View

ఇంటర్య్వూ - నిర్మాత కె.వెంకట్ రామ్ రెడ్డి (కెఎస్100)

Saturday,July06th,2019, 12:21 PM

చంద్రశేఖరా మూవీస్‌ పతాకంపై కె. వెంకట్‌రామ్‌రెడ్డి నిర్మాతగా మోడలింగ్‌ స్టార్స్‌ సమీర్‌ ఖాన్‌, సునీతా పాండే, శైలజా తివారి, ఆశిరాయ్‌, శ్రద్దా శర్మ, అక్షిత మాధవ్‌ హీరోహీరోయిన్‌లుగా షేర్‌ (షాలిని ఫేమ్‌) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''కెఎస్‌100 ''.. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన రాగా ఇటీవల విడుదలైన ట్రైలర్‌,ఆడియో సినిమాపై మరిన్ని అంచనాలనుపెంచింది.జులై12నప్రపంచవ్యాప్తంగాసినిమారిలీజ్‌కాబోతుంది. ఈ సందర్భంగా నిర్మాత కె. వెంకట్‌రామ్‌రెడ్డి ఇంటర్వ్యూ.


మీ జర్నీ గురించి చెప్పండి?
- మాది ఇంపోర్ట్స్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ బిజినెస్‌. నేను 1995 నుండి ఇండస్ట్రీలో ఉన్నాను. ఎక్కువగా ఇంగ్లీష్‌ మూవీస్‌ని తెలుగులో డబ్బింగ్‌ చేసి విడుదల చేసేవాడిని. ఇప్పటి వరకు నేను దాదాపు 25 మూవీస్‌ని విడుదల చేశాను, అవి నాకు మంచి పేరు తెచ్చాయి. తరువాత నిర్మాతగా 2000లో 'టైమ్‌ పాస్‌' అనే తెలుగు సినిమా ద్వారా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నాను. ఆ తరువాత 'మోడ్రన్‌ గర్ల్‌' అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించాను. ఇప్పుడు 'కె ఎస్‌ 100' నిర్మాతగా నా మూడవ చిత్రం.


కెఎస్‌ 100 గురించి ?
- ఇది ఒక రొమాంటిక్‌ హారర్‌ చిత్రం. కేవలం హారర్‌ కాకుండా మంచి ఎమోషన్‌ కూడా ఉంటుంది. ఫస్ట్‌ ఆఫ్‌ మొత్తం హారర్‌, కామెడీతో ఎంటర్‌ టైనింగ్‌గా సాగుతూ సెకండ్‌హాఫ్‌కి వచ్చేసరికి మంచి ఫ్యామిలీ ఎమోషన్‌తో ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూశాం..అనే అనుభూతిని కలిగిస్తుంది.


టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏంటి?
- ఈ సినిమాలో కె ఎస్‌ అంటే కుమార్‌, స్వామి అనే ఇద్దరు బెస్ట్‌ఫ్రెండ్స్‌. 100 సంవత్సరాలు వారి ఫ్రెండ్‌ షిప్‌ అలాగే ఉండాలి అనుకుంటారు. కానీ వారి జీవితాల్లో జరిగే సంఘటనల కారణంగా వారి ఫ్రెండ్షిప్‌ వీడిపోతుంది. అసలు ఎందుకు వారు శత్రువులుగా మారారు? మళ్ళీ కలిసారా లేదా? అనేది సినిమా.


దర్శకుడు షేర్‌ మేకింగ్‌ స్టైల్‌ గురించి చెప్పండి?
- దర్శకుడు షేర్‌ కూడా చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలోనే ఉన్నారు. అన్ని శాఖలపై అవగాహనఉంది. నాకు ఈ కథ చెప్పగానే చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఆతరువాత షేర్‌ దర్శకత్వం వహించిన చిత్రాలు చూసి ఈ కథకు పూర్తి న్యాయం చేయగలడని దర్శకత్వ భాద్యతలు ఇవ్వడం జరిగింది. తనుకూడా ఎంతో ఫ్యాషన్‌తో అనుకున్న బడ్జెట్‌ లోనే సినిమాను తెరకెక్కించారు. మేము ఊహించని బడ్జెట్‌లో బిజినెస్‌ అవుతుంది.


సినిమా బిజినెస్‌ ఎలా ఉంది?
- చాలా బాగుంది !. సినిమా జులై 12న రిలిజ్‌ ఉంది కాబట్టి ఆల్రెడీ మ్యాగ్జిమమ్‌ ఏరియాల్లో బిజినెస్‌ అయిపోయింది. నైజాం, సీడెడ్‌, బెంగుళూర్‌, నెల్లూరులో ఆల్రెడీ బిజినెస్‌ అయింది. త్వరలోనే క ష్ణ, గుంటూరు కూడా అవుతుంది. ఇంకా హిందీ రైట్స్‌, డిజిటల్స్‌ రైట్స్‌ నా దగ్గరే ఉన్నాయి. అవి కాకుండానే మంచి బిజినెస్‌ జరిగి నేను సేఫ్‌లో ఉన్నాను. మా సినిమాను నిజాంలో 100 థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. అలాగే ఓవర్‌సిస్‌లో కూడా మంచి బిజినెస్‌ జరిగింది.


ట్రైలర్‌ చూస్తుంటే కొంత అడల్ట్‌ కంటెంట్‌ కూడా కనిపిస్తుంది?
- సబ్జెక్టు పరంగా కొంత అడల్ట్‌ కంటెంట్‌ అయితే ఉంది కానీ.. కథ పరంగా వెళ్ళామే తప్ప మేము ఎక్కడా పరిధి దాటలేదు. అందుకనే సెన్సార్‌ వారు ఒక్క కట్‌ కూడా చెప్పలేదు. థియేటర్స్‌ నుండి రెస్పాన్స్‌ కూడా చాలా బాగుంది.


హీరో హీరోయిన్స్‌ గురించి చెప్పండి?
- మంచి కంటెంట్‌ ఉన్న స్టోరీ కాబట్టి అందరూమోడల్స్‌ నే తీసుకోవడం జరిగింది. సమీర్‌ ఖాన్‌, సునీతా పాండే, శైలజ తివారి, ఆశిరాయ్‌, శ్రద్దా శర్మ, అక్షిత మాధవ్‌ లు వారి బెస్ట్‌ పెర్ఫార్మన్సులు ఇచ్చారు. అలాగే ఇటీవల ఎన్నో సినిమాల్లోనటించి నేషనల్‌ చైల్డ్‌ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చునకున పూర్వి అనే అమ్మాయి ఒక కీలక పాత్రలో నటించింది. ఆ క్యారెక్టర్‌ మనల్ని అందరినీ ఆలోచింపజేస్తుంది. అలాగే కల్పన, నందిని, సుమన్ ఇలా ప్రతి ఒక్కరు తమ పరిధి మేర బాగా నటించారు.


ఈ సినిమాను తమిళ్‌ లో డబ్‌ చేసే అవకాశం ఉందా?
- ఇటీవల మా సినిమా చూసి నచ్చడంతో తమిళ్‌ డబ్బింగ్‌ రైట్స్‌ తీసుకున్నారు. తమిళ్‌ డబ్బింగ్‌ రైట్స్‌ కూడా మంచి రేటుకి అమ్ముడయ్యాయి.


ఇప్పుడు చిన్న బడ్జెట్‌ సినిమాలకు రెస్పాన్స్‌ ఎలా ఉంది?
- చిన్న బడ్జెట్‌ సినిమా అయినా, మీడియం బడ్జెట్‌ అయినా కంటెంట్‌ బాగుంటేనే రెస్పాన్స్‌ బాగుంటుంది. అందుకని నేను కూడా కంటెంట్‌ ఉన్న స్టోరీస్‌కే ప్రాధాన్యం ఇస్తున్నాను. అందుకనేమంచి కంటెంట్ ఉన్న సబ్జెక్ట్, దాన్ని కరెక్ట్ గా హేండిల్ చేయగల దర్శకుడు ఉంటే ప్రేక్షకులనుండి ఎప్పటికీ మంచి ఆదరణ ఉంటుంది.


నెక్స్ట్‌ ప్రాజెక్ట్స్‌ ఏంటి?
- మా బ్యానేర్‌లోనే దర్శకుడు షేర్‌తో ఇంకో సినిమా ప్లాన్‌ చేస్తున్నాం. టైటిల్‌ కూడా 'దిడైమండ్‌' అని పెట్టడం జరిగింది. వచ్చే నెల నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. అది కూడా మంచి కంటెంట్‌ ఉన్న సబ్జెక్ట్‌.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు నిర్మాత కె. వెంకట్‌రామ్‌రెడ్డి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !