View

రాజశేఖర్ కల్కి హానెస్ట్ ట్రైలర్ విడుదల

Monday,June24th,2019, 04:06 PM

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'కల్కి'. శివానీ, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. 'అ!' వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, కమర్షియల్ ట్రైలర్, 'హార్న్ ఓకే ప్లీజ్', 'ఎవరో ఎవరో' పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్ రైట్స్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. హైదరాబాద్ లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రశాంత్ వర్మ 'కల్కి' హానెస్ట్ ట్రైలర్ విడుదల చేశారు.


రాజశేఖర్‌ మాట్లాడుతూ ‘‘ప్రవీణ్‌ సత్తారు, ప్రశాంత్‌ వర్మ... నాకు సపోర్ట్‌గా ఇద్దరు సూపర్‌ డైరెక్టర్స్‌ ఉన్నారనే ఫీల్‌తో ఉన్నాను. ఇంతకు ముందు కోడి రామకృష్ణగారు, ముత్యాల సుబ్బయ్యగారు, రవిరాజా పినిశెట్టిగారు... నాతో చాలా ఎక్కువ సినిమాలు చేశారు. నేను ఎప్పుడైనా కమర్షియల్‌గా కిందకు దిగితే వాళ్లు కాపాడతారనే విశ్వాసం, ధైర్యం ఉండేవి. ఇప్పుడు ప్రవీణ్‌ సత్తారు, ప్రశాంత్‌ వర్మతో ధైర్యం వచ్చింది. సి. కల్యాణ్‌గారిని ఇంత కాన్ఫిడెంట్‌గా, హ్యాపీగా బిగినింగ్‌లో చూశా. ఈ మధ్య చూసింది లేదు. ఆయన సంతోషానికి కారణం ‘కల్కి’. నేనింకా సినిమా చూడలేదు. జస్ట్‌ మూడు రీళ్లు మాత్రమే చూశా. ఎందుకంటే... ఫీల్‌ ఎలా ఉందని! ఈ సినిమాలో నేను నటించినా... నెక్ట్స్‌ ఏం వస్తుందోననేది ఊహించలేకపోయా. పోను పోను సూపర్‌గా ఉంటుంది. మా పిల్లలు ఫస్టాఫ్‌ వరకు చూడమన్నారు. నేను చూడలేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే... సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. దీనంతటికీ కారణం ప్రవీణ్‌ సత్తారుగారు. ఆయన నాకు ఒక మార్క్‌ సెట్‌ చేశారు. క్లాస్‌లో మనం డిస్టింక్షన్‌లో పాస్‌ అయితే... తర్వాత ఆ మార్కుల కంటే తక్కువ వస్తే అందరూ తిడతారు. ‘గరుడవేగ’తో మమ్మల్ని ప్రవీణ్‌ సత్తారుగారు ఒక లెవల్‌లో పెట్టారు. ఇప్పుడు మేం లెవల్‌కి వెళ్లాలనేది మా అందరి టార్గెట్‌. మా మదర్‌ మరణించారనే బాధతో నేనోసారి బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకోలేదు. ప్రవీణ్‌ సత్తారుగారు నన్ను, మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ని వాళ్లింటికి పిలిచి సెలబ్రేట్‌ చేశారు. హోమ్‌ థియేటర్‌లో ‘గరుడవేగ’ ట్రైలర్‌ అందరికీ చూపించారు. అక్కడికి ప్రశాంత్‌ వర్మ కూడా వస్తే... ఆయన్ను పక్కకి తీసుకువెళ్లి ‘ప్రశాంత్‌! మనం ఈ ట్రైలర్‌ని బీట్‌ చేయాలి. నీ వల్ల కుదురుతుందా?’ అన్నాను. ప్రవీణ్‌ సత్తారు పెట్టిన టార్గెట్‌ని బీట్‌ చేయాలి లేదా రీచ్‌ అవ్వాలి అనే ఆలోచనతో కష్టపడి సినిమా చేశాం. రీచ్‌ అయ్యామనే అనుకుంటున్నాం. ‘గరుడవేగ’తో పోలిస్తే... ఇది డిఫరెంట్‌ ఫిల్మ్‌. కాకపోతే ఆ సినిమా చూసిన ఆడియన్స్‌కి కచ్చితంగా ‘కల్కి’ శాటిష్‌ఫ్యాక్షన్‌ ఇస్తుందని చెప్పగలను. నా ప్రతి సినిమాకు జీవిత చాలా కష్టపడతారు. నేను కథ విన్నాక... క్యారెక్టర్‌ గురించి ఆలోచిస్తా. ప్రొడక్షన్‌ గురించి ఆలోచించను. జీవిత కష్టపడి కల్యాణ్‌గారు చెప్పిన బడ్జెట్‌లో సినిమాను పూర్తి చేశారు. అలాగే, ఈ సినిమాకు నాతో పాటు మా పిల్లలకు కూడా కష్టపడ్డారు. చిరంజీవిగారితో వాళ్లబ్బాయి సినిమా ప్రొడ్యూస్‌ చేస్తున్నారని అనగానే... నాకు అబ్బాయి ఉంటే చేసేవాడని అనుకున్నా. మా అమ్మాయిలు ఇద్దరూ సూపర్‌గా చేశారు. అయామ్‌ వెరీ హ్యాపీ. ప్రవీణ్‌ సత్తారు, ప్రశాంత్‌ వర్మ నా నటనను కొత్తగా చూపించారు. యంగ్‌ జనరేషన్‌ దగ్గర బాగా వర్క్‌ చేయడం నేర్చుకున్నా. యంగ్‌ జనరేషన్‌కి నేను చెప్పేది ఒక్కటే... మంచి సబ్జెక్ట్‌ ఉంటే రండి, సినిమా చేద్దాం. మనకు సూపర్‌ ప్రొడ్యూసర్‌ కల్యాణ్‌గారు ఉన్నారు. ‘కల్కి’ తర్వాత ‘గరుడవేగ 2’ చేస్తున్నా.’’ అన్నారు.


సి. కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘నేను మా చెల్లెలు జీవిత, రాజశేఖర్‌గారు, మా పిల్లలు శివాని, శివాత్మిక కొరకు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించా. రాజశేఖర్‌గారికి ప్రవీణ్‌ సత్తారుగారు ‘గరుడవేగ’ వంటి గొప్ప సినిమా ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి విజయాన్ని మంచి ఈ ‘కల్కి’ ఉంటుందని మాత్రం గర్వంగా చెప్పగలను. రాజశేఖర్‌గారి డైలాగుల్లో చిన్న ఎంటర్‌టైనింగ్‌ గేమ్‌ కూడా ఉంటుంది. ఒక విధంగా ప్రశాంత్‌ వర్మ చాలా ధైర్యంగా చేశారు. నేను సినిమా చూశా. అంతకు ముందు రషెస్‌ ఏవీ చూడలేదు. నిర్మాతగా చెబుతున్నా... కథ విన్నప్పుడు డిఫరెంట్‌ సబ్జెక్ట్‌, ఈ రోజుల్లో దర్శకులు డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నారని అనుకున్నా. థియేటర్‌లో లాస్ట్‌ రీల్‌ వరకూ ఆసక్తిగా చూశాను. అంత క్యూరియాసిటీ కలిగించింది. టెక్నికల్‌ వేల్యూస్‌తో, హై బడ్జెట్‌తో తీసిన చిత్రమిది. ఈ సినిమా తర్వాత ‘మళ్లీ గరుడవేగ, కల్కి వంటి సినిమాలు ఎప్పుడు చేస్తారు?’ అని అందరూ అడుగుతారు. అంత మంచి చిత్రమిది. ఈ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. రాజశేఖర్‌గారి సినిమాను ఒకే బయ్యర్‌ కొనడం నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. ‘కల్కి’ వరల్డ్‌వైడ్‌ థియేట్రికల్‌ రైట్స్‌ను కె.కె. రాధామోహన్‌గారు తీసుకున్నారు. ఆయన దగ్గర్నుంచి మళ్లీ ప్రాంతాలవారీగా వేర్వేరు వ్యక్తులు తీసుకుంటున్నారు. ఈ సినిమాకు ఇంత క్రేజ్‌ రావడానికి కారణం ప్రశాంత్‌ వర్మ. అతనికి థ్యాంక్స్‌. టీజర్స్‌, ట్రైలర్‌లో మేకింగ్‌ ఎలా ఉందో చూపించాడు. ఎడిటర్‌ గౌతమ్‌, సినిమాటోగ్రాఫర్‌ శివ, మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్రవణ్‌ భరద్వాజ్‌ గ్రేట్‌ అవుట్‌పుట్‌ ఇచ్చారు. వారం రోజులుగా రాత్రింబవళ్లు టీమ్‌ కష్టపడుతున్నారు. సినిమా విడుదలకు ముందు ఎగ్జిబిటర్స్‌ నుంచి వస్తున్న కాల్స్‌తో సక్సెస్‌ ఎంజాయ్‌ చేస్తున్నా. విడుదల తర్వాత డబుల్‌ సక్సెస్‌ ఎంజాయ్‌ చేస్తున్నా’’ అన్నారు.


ప్రవీణ్‌ సత్తారు మాట్లాడుతూ ‘‘రాజశేఖర్‌గారికి జీవితగారు బ్యాక్‌బోన్‌గా ఉన్నారు. జీవితగారు లేకపోతే ‘గరుడవేగ’ అయ్యేది కాదు. ఇప్పుడూ అదే రిపీట్‌ అవుతుందని అనుకుంటున్నా. రాజశేఖర్‌గారు చేసే ప్రతి సినిమాకు జీవితగారు బ్యాక్‌బోన్‌లా ఉంటున్నారు. సినిమాలో విషయం ఉందా? లేదా? అనేది టీజర్‌ రిలీజ్‌ కాగానే తెలుస్తుంది. ‘కల్కి’ మోషన్‌ పోస్టర్‌ నుంచి చాలా క్యూరియాసిటీ కలిగించింది. టీజర్‌, కమర్షియల్‌ ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యాక సినిమాలో ఏదో విషయం ఉందని అందరికీ అర్ధమైంది. ఇప్పుడు హానెస్ట్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. చాలా నిజాయతీగా సినిమా చేశారు. ‘గరుడవేగ’ కన్నా రెండింతలు ఆడాలని కోరుకుంటున్నా. ఇది ఎంత పెద్ద హిట్‌ అయితే... ‘గరుడవేగ 2’కి నేను అంత ఎక్కువ డబ్బులు పెట్టి తీయవచ్చు. నా స్వార్థం నాది. ప్రశాంత్‌ వర్మ తీసిన ‘అ!’ ఫెంటాస్టిక్‌ ఫిల్మ్‌. అటువంటి సినిమాకు స్ర్కీన్‌ప్లే రాయడం చాలా కష్టం. మ్యూజిక్‌, సినిమాటోగ్రఫీ, యాక్టర్స్‌ నుంచి ఫర్ఫార్మెన్స్‌ రాబట్టుకోవడంలో తన కమాండ్‌ ఏంటో ‘అ!’లో మనకు తెలుస్తుంది. టాలెంట్‌ ఉన్న డైరెక్టర్‌. ఈ సినిమా తనకు మంచి పేరు, పెద్ద సినిమాలు తీసుకురావాలని కోరుకుంటున్నా. ‘గరుడవేగ’ కన్నా ఈ సినిమా బావుంటుంది. అందులో సందేహం లేదు’’ అన్నారు.


జీవితా రాజశేఖర్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమానికి వచ్చిన ప్రవీణ్‌ సత్తారుగారికి థ్యాంక్స్‌. ‘గరుడవేగ’తో రాజశేఖర్‌గారి ఇమేజ్‌ని తీసుకువెళ్లి ప్రవీణ్‌ సత్తారుగారు ఎక్కడో పెట్టారు. ఆ సినిమా తర్వాత చాలా కథలు విన్నాం. ‘గరుడవేగ’ హిట్‌ కావడంతో చాలామంది నిర్మాతలు సినిమా చేయడానికి వచ్చారు. కానీ, ఎవరొచ్చినా బిజినెస్‌ లెక్కలు వేసుకొచ్చి కథలు చెప్పారు. కొత్త నిర్మాతలు వచ్చి కథ మా ఇష్టమని అన్నా... వాళ్లు ఎలా తీస్తారో తెలియదనే టెన్షన్‌. రకరకాల టెన్షన్స్‌ మధ్య ‘కల్కి’ కథ విన్నాం. దీని ఒరిజినల్‌ రైటర్‌ సాయి తేజ. తను కథ వినిపించాడు. ప్రశాంత్‌ వర్మకు స్ర్కిప్ట్‌ విల్‌ అని కంపెనీ ఉంది. అందులో పది, పన్నెండు మంది రైటర్స్‌ ఉన్నారు. వాళ్ల దగ్గర ఎన్ని కథలున్నాయో. ప్రశాంత్‌కి ఖాళీ దొరికితే తడుముకోకుండా పది కథలు చెబుతాడు. అలా విన్న కథ ఇదే. మా అందరికీ బాగా నచ్చింది. ప్రశాంత్‌ డైరెక్ట్‌ చేస్తే బావుంటుదనుకున్నాం. తను మాత్రం డైలాగ్స్‌, స్ర్కీన్‌ప్లే చేసి వేరొకరితో డైరెక్ట్‌ చేయిస్తానని అన్నాడు. ఫుల్‌ స్ర్కిప్ట్‌, స్ర్కీన్‌ప్లే రెడీ అయ్యాక... ‘ప్రశాంత్‌ నువ్వే డైరెక్ట్‌ చేస్తే బావుంటుంది’ అని అడిగితే ‘సరే’ అన్నాడు. నేనే నిర్మాతగా స్టార్ట్‌ చేశాం. నిర్మాతగా ఉండటం చాలా కష్టం. ఈ బర్డెన్‌ ఎవరితో షేర్‌ చేసుకోవాలని అనుకుంటున్నప్పుడు సి. కల్యాణ్‌ అన్నయ్యను కలిశా. ఆయన ‘ఏం చేస్తున్నావమ్మా’ అని అడిగారు. ‘మనం పార్టనర్స్‌గా చేద్దాం’ అని కల్యాణ్‌ అన్నయ్య జాయిన్‌ అయ్యారు. అప్పట్నుంచి వెనక్కి తిరిగి చూడకుండా పూర్తి చేశాం. ప్రేక్షకులందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది. ఇప్పటి వరకూ విడుదల చేసిన టీజర్స్‌, కమర్షియల్‌ ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు.


ప్రశాంత్‌ వర్మ మాట్లాడుతూ ‘‘ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముందే హానెస్ట్‌ ట్రైలర్‌ విడుదల చేస్తున్నాం. సినిమా ఎలా ఉంటుందో చెప్పే విధంగా మోషన్‌ పోస్టర్‌, టీజర్‌, కమర్షియల్‌ ట్రైలర్‌, ఇప్పుడీ హానెస్ట్‌ ట్రైలర్‌ డిజైన్‌ చేశాం. కమర్షియల్‌ ట్రైలర్‌ విడుదలైన తర్వాత చాలామంది ‘కల్కి’ని ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’తో కంపేర్‌ చేశారు. సినిమాలో కామెడీ, ఐటమ్‌ సాంగ్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అన్నీ ఉన్నాయి. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కమర్షియల్‌ ట్రైలర్‌ కట్‌ చేశాం. సినిమా ఏంటనేది ఈ హానెస్ట్‌ ట్రైలర్‌ చెబుతుంది. 1983 నేపథ్యంలో కథ సాగుతుంది. పీరియడ్‌ సినిమాల కంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందనే కథలతో సినిమాలు తీయడానికి ఇష్టపడే దర్శకుణ్ణి నేను. చాలా రీసెర్చ్‌ చేసిన తర్వాత ‘కల్కి’ చేశా. ఇదొక ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌. అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. దర్శకుడిగా నా తొలి సినిమా ‘అ!’తో పోలిస్తే ‘కల్కి’ చాలా పెద్ద సినిమా. ఎక్కువ లొకేషన్స్‌లో భారీగా తీశాం. డేంజరస్‌ లొకేషన్స్‌లోనూ షూట్‌ చేశాం. రాజశేఖర్‌గారు ఫిజికల్‌గా చాలా కష్టపడ్డారు. వంద అడుగుల లొతైన ప్రదేశాల్లో షూటింగ్‌ చేశారు. సినిమా బ్లాక్‌బస్టర్‌ అయితేనే సినిమా బడ్జెట్‌ రాబట్టుకోగలం. ప్రవీణ్‌ సత్తారు ‘గరుడవేగ’ తీసి ఉండకపోతే... ‘కల్కి’ ఉండేది కాదు. జీవితగారు చాలా సహనంతో చాలా పనుల్ని హ్యాండిల్‌ చేస్తున్నారు. నాకు, నిర్మాత సి. కల్యాణ్‌కి మధ్య వారధి ఆవిడే. ఈ సినిమా కథ సాయి తేజది. స్ర్కిప్ట్‌ విల్‌ స్ర్కీన్‌ప్లే సమకూర్చింది. సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయిన తర్వాత కూడా స్ర్కిప్ట్‌పై వర్క్‌ చేశాం. సినిమా చూస్తుంటే... తర్వాత ఏం జరుగుతుందోనని ఎవరూ ఊహించలేని విధంగా ‘కల్కి’ ఉంటుంది. ‘కల్కి’ క్యారెక్టర్‌ అందరికీ నచ్చుతుంది. ఈ క్యారెక్టర్‌ని బేస్‌ చేసుకుని సినిమాలు చేయవచ్చు. ఒక ఫ్రాంచైజీలా. సినిమా చూశాక... అందరూ ‘కల్కి 2’ కోసం వెయిట్‌ చేస్తారు. సినిమాలో రెండు పాటలే ఉన్నాయి. నాలుగు థీమ్‌ సాంగ్స్‌ ఉన్నాయి. అవి మూడు భాషల్లో ఉంటాయి’’ అన్నారు.


సిద్ధూ జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో ఇంపార్టెంట్‌లో రోల్‌ ప్లే చేశా. పీరియడ్‌ ఫిల్మ్‌ కనుక విగ్గులు, వాటితో షూటింగ్‌ చేయడాన్ని ఎంజాయ్‌ చేశా’’ అన్నారు.


కృష్ణచైతన్య మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో బలి అనే క్యారెక్టర్‌ చేశా. సినిమా చూస్తే... పక్కాగా నోటీస్‌ చేస్తారు. రాజశేఖర్‌గారితో పని చేయడం నా అదృష్టం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రశాంత్‌ వర్మకు థ్యాంక్స్‌’’ అన్నారు.


అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణుగోపాల్, 'వెన్నెల' రామారావు, డి.ఎస్.రావు, సతీష్ (బంటి) ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.


ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, స్క్రీన్ ప్లే: స్క్రిప్ట్స్ విల్, ఆర్ట్: నాగేంద్ర, ఎడిటర్: గౌతమ్ నెరుసు, స్టిల్స్: మూర్తి, లిరిక్స్: కృష్ణకాంత్ (కె.కె), కాస్ట్యూమ్ డిజైనర్: అదితి అగర్వాల్, ఫైట్స్: నాగ వెంకట్, రాబిన్ - సుబ్బు, ప్రొడక్షన్ కంట్రోలర్: సలన బాలగోపాల్ రావు, చీఫ్ కో-డైరెక్టర్: మాధవ సాయి, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, పి.ఆర్.ఓ: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి, సమర్పణ: శివాని, శివాత్మిక, నిర్మాత: సి.కళ్యాణ్, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ.


Dr. Rajasekhar's 'Kalki' Honest Trailer released


The Honest Trailer of 'Kalki' was unveiled on Monday at Prasad Lab, in Hyderabad. Dr. Rajasekhar, the film's hero, was flanked by director Prasanth Varma, guest Praveen Sattaru and others on the stage. The film will hit the screens on June 28.
Speaking on the occasion, actor Siddhu Jonnalagedda said, "It's like I am here today with my extended family. Praveen Sattaru, with whom I have always loved to work, is here. 'Kalki' is a period film that has come out really well. I hope it does well for everybody associated with the project."
New actor Krishna Chaitanya said, "I have played a fearsome role in the movie and I am sure that everybody will notice me. I can't thank my director enough for this. He was my senior during Engineering days. The Honest Trailer is more effective than the recently-released Commercial Trailer. I am very excited ahead of the film's release."
Jeevitha Rajasekhar said, "I thank Praveen Sattaru for being here today. The Trailer launch has been delayed by several hours due to an unavoidable technical issue. I hope the media wouldn't mind it, as they are like our family. After 'PSV Garuda Vega', the only story we came across with the potential to rev up the image of Rajasekhar garu is 'Kalki'. Many producers approached us to do a film with him after 'Garuda Vega'. We were happy only with this story narrated by Prasanth Varma. He has a team of 10-12 members at Scriptsville and he can narrate several stories in 30 minutes. Initially, he merely wanted to write the film but later on, decided to wield the megaphone. Once we approached C Kalyan annayya, he assured us that he would produce the film and let us make money. After he came on board, we never had to look back. He never compromised on the quality. He gave us all the budget we needed. Every promotional video and song released so far has received extraordinary applause."
Director Prasanth Varma said, "We are releasing the Honest Trailer days ahead of the pre-release event. The Motion Poster, Teaser, Commercial Trailer and this Honest Trailer have been designed to build the right kind of expectations from the movie. After the commercial trailer was out, even non-resident audiences compared it with big names like 'Game Of Thrones'. 'Kalki' has got all commercial elements, including comedy and an item song. The commercial trailer was meant to impress the target audience. And the Honest Trailer tells you what the film is about."
He added, "The story is set in 1983. I am a director who likes to do films set in the future. Period drama is not my cup of tea. I took up to direct 'Kalki' only after doing thorough research. The production design, cinematography, etc had to be done meticulously. Although 'Kalki' is an investigative thriller, it is a commercial family film with no sleazy or embarrassing moments. Compared to my first film, this one was made on a bigger scale, having been shot in multiple locations. We had to travel extensively and shoot in slippery and dangerous places. Rajasekhar garu has put in so much physical work. He had to work for a day in a 100ft deep place. The technical team is working round the clock to give the best output on June 28. We will recover the investment only if the film becomes a blockbuster."

He further said, "This film wouldn't have been possible had Praveen Sattaru not made 'Garuda Vega'. Jeevitha garu has been working patiently, handling different works. She has been a bridge between me and producer C Kalyan garu. The film's story is by Sai Teja and the screenplay is by Scriptsville. They worked on the script continuously even during the making of the movie."


The director said, "The template that 'Kalki' follows is novel. You won't be able to predict what will happen in the next scene. I hope our film will set an example for others to follow. Kalki is a loveable character who can become a franchise. After watching the movie, you will wait for 'Kalki-2'. There are only two songs in the film, the other four being theme songs in three languages."


Dr. Rajasekhar said, "I could work with Kodi Ramakrishna garu, Raviraja Pinishetty garu and Muthyala Subbaiah garu repeatedly. In this generation, the likes of Praveen Sattaru and Prasanth Varma give me a sense of assurance. They make me feel secure. They have taught me to be measured in my performance to suit the tastes of today's audience. I am yet to watch 'Kalki'. I watched just 3 reels and it had me guessing throughout. I want to watch the entire film at one go. If a child passes with distinction, he would get scoldings the next time he doesn't score well. In the same way, we are expected to follow the high standards that 'Garuda Vega' has set. The director has worked hard to beat 'Garuda Vega' in terms of content. Jeevitha has been a backbone of the film. I engage myself with my character once I okay the script. And it is she who takes care of everything for me. We are glad that L Suresh garu, the financier, is associated with our project. He is considered a lucky hand. As for my daughters, I am proud that they have turned producers. When Chiranjeevi garu's son became a producer, he was very proud. I felt that I would have been proud like him had I had a son producing a movie. But my daughters are doing their best on the production front and making me proud."


C Kalyan said, "Kalki is both powerful and thrilling. I am sure it will be a bigger hit than 'Garuda Vega' and will reach even B and C centres. The way Rajasekhar talks in the movie is very entertaining. The story is novel and the way it has been executed, it's quite thrilling. I am getting calls from exhibitors, asking me to give the film to them. One person has bought the entire theatrical rights. The technical elements are terrific. They have been working tirelessly for one week."


Praveen Sattaru said, "Jeevitha garu is like Rajasekhar garu's backbone. Without her, 'Garuda Vega' wouldn't have happened. Coming to 'Kalki', the makers are conveying what they want to through the pre-release videos, which are creating a lot of curiosity. You will see Rajasekhar garu with full force in the movie. Prasanth Varma comes with a lot of command over all crafts of cinema. Rajasekhar garu is lots of fun to be with."


L Suresh said that the film is exceedingly good-looking. "It will get massive success and will give profit to everyone from the producers to the seller of snacks in theatres."


Cast & Crew:
Rajasekhar, Adah Sharma, Nandita Swetha, Poojitha Ponnada, Scarlett Wilson, Rahul Ramakrishna, Nasser, Ashutosh Rana, Siddhu Jonnalagadda, Shatru, Charandeep, Venugopal, 'Vennela' Rama Rao, DS Rao, Satish (Bunty) and others are part of the cast.


Music: Shravan Bharadwaj. Cinematography: Dasaradhi Shivendra. Screenplay: Scriptsville. Art: Nagendra. Editor: Goutham Nerusu. Stills: Murthy. Lyrics: Krishna Kanth (KK). Costume Designer: Aditi Agarwal. Fights: Naga Venkat, Robin-Subbu. Production Controller: Salana Balagopal Rao. Chief Co-Ordinator: Madhava Sai. Line Producer: Venkat Kumar Jetti. PRO: Naidu Surendra Kumar-Phani Kandukuri. Producer: C Kalyan. Director: Prasanth Varma.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !