ఉండి మీ అందరితో ఇలా మాట్లాడుతున్నామంటే కేవలం సముద్రగారి వల్లే. మీ అందరి బ్లెస్సింగ్స్‌ మాకు ఉండాలని కోరుకుంటున్నాను'' అన్నారు.


అభిరామ్‌ మాట్లాడుతూ ''ఈ సినిమా టైటిల్‌కి వచ్చిన రెస్పాన్స్‌ అంతా ఇంతా కాదు. చాలా చోట్ల నుంచి అందరూ ఫోన్లు చేసి విష్‌ చేయడం చాలా ఆనందం కలిగించింది. మా మొదటి సినిమాలోనే పెద్ద ఆర్టిస్టులతో వర్క్‌ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడు రిలీజ్‌ చేసిన జైసేన సాంగ్‌ కూడా మీ అందరికీ నచ్చుతుంది'' అన్నారు.


కార్తికేయ మాట్లాడుతూ ''టైటిల్‌కి, సునీల్‌గారి టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈరోజు రిలీజ్‌ అయిన జైసేన సాంగ్‌కి కూడా మంచి బూస్టప్‌ వస్తుందని ఆశిస్తున్నాను. రవిశంకర్‌గారు చాలా మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. ఇందులో ఇంకా మంచి పాటలు ఉన్నాయి. ఆన్‌ సెట్స్‌లో మాకు ఎంతో సపోర్ట్‌ చేసిన సునీల్‌గారికి థాంక్స్‌'' అన్నారు.


హరీష్‌ గౌతమ్‌ మాట్లాడుతూ ''ఈ అవకాశం ఇచ్చిన సముద్రగారికి థాంక్స్‌. ఇప్పటివరకు రిలీజ్‌ అయిన మోషన్‌ పోస్టర్‌కి, టైటిల్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మా సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు.


వి.సముద్ర మాట్లాడుతూ ''మా గురువుగారి చేతుల మీదుగా జైసేన మొదటి సాంగ్‌ లాంచ్‌ అయింది. ఈ సాంగ్‌ రాసింది చందు. మా సునీల్‌ అన్నయ్య చెప్పిన ప్రతి డైలాగ్‌ చందునే రాశాడు. అన్నయ్య టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఒకరోజులోనే 1 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. అంత గొప్ప రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే నాకు ఈ సినిమా విషయంలో రైట్‌ హ్యాండ్‌గా ఉన్న వ్యక్తి మా కోప్రొడ్యూసర్‌ శిరీష్‌రెడ్డి. ఇండస్ట్రీకి మంచి ప్రొడ్యూసర్‌, ఫైనాన్షియర్‌ అవుతాడు. నా సినిమాకి ఇంత హెల్ప్‌ చేసినందుకు శిరీష్‌కి చాలా చాలా థాంక్స్‌. అలాగే దేశినేని శ్రీను మొదటి నుంచి నా కష్టాల్లో, సుఖాల్లో నా వెన్నంటి ఉన్నాడు. శ్రీను కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా విషయానికి వస్తే టైటిల్‌కి చాలా అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. అందరి హీరోల అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అంతకన్నా గొప్పగా పవర్‌స్టార్‌ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల నుంచి బీభత్సమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఆ సపోర్ట్‌ ఉంటే ఈ సినిమా బీభత్సం సృష్టిస్తుంది. ప్రజలు బాగుండాలని పవన్‌కల్యాణ్‌గారు ఎంతో తాపత్రయపడుతూ యుద్ధం చేద్దామని ఎంత నిజాయితీగా ఉన్నాడో అలా ఈ సినిమాకి వాళ్ళందరూ అండగా ఉన్నారు కాబట్టి ఆ తర్వాత రిలీజ్‌ అయిన మా సునీల్‌ అన్నయ్య ఉన్న టీజర్‌ ఇంకా పెద్ద సక్సెస్‌ చేశారు. అలా ప్రతి స్టెప్‌లో జైసేనను సక్సెస్‌ చేస్తున్న అందరి హీరోల అభిమానులకు, ముఖ్యంగా పవన్‌కల్యాణ్‌గారి అభిమానులకు థాంక్స్‌ చెప్తున్నాను. ఈ సినిమా ఆడియో అత్యద్భుతంగా వచ్చింది. జైసేన లిరికల్‌ వీడియో త్వరలో రిలీజ్‌ అవుతుంది. ఆ తర్వాత విజువల్‌ వీడియో రిలీజ్‌ అవుతుంది. ఇంత మంచి మ్యూజిక్‌ ఇచ్చిన రవిశంకర్‌కి థాంక్స్‌ చెప్తున్నాను. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన వాసు నాతో ఇంతకుముందు నాలుగు సినిమాలు చేశాడు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్‌ నాకు ఎంతో వెన్నుదన్నుగా నిలిచారు. ఎంతో సక్సెస్‌ఫుల్‌గా ఈ సినిమాని పూర్తి చేసి ఇంకా మరెన్నో మంచి సినిమాలు చేసే ధైర్యాన్ని నాకు ఇచ్చారు. దాన్ని మించే విధంగా ఈ సినిమాను సక్సెస్‌ చెయ్యబోతున్నాను. మంచివాడు అంటే కృష్ణగారి గురించి చెప్తాం. శ్రీకాంత్‌ కూడా అంత మంచి వ్యక్తి. సాధారణంగా షూటింగ్‌కి నెలరోజులు, పది రోజుల ముందు హీరోను కలుస్తారు. రేపు షూటింగ్‌ పెట్టుకొని ఈరోజు వెళ్ళి కలిశాను. ఎల్లుండి పెట్టుకో వచ్చేస్తున్నాను అన్నారు. శ్రీకాంత్‌ అన్నయ్యకి థాంక్స్‌ చెప్తున్నాను. సొసైటీ అనేది ఇలా ఉండాలి అనే విధంగా ప్రతి ఒక్కరినీ ఈ సినిమా ఇన్‌స్పైర్‌ చేస్తుంది. పొలిటికల్‌ లీడర్స్‌ని, యూత్‌ని, అందర్నీ ఆలోచింపజేసే సినిమా ఇది. ఈ సినిమా గొప్ప సక్సెస్‌ సాధించి మా అందరికీ మంచి విజయాన్ని ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నారు.


కో-ప్రొడ్యూసర్‌ పి.శిరీష్‌రెడ్డి మాట్లాడుతూ - ''ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్యాచ్‌వర్క్‌ జరుగుతోంది. నాలుగు రోజుల్లో పూర్తవుతుంది. త్వరలోనే రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.


రచయిత చందు మాట్లాడుతూ ''మంచితనం, మొండితనం కలిసి డైరెక్ట్‌ చేస్తే అది జైసేన. ఇప్పుడు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, టిక్‌టాక్‌...ఇలా ఎన్నో యాప్‌లు ఉన్నాయి. ఏదో ఒకరోజు రైతుకోసమే శ్రమిస్తున్న జైసేన అనే యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే రోజు వస్తుంది. సొసైటీలోని అన్నిరంగాలు లాభదాయకంగానే ఉంటున్నాయి. కానీ, ఎంతో డిమాండ్‌ ఉన్న ఫుడ్‌ని అందించే రైతు సక్సెస్‌రేట్‌ ఎందుకని తక్కువగా ఉంది. అందుకే రైతును సపోర్ట్‌ చేస్తూ అతని కోసం పోరాటం చేస్తుంది జైసేన'' అన్నారు.


శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌గౌతమ్‌ హీరోలుగా పరిచయం అవుతున్నారు. అజయ్‌ ఘోష్‌, మధు, ఆజాద్‌, ధనరాజ్‌, వేణు, చమ్మక్‌ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: తిరుమల శెట్టి సుమన్‌, పార్వతిచందు, పాటలు: అభినయ్‌ శ్రీను, సిరాశ్రీ, సంగీతం: రవిశంకర్‌, డ్యాన్స్‌: అమ్మారాజశేఖర్‌, అజయ్‌, ఫైట్స్‌: కనల్‌ కన్నన్‌, నందు, రవివర్మ, కెమెరా: వాసు, కో ప్రొడ్యూసర్స్‌: పి.శిరీష్‌ రెడ్డి, దేవినేని శ్రీనివాస్‌, నిర్మాత: వి.సాయి అరుణ్‌ కుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: వి.సముద్ర.


'JAISENA* garners tremendous reponse from PAVAN KALYAN fans - Director V.Samudra


Srikanth, Sunil in lead roles, Introducing Sree Karthikeya, Abhiraam, Praveen, Hareesh Gowtham in other lead roles Director V Samudra is coming with 'Jai Sena'. V Vijayalakshmi is presenting this film while V Sai Arunkumar is Producing in Siva Mahateja Films banner. Title, Motion Poster and Sunil Teaser of the film have garnered a very good response. The first song from the film, 'Sena Jai Sena...Yuddham Chey' is released on June 23rd at Prasad Lab, Hyderabad. B Gopal attended the event as chief guest and launched the song. Along with Actor Sunil, Director V Samudra, Co-Producer Sirish Reddy all other actors were present at the event.


On this occasion, B Gopal said, " I heartfully wish this film to become a Superhit. Along with six youngsters, Srikanth and Sunil did very good characters. This film will definitely become a Big Hit."


Actor Sunil said, " I did a very good role in Samudra's 'Jai Sena'. Samudra garu looks after me even today like he took care of me while he was working as a co-director. I did the role of a police officer in this film. I act very seriously in the film. But, you all will laugh for my act. I have fewer dialogues and more action in this film. Srikanth anna did a very good role. In the past, T Krishna garu used to do films with very good messages. I have seen his 'Repati Pourulu' film. That film features four kids. Similarly, this film features four youngsters. The film came out very well. I watched the film while dubbing for my character. Everyone will like this film which has conveyed a very good message. Chandu has written very good dialogues for my character. When I don't know about what to do, Chandu made me do comedy with my serious looks. I wish I get more roles with kind of dialogues in the future."


Preethi Sharma said, " I am from Bengaluru. Thanks for giving me this opportunity to work in this film. Thanks to Samudra garu who looks after me like a daughter. Thanks to everyone who worked for this film for their support."
Neetu Gouda said, " Samudra garu is a very good human being. Thanks for giving me such a good opportunity. Thanks to all for supporting me."


Praveen said, " It is because of Samudra garu only, today we are standing on this stage. We seek your blessings and support for us."


Abhiram said, " The title of the film gets a superb response. I am very happy receiving calls from many places and wished us. We are lucky to work with big artists for our first film. All of you will like the first song of 'Jai Sena' which is released today."


Sree Karthikeya said, " Title and Sunil gari teaser have received a terrific response. The first song which is released today will also receive similar response. Ravishankar garu has given superb music. This film has very good songs. Thanks to Sunil garu for supporting us onsets."


Hareesh Gowtham said, " Thanks to Samudra garu for this opportunity. Title and Motion poster of the film got a terrific response. I believe our film will become very good success."


V Samudra said, " First song of 'Jai Sena' is launched by my guruvu garu. Chandu penned this song. Every dialogue of Sunil Annayya is written by Chandu. Sunil annayya's teaser is getting tremendous response. Teaser crossed 1 Million views within a single day. Co-producer Sirish Reddy is my right hand during the making of this film. He will become very good producer, financiar in the industry. Thanks to Sirish for his help. Desineni Srinu stands with me at all times for my film. I wish him a bright future. Title gets thumping response. All heroes fans appreciated the title. Especially the title recieved thunderous response from Pawan Kalyan fans. With such kind of support film will create a sensation. Pawan Kalyan Garu has waged a war for people with utmost honesty. His fans too stood with the film with the same kind of honesty. Success of Sunil Annayya's teaser stands as a testament for their support towards 'Jai Sena'. Thanks to all heroes fans who are making 'Jai Sena' a success at every step, especially Pawan Kalyan gari fans. Audio came out superbly. Lyrical video of 'Jai Sena..' song will be released very soon. Then we will release Visual Video of the song. Thanks to Ravishankar for giving such a terrific album. Vasu handled the camera for this film. He has worked for four films with me. Every artist and technician stand with me throughout the film. I Successfully completes the film with their support and gave me strength and confidence to make more films. I will make this film successful. Whenever we say about good human being, we say about Hero Superstar Krishna garu. Srikanth also a very good natured person like him. Usually we meet heroes one month, 10 days before the shoot. I met him one day before the shoot and he asked me to arrange the shoot the next day. Thanks to Srikanth Annayya. This film will inspire everyone about how our society should be. This is a thought provoking film for all political leaders and youth. I heartfully wish this film will become a huge hit and gives us a big success."


Co-Producer P Sirish Reddy said, " FIlm is currently undergoing its patchwork which will be completed in four days. We are planning to release the film very soon."


Writer Chandu said, " Now-a-days we have many apps like Facebook, Twitter, Tik Tok... One day will come where everyone will download an app like 'Jai Sena' which is fighting for farmer. All fields in the society are running with profits. But, whythe success rate of a farmer who produces food in not upto the mark. 'Jai Sena' supports and fights for farmer."

 

Srikanth, Sunil, Sree Karthikeya, Prudhvi, Praveen, Abhiram, Harish Goutham, Ajay Ghosh, Madhu, Azad, Dhanraj, Venu, Chammak Chandra and Others


Dialogues: Thirumalasetty Suman, Parvathy Chand, Lyrics: Abhinay Srinu, SiraSri, Music: Ravishankar, Dance: Amma Rajasekhar, Ajay, Fights: Kanal Kannan, Nandu, Ravi Varma, Camera: Vasu, Co-Producers: P Sirish Reddy, Devineni Srinivas, Producer: V Sai Arunkumar, Story-Screenplay-Direction: V SamudraAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !