View

సమంత చేతుల మీదుగా విడుదలైన 'ఎవ‌రు' టీజ‌ర్

Friday,July19th,2019, 02:59 PM

క్ష‌ణం, అమీ తుమీ, గూఢ‌చారి వంటి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న అడివిశేష్ క‌థానాయ‌కుడుగా రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ ఎవ‌రు. బ‌లుపు, ఊపిరి, క్ష‌ణం వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా బ్యాన‌ర్‌పై ఈ చిత్రం నిర్మిత‌మ‌వుతోంది. వెంక‌ట్ రామ్‌జీ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాత‌లు. ఈ చిత్రంలో రెజీనా క‌సండ్ర హీరోయిన్‌గా న‌టిస్తుంది. న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఆగ‌స్ట్ 15న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. శుక్ర‌వారం ఈ సినిమా టీజ‌ర్‌ను హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. స‌మంత అక్కినేని ముఖ్య అతిథిగా హాజ‌రై టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...


స‌మంత అక్కినేని మాట్లాడుతూ - నాకు టీజ‌ర్ చాలా బాగా న‌చ్చింది. యంగ్ టీమ్ క‌ల‌సిచేసిన ఓ సినిమా. ప్ర‌స్తుతం తెలుగు సినిమాకు గ్రేట్ టైమ్‌. ప్ర‌తి ఒక కాన్సెప్ట్ మూవీని ఆద‌రిస్తున్నారు. అంద‌రికీ ధైర్యం వ‌చ్చింది. ఈ ధైర్యాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. టీజ‌ర్ మాత్రం చాలా బాగా న‌చ్చింది. క్యూరియాసిటీ పెరిగింది. ప్ర‌తి సన్నివేశం ఆస‌క్తిక‌రంగా ఉంది. సినిమాటోగ్రాఫ‌ర్ వంశీ, ఎడిట‌ర్ గ్యారీ, శ్రీచ‌ర‌ణ్‌, డైరెక్ట‌ర్‌గారు కొత్త‌వాడ‌ని ఎవ‌రూ అనుకోరు. అంత అద్భుతంగా తెర‌కెక్కించారు. అడివిశేష్ కొత్త కంటెంట్ సినిమాతో ఇండ‌స్ట్రీని ముందుకు తీసుకెళ్తున్నాడు. త‌న నుండి మ‌రిన్ని సినిమాల‌ను ఎదురుచూస్తున్నాను. రెజీనా మంచి న‌టి. ఆమెకు మంచి అవ‌కాశాలు రావాల‌ని అనుకుంటున్న స‌మ‌యంలో ఈ సినిమాలో అవ‌కాశం ద‌క్కింది. న‌వీన్‌చంద్ర స‌హా ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది వెరీ బెస్ట్‌ అన్నారు.

 

డైరెక్ట‌ర్ వెంక‌ట్ రామ్‌జీ మాట్లాడుతూ - సాధార‌ణంగా ప్ర‌తి సినిమాకు కొంత మంది మెయిన్ పిల్ల‌ర్స్ ఉంటారు. ఈ సినిమాలోని అలాంటి పిల్ల‌ర్స్‌లో ముందుగా చెప్పుకోవాల్సింది పివిపిగారి గురించి. అలాగే సెకండ్ పిల్ల‌ర్‌గా స్టోరీ డెవ‌ల‌ప్‌మెంట్‌, స్క్రిప్ట్ రైటింగ్‌లో అయినా నేను, శేష్‌, అబ్బూరి ర‌విగారు క‌లిసే ట్రావెల్ చేశాం. మేమే రెండో పిల్ల‌ర్‌గా ప‌నిచేశాం. ఇక మూడో పిల్ల‌ర్ మా న‌టీన‌టులు. శేష్‌, న‌వీన్‌, రెజీనాగారు అద్భుతంగా న‌టించారు. ఇక నాలుగో పిల్ల‌ర్ మా టెక్నిక‌ల్ టీమ్‌. వంశీ, గ్యారీ, శ్రీచ‌ర‌ణ్ ఇలా అంద‌రూ నా కోసం ప‌నిచేశారు. వారి ప్రేమ‌ను చూశాను. ఇంత మంచి టీమ్‌తో క‌లిసి ప‌నిచేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.

 

హీరో అడివిశేష్ మాట్లాడుతూ - మా టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి వ‌చ్చిన స‌మంత‌కు థాంక్స్‌. గూఢ‌చారి స‌మ‌యంలో ఆమె స‌పోర్ట్ చేశారు. ఆమెలో పాజిటివ్ వైబ్సే ల‌క్‌గా మారుతున్నాయి. ఇదొక ఎమోష‌న‌ల్ జ‌ర్నీ. క్ష‌ణం ముందు వ‌ర‌కు న‌న్ను అంద‌రూ విల‌న్‌గా చూశారే త‌ప్ప‌.. మెయిన్ లీడ్‌గా ఎవ‌రూ చూడ‌లేదు. అలాంటి సంద‌ర్భంలో న‌న్ను న‌మ్మిన ఒకే ఒక వ్య‌క్తి పివిపిగారు.. ఆయ‌న‌కు నా థాంక్స్‌. `ఎవ‌రు` నాకు బాగా న‌చ్చిన స్టోరి. నాకు న‌చ్చిన జోన‌ర్ థ్రిల్ల‌ర్. ఈ సినిమాను రాయ‌డానికి రెడీ అయిన‌ప్పుడు గూఢ‌చారి కంటే ఈ సినిమా బావుంటుందా? అని చాలా మంది అడిగారు. కానీ గూఢ‌చారి యాక్ష‌న్ డ్రామా. క్ష‌ణం నేను చేసిన థ్రిల్ల‌ర్‌. అలాంటి థ్రిల్ల ర్ సినిమానే ఇది. వెంక‌ట్‌తో ఈ సినిమాలో చేసే ప్ర‌తి షాట్ నువ్వే పెట్టే లాస్ట్ షాట్ అనేలా మ‌నుసు పెట్టి చెయ్ అన్నాను. నేనెప్పుడూ మంచి సినిమాలో భాగం కావాల‌నుకుంటాను. ఎందుకంటే మ‌నం ఉండొచ్చు.. లేక‌పోవ‌చ్చు. కానీ మంచి సినిమా ఎప్పుడూ ఉండిపోతుంది. ఆ న‌మ్మ‌కంతో తీసిన సినిమా.. అదే న‌మ్మ‌కంతో చేసిన సినిమా. ఈ సినిమాను ముందుగా ఆగ‌స్ట్ 23న రిలీజ్ చేయాల‌నుకున్నాం. కానీ సాహో అనే పెద్ద తుఫాన్‌ని త‌ట్టుకునే చేయాల‌నుకున్నాం. కానీ ఆ సినిమా వాయిదా ప‌డటంతో మా సినిమాను ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేస్తున్నాం. ఆరోజున సినిమా విడుద‌ల చేయ‌నుండటం మా అదృష్టంగా భావిస్తున్నాను. క‌చ్చితంగా సినిమాను అంద‌రూ ఎంజాయ్‌చేస్తారు అన్నారు.


న‌వీన్ చంద్ర మాట్లాడుతూ - చాలా మంచి క్యారెక్ట‌ర్ చేశాను. టీజ‌ర్‌ను ఎలా ఎంజాయ్ చేశారో.. సినిమాను అంత‌కంటే బాగా ఎంజాయ్ చేస్తారు. ఆగ‌స్ట్ 15న గ‌ట్టిగా కొడుతున్నాం అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ - వెంకట్ రామ్‌జీగారితో మాట్లాడ‌టం ఛాలెంజింగ్‌గా అనిపించింది. అవ‌కాశం ఇచ్చినందుకు థ్యాంక్యూ అన్నారు.


సినిమాటోగ్రాఫ‌ర్ వంశీ మాట్లాడుతూ - నాకు శేష్‌తో టెక్నీషియ‌న్‌గా క‌లిసి ప్ర‌యాణం చేస్తున్నాను. త‌న‌తో మంచి ప‌రిచయం ఉంది. అలాగే న‌వీన్ కూడా తెలుసు. వెంక‌ట్ స్క్రిప్ట్ నెరేషన్ ఇచ్చాక ఛాలెంజింగ్‌గా అనిపించింది. నా జాబ్‌కు న్యాయం చేశాన‌ని అనుకుంటున్నాను. ఆగ‌స్ట్ 15 కోసం వెయిట్ చేద్దాం అన్నారు.


ఎడిట‌ర్ గ్యారీ మాట్లాడుతూ - క్ష‌ణం, గూఢ‌చారి సినిమాల నుండి ఈ టీమ్‌తో ట్రావెల్ అవుతున్నాను. బాగా క‌ష్ట‌ప‌డ్డాం. ఆగ‌స్ట్ 15న సినిమా విడుద‌ల‌వుతుంది అన్నారు.


రైట‌ర్ అబ్బూరి ర‌వి మాట్లాడుతూ - నాకు 2017 ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్స్‌లో రామ్‌జీ ఒక‌డు. త‌ను చాలా మంచోడు. సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. రామ్‌జీ వ‌ర్కే దీని ప‌రంగా మేజ‌ర్ పార్ట్ తీసుకున్నాడు. టీజ‌ర్ న‌చ్చింద‌నే అనుకుంటున్నాను. సినిమా కూడా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. శేష్‌తో కల‌సి ట్రావెల్ చేయ‌డం ఎప్పుడూ ఛాలెంజే అన్నారు.


ఈ కార్య‌క్ర‌మంలో నిహాల్‌, రాజా ర‌వీంద్ర‌, జాహ్న‌వి త‌దిత‌రులు పాల్గొన్నారు.


న‌టీన‌టులు:
అడివిశేష్‌, రెజీనా కసండ్ర‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: వెంక‌ట్ రామ్‌జీ, నిర్మాత‌లు: పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, సినిమాటోగ్ర‌ఫీ: వ‌ంశీ ప‌చ్చిపులుసు, సంగీతం: శ‌్రీచ‌ర‌ణ్ పాకాల‌, ఆర్ట్‌: అవినాష్ కొల్ల‌, ఎడిటింగ్‌: గ్యారీ బి.హెచ్‌, డైలాగ్స్‌: అబ్బూరి ర‌వి, కాస్ట్యూమ్స్‌: జాహ్న‌వి ఎల్లోర్‌, సురా రెడ్డి, సౌండ్ ఎఫెక్ట్స్‌: య‌తిరాజ్‌, పి.ఆర్‌.ఒ: వంశీ కాకాAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !