View

సవారీ కొత్తగా ఉందంటున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్

Saturday,July06th,2019, 11:51 AM

బంధం రేగడ్ అనే ఇండిపెండెంట్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న సాహిత్ మోత్ కూరి సవారి చిత్రంతో దర్శకుడిగా మారారు. నందు ప్రియాంక శర్మ జంటగా నటించిన ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ సమావేశంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు.


ఈ కార్యక్రమానికి దర్శకుడు తరుణ్ భాస్కర్, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా, టి.ఎన్. ఆర్ పాల్గొన్నారు.


ఈ సందర్బంగా హీరో నందు మాట్లాడుతూ... ఇదివరకు నేను చాలా సినిమాల్లో నటించాను. సవారీ చిత్రం నా కెరీర్ లో బెస్ట్ అని భావిస్తున్నా. ఈ చిత్రం మిమ్మల్ని ఆకరిస్తుందని నమ్ముతున్నాను. డైరెక్టర్ సాహిత్ కొత్త కథను మీముందుకు తీసుకొని వస్తున్నారు. నిర్మాతలు సంతోష్ మోత్కురి, నిశాంక్ రెడ్డి కుడితి ఈ సినిమాను రాజీ పడకుండా నిర్మించారు. నా బాడీ ల్యాంగేజ్ , క్యారెక్టర్ ఈ సినిమాకు కరెక్ట్ గా సెట్ అయ్యాయి. త్వరలో ట్రైలర్ విడుదల చేసి విడుదల తేదీని ప్రకటిస్తాము" అన్నారు.


డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ... తెలుగు సినిమాల్లో కొత్త కథలు వస్తున్నాయి. ఈ చిత్ర దర్శకుడు సాహిత్ ఎంచుకున్న కథ డిఫరెంట్ గా ఉంది, దాన్ని తెరమీద బాగా చూపిస్తాడన్న నమ్మకం ఉంది. నందుకు ఈ సినిమాతో మంచి బ్రేక్ వస్తుందని నమ్ముతున్న. ఈ చిత్రానికి పనిచేసిన అందరూ టెక్నీషియన్స్ కు నిర్మాతలకు బెస్ట్ విషెస్ తెలుపుతున్న" అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మాట్లాడుతూ... ఈ కథ విన్నప్పుడే బాగా నచ్చింది. డైరెక్టర్ సాహిత్ గుడ్ టాలెంటెడ్, నిర్మాతలు బాగా తీశారు నిర్మాణ విలువలు బాగున్నాయి. నందుకు ఈ సినిమా బ్రేక్ ఇస్తుంది. అన్నీ పాటలు బాగా వచ్చాయి. త్వరలో సాంగ్స్ విడుదల చేస్తాము. సవారీ సినిమా మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్న"అన్నారు.


ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ... కొత్త చిత్రాలను యూత్ ఎప్పుడూ ఆదరిస్తున్నారు. సవారీ సినిమా టీజర్ కొత్తగా ఉంది. ఈ మూవీ ప్రేక్షకాదరణ పొందుతుందని నమ్ముతున్నాను. నందుకు, డైరెక్టర్ సాహిత్ కు ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకంటున్నా అన్నారు.


టి.ఎన్. ఆర్ మాట్లాడుతూ... తెలంగాణ స్లాంగ్ లో వస్తోన్న ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంది. ఈ చిత్ర దర్శకుడు సాహిత్ వర్క్ కు నేను ఫ్యాన్ ను, అతని ఇండిపెండెంట్ మూవీ చూసాను అద్భుతంగా తీశాడు. సవారీ అంతకుమించి ఉంటుందని భావిస్తున్నా, నందుకు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి" అన్నారు.


డైరెక్టర్ సాహిత్ మాట్లాడుతూ... మీడియా వారికి, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికి ధన్యవాదాలు. టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు వర్క్ చేసిన అందరూ టెక్నీషియన్స్ కు థాంక్స్, నందు ఈ పాత్రకు బాగా సెట్ అయ్యాడు. సినిమా విడుదల తరువాత మళ్ళీ మాట్లాడుతాను" అన్నారు.


హీరోయిన్ ప్రియాంక శర్మ మాట్లాడుతూ... నందు మంచి నటుడు, ఈ చిత్ర షూటింగ్ సమయంలో నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో నేను ఛాలెంగింగ్ రోల్ చేసాను, నా మీద నమ్మకంతో నాకు ఈ పాత్ర ఇచ్చిన డైరెక్టర్ సాహిత్ కు థాంక్స్. టీజర్ బాగుందని ఫ్రెండ్స్ చెబుతున్నారు. సినిమా కూడా అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను" అన్నారు.


సాంకేతిక వర్గం:
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సాహిత్ మోత్ కూరి
నిర్మాతలు: సంతోష్ మోత్కురి, నిశాంక్ రెడ్డి కుడితి
బ్యానర్: కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్, నిషా ఫిలింస్
సంగీతం:శేఖర్ చంద్ర
ఎడిటర్: సంతోష్ మీనం
సినిమాటోగ్రఫీ: మోనిశ్ భూపతిరాజు
ఆర్ట్: అర్జున్ సూరిశెట్టి
డిఐ: విష్ణు వర్ధన్
ఆడియోగ్రఫీ: రాధాకృష్ణ
ప్రొడక్షన్ డిజైన్: అభిజిత్ గుముడవెల్లి
పబ్లిసిటీ డిజైన్: అనిల్ భాను
పీఆర్ ఓ: వంశీశేఖర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !